- Home
- Entertainment
- వెంకటేష్ కి హ్యాండిచ్చిన శోభన్ బాబు.. సూపర్ హిట్ మూవీ మిస్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలను రిజెక్ట్
వెంకటేష్ కి హ్యాండిచ్చిన శోభన్ బాబు.. సూపర్ హిట్ మూవీ మిస్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలను రిజెక్ట్
తెలుగు ఆడియెన్స్ హృదయాలో సోగ్గాడిగా నిలిచిపోయిన శోభన్ బాబు మరో స్టార్ హీరోకి కూడా ఝలక్ ఇచ్చాడు. నిర్మొహమాటంగా ఆయన తిరస్కరించారు. ఆ సినిమా ఏంటో చూస్తే..

Sobhan Babu
తెలుగు తెర సోగ్గాడు శోభన్‌బాబు.. అందానికి, అద్బుతమైన నటనకు కేరాఫ్. అంతేకాదు సిస్టమాటిక్ లైఫ్‌ని లీడ్ చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. మందు, సిగరేట్ జోలికి వెళ్లలేదు. అంతేకాదు తన అలవాటైనా కాఫీని కూడా ఓ దశలో మానేసిన ఘనత ఆయనది. పూర్తిగా ఓ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని పదిలపర్చుకున్నారు. ప్రారంభం నుంచి చనిపోయేంత వరకు కూడా సేఫ్ ఫిట్‌నెస్‌ని మెయింటేన్ చేశారు.
ఆరవై ఏళ్ల వయసులోనూ ఆడవాళ్లు పడిపోయేలా ఆయన తన ఫిజిక్‌ని మెయింటేన్ చేయడం విశేషం. అందుకే శోభన్ బాబు సోగ్గాడిగా తెలుగు తెరపై నిలిచిపోయారు. ఆ విషయాల్లోనే కాదు, యాక్టింగ్ విషయంలోనూ నియమాలు పెట్టుకున్నాడు శోభన్‌బాబు. ఓ ఏజ్‌కి వచ్చాక నటించకూడదని నిర్ణయించుకున్నారు. తనకు తాను రిటైర్ మెంట్ ప్రకటించుకున్నారు. వెండితెరపై తనని సోగ్గాడిగానే జనం చూడాలని, ఆ రూపంలోనే జనం హృదయాల్లో నిలిచిపోవాలని, వృద్ధుడిగా కనిపించకూడదని సినిమాలకు గుడ్ బై చెప్పారు శోభన్‌బాబు.
రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత శోభన్‌బాబు సినిమాలు చేయలేదు. ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. పెద్ద హీరోల సినిమాల్లోనూ నటించేందుకు నో చెప్పారు. అలా ఇప్పటి వరకు మూడు సినిమాలకు నో చెప్పినట్టు తెలిసింది. మహేష్ బాబుతో `అతడు` సినిమా, అలాగే పవన్ కళ్యాణ్ నటించిన `సుస్వాగతం` సినిమాకి, నాగార్జున నటించిన `అన్నమయ్య` చిత్రాలకు ఆయన నో చెప్పినట్టు సమాచారం.
ఈ జాబితాలో మరో సినిమా చేరింది. వెంకటేష్‌కి కూడా నో చెప్పాడు శోభన్ బాబు. వెంకీకి అంకుల్ రోల్ కోసం ఆయన్ని సంప్రదించగా, సేమ్ అదే సమాధానంతో ఆయన సున్నితంగా తిరస్కరించారట. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే, `నువ్వు నాకు నచ్చావ్`. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని స్రవంతి రవికిశోర్ నిర్మించారు.
ఇందులో వెంకటేష్ అంకుల్ గా, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. అయితే ఆ సమయంలో ప్రకాష్ రాజ్ డేట్స్ కుదరలేదట. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. సినిమా డిలే అవుతుంది. మిగిలిన షూటింగ్ అయ్యింది. కానీ ప్రకాష రాజ్ సీన్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో శోభన్‌బాబుని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో సోగ్గాడిని కలిశారట. ఆయన ఎప్పటిలాగే తాను ఇక సినిమాల్లో కనిపించను అని చెప్పారట.
ఈ విషయం తెలుసుకుని ప్రకాష్ రాజ్ మళ్లీ టీమ్‌ని సంప్రదించి, తాను అన్ని సెట్ చేసుకుని వస్తాను, వెయిట్ చేయండి అని చెప్పారట. అలా త్వరగానే రావడంతో షూటింగ్ పూర్తి చేశారట.
అయితే ప్రకాష్ రాజ్ తో ఉన్న సీన్లు, ముఖ్యంగా టేబుల్ సీన్లు నాలుగు, ఐదు సార్లు షూట్ చేశారట. అది ఒకేసారి చేసింది కాదని, ఒక్కో సీన్ ఒక్కో సమయంలో చేసినట్టు దర్శకుడు విజయభాస్కర్ తెలిపారు. రాజేష్ మన్నే(తెరవెనుక కథలు) ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.