MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నీ కులపోడు కూడా దగ్గరకి రాడు, జాగ్రత్త.. అలీకి వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు

నీ కులపోడు కూడా దగ్గరకి రాడు, జాగ్రత్త.. అలీకి వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు

కమెడియన్ అలీ టాలీవుడ్ లో చాలా సీనియర్. 1980 నుంచే సీతా కొక చిలుక లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంటే దాదాపుగా అలీ 45 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 20 2024, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కమెడియన్ అలీ టాలీవుడ్ లో చాలా సీనియర్. 1980 నుంచే సీతా కొక చిలుక లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంటే దాదాపుగా అలీ 45 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలీ రాణించాడు. లెజెండ్రీ నటులు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి లాంటి వారందరితో అలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన సీనియర్ల నుంచి అలీ చాలా విషయాలు నేర్చుకున్నాడట. ఇటీవల అలీతో సరదాగా షోకి హీరో శివాజీ అతిథిగా హాజరయ్యాడు. అలీ శివాజీకి అనేక ఆసక్తికర ప్రశ్నలు సంధించడం.. అంతే ఆసక్తికరంగా శివాజీ సమాధానం ఇవ్వడం జరిగింది. అలీ, శివాజీ కలసి దాదాపు 20చిత్రాల్లో నటించారట. దీనితో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. 

37

అలీ ఇచ్చిన సలహాలని తాను జీవితంలో పాటిస్తున్నానని శివాజీ అన్నారు. మనం ఆర్టిస్టులం.. మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి మన సొంత ఊర్లో ఆస్తులు, ఇల్లు తప్పకుండా ఉంచుకోవాలి అని అలీ చెప్పారట. అలీ అన్నా నువ్వు చెప్పినట్లుగానే మా ఊర్లో కోటి 25 లక్షలతో ఇల్లు కట్టాను. అలాగే 30 ఎకరాల పొలం కూడా ఉంది అని శివాజీ అన్నారు. 

47
Sobhan Babu

Sobhan Babu

వెంటనే అలీ రియాక్ట్ అవుతూ.. నేను నీకు చెప్పిన ఈ విషయాన్ని నాకు శోభన్ బాబు గారు చెప్పారు. నాకు కాస్త ఫేమ్ వచ్చాక బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. దీనితో శోభన్ బాబుగారు తనకి సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారని అలీ అన్నారు. శోభన్ బాబు చెబుతూ.. అలీ.. ఆర్టిస్ట్ అనేవాడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. 

57

ఒక వేళ నువ్వు డబ్బు లేకుండా ఆకలితో అలమటిస్తుంటే కనీసం నీ కులపోడు కూడా నీ దగ్గరకి రాడు. ఎవ్వడూ నీకు బిర్యాని ప్యాకెట్ ఇవ్వడు. ఫ్రెండ్స్, బంధువులు ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. నువ్వు బావుంటేనే నీ దగ్గరకి అందరూ వస్తారు. నీ దగ్గర డబ్బులేకుంటే రారు. నీకు అప్పు అడిగే ఉద్దేశం లేకున్నా నీ దగ్గరకి రారు. ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. 

67
Sobhan Babu

Sobhan Babu

కాస్ట్లీ కార్లు లాంటివి కొనొద్దు. నల్ల బంగారం మీద డబ్బు పెట్టు అని అన్నారు. నాకు అర్థ కాక.. నల్ల బంగారం ఏంటండీ అని అడిగా.. అదేరా భూమి రా అని శోభన్ బాబు చెప్పినట్లు అలీ గుర్తు చేసుకున్నారు. 

77
Ali

Ali

ఇదే విషయాన్ని తనకి ఎన్టీఆర్ చెప్పినట్లు మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో.. మీకు మంచి పేరు వస్తోంది బ్రదర్.. ఇలాగే కొనసాగండి. డబ్బుని అనవసరంగా ఇనుప ముక్కల కోసం వృధా చేసుకోవద్దు. స్థలాలు కొనుక్కోండి. రేపు మనల్ని కాపాడేది భూమే అని సలహా ఇచ్చినట్లు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
Recommended image3
EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved