MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Savitri-Sobhanbabu: సావిత్రి డైరెక్షన్‌లో శోభన్‌ బాబు నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? ఆ ఇమేజ్‌కి భీజం పడింది ఇక్కడే

Savitri-Sobhanbabu: సావిత్రి డైరెక్షన్‌లో శోభన్‌ బాబు నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? ఆ ఇమేజ్‌కి భీజం పడింది ఇక్కడే

సోగ్గాడిగా తెలుగు ఆడియెన్స్ మదిలో నిలిచిపోయిన శోభన్‌ బాబు.. మహానటి సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఒకే ఒక్క మూవీలో నటించాడు. మహిళా ఆడియెన్స్ కి ఆయన్ని దగ్గర చేసిన చిత్రమది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 12 2025, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళా ఆడియెన్స్ లో సోగ్గాడిగా నిలిచిపోయిన శోభన్‌ బాబు
Image Credit : Asianet News

మహిళా ఆడియెన్స్ లో సోగ్గాడిగా నిలిచిపోయిన శోభన్‌ బాబు

శోభన్‌ బాబు.. సోగ్గాడిగా తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటూ వచ్చాడు. సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. శోభన్‌ బాబు పౌరాణికాలతో కెరీర్‌ని ప్రారంభించారు. కొన్ని యాక్షన్‌ సినిమాలు చేశారు. కానీ ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది మాత్రం కుటుంబ కథా చిత్రాలే అని చెప్పొచ్చు. ఫ్యామిలీ సినిమాలకు సోగ్గాడు కేరాఫ్‌గా మారిపోయారు. ఆ సినిమాలే ఆయనకు మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ని తీసుకొచ్చాయి. మహిళలు ఆరాధించే నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్‌, కృష్ణ వంటి వారు యాక్షన్‌ సినిమాలతో బ్లాక్‌ బస్టర్స్ కొడితే, సోగ్గాడు మాత్రం సింపుల్‌గా కుటుంబ కథా చిత్రాలతో వారికి చెమటలు పట్టించారని చెబితే అతిశయోక్తి కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శోభన్‌ బాబు, సావిత్రి కలిసి నటించిన సినిమాలు
Image Credit : Facebook/Sobhan babu abhimanulu/savitri

శోభన్‌ బాబు, సావిత్రి కలిసి నటించిన సినిమాలు

శోభన్‌ బాబు, మహానటి సావిత్రి కలిసి చాలా సినిమాలు చేశారు. పదికిపైగానే సినిమాలున్నాయి. అయితే వీరిద్దరు కలిసి జంటగా నటించింది మాత్రం `చదువుకున్న అమ్మాయిలు`, `కన్న తల్లి` అనే చెప్పాలి. ఇతర చిత్రాల్లో డిఫరెంట్‌ రోల్స్ చేశారు. `గోరింటాకు` మూవీలో సోగ్గాడికి తల్లిగా నటించింది సావిత్రి. `నర్తనశాల`లో కూడా నటించారు. కానీ జంటగా కాదు. అయితే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు నటించిన చాలా చిత్రాల్లో శోభన్‌ బాబు కీలక పాత్రలు చేశారు, సెకండ్‌ లీడ్‌గా నటించారు. అలా తెరని పంచుకున్నారు. కానీ జంటగా నటించలేదు. అయితే సావిత్రి డైరెక్షన్‌లో సోగ్గాడు సినిమా చేయడం విశేషం. ఆమె రూపొందించిన ఒకే ఒక్క మూవీలో శోభన్‌ బాబు నటించాడు.

Related Articles

Related image1
Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ `చిత్రం` మూవీని మిస్‌ చేసుకున్న క్రేజీ హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయాడు
Related image2
Heroes 50th Movie: చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ 50వ సినిమా హిట్టా ఫట్టా.. మెగాస్టార్‌, మన్మథుడికి చేదు అనుభవం
35
సావిత్రి డైరెక్షన్‌లో సోగ్గాడు నటించిన ఒకే ఒక్క మూవీ
Image Credit : youtube/v9 vedios

సావిత్రి డైరెక్షన్‌లో సోగ్గాడు నటించిన ఒకే ఒక్క మూవీ

మహానటి సావిత్రి దర్శకురాలిగా మారి `నవరాత్రి`, `చిన్నారి పాపలు`, `ఖుజంతై ఉల్లుమ్‌`, `చిరంజీవి`, `మాతృ దేవత`, `ప్రాప్తం`, `వింత సంసారం` వంటి చిత్రాలను రూపొందించారు. అయితే వీటిలో హిట్ల కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో `మాతృదేవత` మూవీలో శోభన్‌ బాబు నటించడం విశేషం. సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఎన్టీఆర్‌ మెయిన్‌ హీరో. ఆయనకు జోడీగా సావిత్రి నటించింది. ఇందులో సోగ్గాడు సెకండ్‌ లీడ్‌గా చేశారు. ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. 1969 నవంబర్‌ 7న విడుదలైన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించింది. ఓ రకంగా సోగ్గాడిని ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసిన చిత్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇలా సోగ్గాడు.. సావిత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెరవడం విశేషం.

