MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita: ప్రెగ్నెన్సీ వార్తలపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చేసిన శోభితా.. ఇప్పుడు ఫోకస్‌ అంతా అటు షిఫ్ట్

Sobhita: ప్రెగ్నెన్సీ వార్తలపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చేసిన శోభితా.. ఇప్పుడు ఫోకస్‌ అంతా అటు షిఫ్ట్

అక్కినేని ఫ్యామిలీకి వారసులు రాబోతున్నారని, శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌ తో ఉందనే వార్తలు ఆ మధ్య సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా శోభితా అదిరిపోయే విధంగా క్లారిటీ ఇచ్చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 12 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శోభితాని రెండో పెళ్లి చేసుకున్న నాగచైతన్య
Image Credit : Instagram/@sobhitad

శోభితాని రెండో పెళ్లి చేసుకున్న నాగచైతన్య

హీరోయిన్‌ శోభితా ఇప్పుడు అక్కినేని కోడలుగా రాణిస్తున్నారు. ఆమె 2024 డిసెంబర్‌లో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభితాకి కనెక్ట్ అయ్యారు. దాదాపు మూడేళ్లపాటు తమ ప్రేమని రహస్యంగా కొనసాగించి, ఆ తర్వాత ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. చైతూ, సమంత పెళ్లి ఎలా గ్రాండ్‌ గా చేశారో, అలాగే చైతూ, శోభితా మ్యారేజ్‌ ని కూడా గ్రాండ్‌గా నిర్వహించాడు నాగార్జున. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన సంతోషాన్ని కూడా పంచుకుంది శోభితా.

26
వృషకర్మతో రాబోతున్న నాగ చైతన్య
Image Credit : instagram/ Naga chaitanya

వృషకర్మతో రాబోతున్న నాగ చైతన్య

ప్రస్తుతం నాగచైతన్య, శోభితా దూళిపాళ తమ ఫ్యామిలీ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. మ్యారేజ్‌ తర్వాత శోభితా పెద్దగా బయటకు రాలేదు. మరోవైపు పెళ్లి తర్వాతనే నాగచైతన్యకి హిట్‌ వచ్చింది. ఆయన గతేడాది `తండేల్‌`తో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు `వృషకర్మ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారీ యాక్షన్‌ పీరియాడికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. మరోవైపు శోభితా పెళ్లి తర్వాత సినిమాలు మానేసిట్టుంది. ఆమె ఆ తర్వాత మళ్లీ మెరవలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.

Related Articles

Related image1
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
Related image2
MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
36
చీకటిలో సిరీస్‌తో శోభితా కమ్‌ బ్యాక్‌
Image Credit : @sobhita dhulipala

చీకటిలో సిరీస్‌తో శోభితా కమ్‌ బ్యాక్‌

శోభితా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ కోసం `చీకటిలో` అనే సిరీస్‌లో నటిస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇది. జనవరి 26 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. తాజాగా ఈ ట్రైలర్‌ విడుదలయ్యింది. క్రైమ్‌ నేపథ్యంలో సీరియల్‌ కిల్లర్‌గా చుట్టూ సాగుతుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. ఆ మర్డర్‌ మిస్టరీలను బయటపెట్టేందుకు న్యూస్‌ ఛానెల్స్ లో పని చేసే సంధ్య పాడ్‌ కాస్ట్ పేరుతో సీరియల్‌ కిల్లర్‌ వివరాలను, క్రైమ్‌ జరిగే విధానాన్ని వెల్లడించింది. రెగ్యూలర్‌ క్రైమ్‌ స్టోరీతో ఇది సాగేలా ఉంది. కాకపోతే ఇంకా ఏదో రన్‌ అవుతుంది. అది క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది.

46
అన్నపూర్ణ స్టూడియో వర్కర్లకు శోభితా, చైతూ భోజనాలు
Image Credit : ChayAkkineniFC/X

అన్నపూర్ణ స్టూడియో వర్కర్లకు శోభితా, చైతూ భోజనాలు

శోభితా తాజాగా తన భర్త నాగ చైతన్యతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ స్టాఫ్‌కి భోజనాలు ఏర్పాటు చేశారు. చైతూ, శోభితాలు స్వయంగా తమ వర్కర్లకి భోజనాలు వడ్డించడం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఎల్లో కలర్‌ శారీలో మెరిసింది శోభితా. చీరలో అదిరిపోయింది. ఎప్పుడూ ట్రెండీ వేర్‌లో మెరిసే ఆమె ఇలా చీరలో కనిపించడంతో చాలా కొత్తగా ఉంది. ఆమె అందం రెట్టింపు అయ్యింది.

56
ప్రెగ్నెన్సీపై శోభితా అదిరిపోయే క్లారిటీ
Image Credit : instagram/@sobhitad

ప్రెగ్నెన్సీపై శోభితా అదిరిపోయే క్లారిటీ

ఇదిలా ఉంటే ఈ లేటెస్ట్ ఫోటోల ద్వారా శోభితా ఓ క్లారిటీ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ రూమర్లకి చెక్‌ పెట్టింది. శోభితా ఇటీవల శోభితా ప్రెగ్నెంట్‌తో ఉందని, త్వరలో అక్కినేని ఫ్యామిలీలోకి వారసులు రాబతున్నారని, నాగార్జున తాత కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శోభితాని చూస్తుంటే అలాంటిది ఏం లేదని అర్థమవుతుంది. బేబీ బంప్‌ ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో ఇది కేవలం రూమరే అనే అనిపిస్తుంది. ఏం స్పందించకుండానే జస్ట్ లుక్‌తోనే రూమర్లకి చెక్‌ పెట్టింది శోభితా. మరి ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

66
అఖిల్‌ భార్య జైనబ్‌ ప్రెగ్నెంట్‌తో ఉందా?
Image Credit : Instagram

అఖిల్‌ భార్య జైనబ్‌ ప్రెగ్నెంట్‌తో ఉందా?

అయితే ఇప్పుడు శోభితా లేటెస్ట్ లుక్‌ని చూస్తే ఆమె ప్రెగ్నెంట్‌ కాదనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ వార్తలు నాగార్జున చిన్న కోడలు వైపు తిరిగాయి. అక్కినేని అఖిల్‌ కూడా ఇటీవల వ్యాపారవేత్త జైనాబ్‌ రవ్జీని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌తో ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మధ్య నాగార్జునకి కూడా చిన్న కోడలి విషయంలోనే మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలో తాత పోస్ట్ కి షిఫ్ట్ అవుతున్నారని అడగ్గా, టైమ్‌ వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడుతా అన్నారు. ఆయన ఆ వార్తలను ఖండించలేదు. దీంతో తాజా పరిణామాలను బట్టి జైనబ్‌ ప్రెగ్నెంట్‌ తో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అఖిల్‌ ఇప్పుడు `లెనిన్‌` చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Related Stories
Recommended image1
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
Recommended image2
MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved