ఎవరు మద్యానికి బానిస... ప్రభాస్-అల్లు అర్జున్ మధ్య ముదిరిన ఫ్యాన్ వార్..!
స్టార్ హీరోగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ సర్వసాధారణం. తరచుగా ప్రభాస్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా కొట్టుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి వీరి మధ్య సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.

ప్రభాస్ టాలీవుడ్ లో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న మొదటి హీరో. బాహుబలి చిత్రాలతో ఆయన ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. జపాన్ వంటి దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అనంతరం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.
ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో విడుదలైన పుష్ప మొదటి రోజు కేవలం మూడు కోట్ల వసూళ్లు అందుకుంది. అయితే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండటంతో పుష్ప రోజు రోజుకు పుంజుకుంది. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో పుష్ప హిందీలో హిట్ కొట్టింది. ఆ విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు.
అయితే ప్రభాస్ జస్ట్ లాటరీ స్టార్. రాజమౌళి కారణంగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు. అంతకు మించి ప్రభాస్ లో గొప్ప ప్రత్యేక ఏమీ లేదు. అల్లు అర్జున్ గ్రేట్. తన టాలెంట్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. సుకుమార్ వంటి దర్శకుడికి ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చాడు అంటారు.
అదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేశాడు. తన పీఆర్ టీమ్ తో లేని ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు. అల్లు అర్జున్ సర్జరీల హీరో. అంతా ఫేక్ ఇమేజ్ అని ట్రోల్ చేస్తుంటారు. అల్లు అర్జున్ - ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవలు తరచుగా జరుగుతూ ఉంటాయి.
తాజాగా మీ హీరో తాగుబోతు అంటే మీ హీరో తాగుబోతు అని సోషల్ మీడియా వార్ కి దిగారు. ప్రభాస్ ఫ్యాన్ ఒకరు వివిధ సందర్భాల్లో అల్లు అర్జున్ కి ఆల్కహాల్ అలవాటు ఉందని నిరూపించే ఫోటోలు షేర్ చేస్తూ ఎక్స్ లో ఒక థ్రెడ్ వదిలాడు. సదరు సోషల్ మీడియా పోస్ట్ లో అల్లు అర్జున్ తనకు ఆల్కహాల్ అలవాటు ఉందని చెప్పిన వీడియో కూడా ఉంది.
Allu Arjun - Prabhas
ఇక ఎప్పటి నుండో ప్రభాస్ ఆల్కహాలిక్ అంటే ప్రచారం యాంటీ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ కి విపరీతమైన మందు అలవాటు ఉంది. అందుకే ప్రభాస్ ఆరోగ్యం చెడిపోతుందని ఎగతాళి చేస్తూ ఉంటారు.
నిజాలు ఏమైనా అల్లు అర్జున్-ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్ తారా స్థాయికి చేరింది. ఒకరిని మరొకరు దారుణంగా దూషించుకుంటున్నారు. కాగా అల్లు అర్జున్-ప్రభాస్ మంచి మిత్రులు. వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అభిమానులు మాత్రం అనవసరంగా కొట్టుకుంటూ ఉంటారు.