45
నిర్మాతగా నష్టపోయిన సావిత్రి
Image Credit : Facebook/Mahanati Savitri

నిర్మాతగా నష్టపోయిన సావిత్రి

మహానటి సావిత్రి దర్శకురాలిగా మారి, నిర్మాతగా మారి చాలా ఇబ్బంది పడింది. పెద్ద పెద్ద స్టార్స్ తోనూ మూవీస్‌ చేసింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జెమినీ గణేషన్‌, శివాజీ గణేషన్‌ వంటి వారు కూడా సావిత్రి డైరెక్షన్‌లో నటించారు. వాటిలో కొన్ని మూవీస్‌ ఆడితే మరికొన్ని పరాజయం చెందాయి. అయితే ఈ చిత్రాలను చాలా వరకు తన ప్రొడక్షన్‌లోనే నిర్మించింది సావిత్రి. దీంతో అవి భారీ నష్టాలను మిగిల్చాయి. ఆమె కెరీర్‌ డౌన్‌ కావడంలో ఈ చిత్రాల పాత్ర చాలానే ఉందని అంటుంటారు. ఓ వైపు భర్త జెమినీ గణేషన్‌తో గొడవలు, మరోవైపు ఈ నష్టాలు, నమ్మిన వాళ్లు మోసం చేయడం, ఇన్‌కమ్‌ ట్యాక్స్ రైడ్స్ వంటి అనేక కారణాలతో సావిత్రి కుంగిపోయారు. తాగుడుకి బానిసై అనారోగ్యంతో కోమాలోకి వెళ్లారు. దాదాపు ఏడాదికిపైగానే పోరాడి మృతి చెందారు.

55
శోభన్‌ బాబుని తిరుగులేని స్టార్‌గా నిలిపిన చిత్రాలు
Image Credit : Facebook/sobhan babu abhimanulu

శోభన్‌ బాబుని తిరుగులేని స్టార్‌గా నిలిపిన చిత్రాలు

ఇక శోభన్‌ బాబు `భక్త శబరి` మూవీతో నటుడిగా పరిచయం అయ్యారు. కానీ `దైవ బలం` మొదటగా రిలీజ్ అయ్యింది. `బంగారు పంజరం`, `సీతా రామ కళ్యాణం`, `మహామంత్రి తిమ్మరుసు`, `లవకుశ`, `నర్తనశాల`, `దేశమంటే మనుషులోయ్‌`, `వీరాభిమాన్యు`, `మనుషులు మారాలి`. `మాతృదేవత`, `కళ్యాణ మండపం`, `చెల్లెలి కాపురం`, `సంపూర్ణ రామాయణం`, `శారద`, `మంచి మనుషులు`, `జీవనజ్యోతి`, `సోగ్గాడు`, `కురుక్షేత్రం`, `మల్లెపువ్వు`, `ఖైదీ బాబాయ్‌`, `గోరింటాకు`, `కార్తీక దీపం`, `మోసగాడు`, `దేవత`, `ముందడుగు` వంటి చిత్రాలతో సూపర్‌ హిట్స్ అందుకున్నారు. నటభూషణ్‌ శోభన్‌ బాబుగా కీర్తి పొందారు. సోగ్గాడు 1959లో కెరీర్‌ ప్రారంభించి, 1996లో రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. ఆడియెన్స్, అభిమానుల దృష్టిలో తాను సోగ్గాడిగానే ఉండిపోవాలని చెప్పి ఆయన స్వతహాగా రిటైర్‌మెంట్‌ ప్రకటించుకోవడం విశేషం. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన రిజెక్ట్ చేశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
శోభన్ బాబు
సావిత్రి (నటి)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ `చిత్రం` మూవీని మిస్‌ చేసుకున్న క్రేజీ హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయాడు
Recommended image2
Heroes 50th Movie: చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ 50వ సినిమా హిట్టా ఫట్టా.. మెగాస్టార్‌, మన్మథుడికి చేదు అనుభవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved