- Home
- Entertainment
- శోభిత తలకి చుట్టుకున్న రూమర్స్, పెద్ద చిక్కే వచ్చిందిగా .. ఫేక్ అకౌంట్ నుంచి సమంతపై కామెంట్స్
శోభిత తలకి చుట్టుకున్న రూమర్స్, పెద్ద చిక్కే వచ్చిందిగా .. ఫేక్ అకౌంట్ నుంచి సమంతపై కామెంట్స్
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత హాట్ గ్లామర్ తో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తోంది. అలాగే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటోంది.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత హాట్ గ్లామర్ తో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తోంది. అలాగే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.
ఇటీవల శోభిత గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కినేని నాగ చైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ ఎవరో సృష్టిచారని నాగ చైతన్య క్యాంప్ మండిపడింది కూడా. ఈ విషయంలో సమంతపై కూడా కామెంట్స్ వినిపించడం.. సామ్ ఘాటుగా సమాధానం ఇవ్వడం చూశాం.
సమంత ఈ రూమర్స్ సృష్టించింది అని కూడా కామెంట్స్ చేశారు. ఒక అబ్బాయిపై రూమర్స్ వస్తే అందుకు కారణంగా అమ్మాయిని బ్లేమ్ చేస్తారా అంటూ సామ్ ఒక రేంజ్ లో ఫైర్ ఐంది. ఇక నాగ చైతన్య టీమ్ కూడా ఈ రూమర్స్ ని ఖండించారు. ఇక శోభిత దూళిపాళ.. ఇంస్టాగ్రామ్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ వీడియో పోస్ట్ చేసింది. వస్తున్న రూమర్స్ ని శోభిత ఇలా ఘాటుగా ఖండించింది.
ఈ వ్యవహారంలో శోభితకి ఇంకా చిక్కులు వీడలేదు. ట్విట్టర్ లో శోభిత పేరుతో ఓ ఫేక్ అకౌంట్ నుంచి సమంతని విమర్శిస్తూ పోస్ట్ వైరల్ ఐంది. ఇది ఫేక్ అకౌంట్ అని తెలియని వారు నిజంగా శోభితే ఈ కామెంట్స్ చేసిందేమో అనుకుంటున్నారు. ఈ వ్యవహారం తన తలకి చుట్టుకోవడంతో శోభిత మరోసారి స్పందించాల్సి వచ్చింది.
తనకు ఇంస్టాగ్రామ్ ఖాతా తప్ప మరే సోషల్ మీడియా ఖాతా లేదు అంటూ శోభిత క్లారిటీ ఇచ్చింది. మిగిలిన మాధ్యమాల్లో తన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అన్ని తేల్చేసింది. దీనితో ఈ వివాదానికి శోభిత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
ఇదిలా ఉండగా శోభిత రీసెంట్ గా అడివి శేష్ మేజర్ మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ తెలుగు బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.