బాయ్స్ హాస్టల్ రూముల్లో రష్మీ ఫోటోలు.. ఎస్కేఎన్ వ్యాఖ్యలకు జబర్థస్త్ యాంకర్ షాక్..
యాంకర్ రష్మీ గౌతమ్ జబర్థస్త్ యాంకర్ గా బాగా ఫేమస్. ఆమె అందంతోపాటు చలాకి తనంతో అలరిస్తుంది. సుధీర్ఘంగా యాంకర్ గా చేస్తూ రాణిస్తుంది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అలరిస్తుంది.

జబర్థస్త్ యాంకర్ గా దాదాపు పదేళ్లుగా రాణిస్తుంది రష్మీ. తన తోటి యాంకర్ అనసూయ మధ్యలో యాంకరింగ్ మానేసింది. కానీ తాను మాత్రం షో కి వ్యాఖ్యాతగా వ్యహరిస్తూనే ఉంది. అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది. గ్లామర్ ఫొటోస్ తో కట్టి పడేస్తుంది. ప్రతి వారం విజువల్ ట్రీట్ ఇస్తుంది.
రష్మీ యాంకరింగ్ తోపాటు నటిగాను అడపాదడపా అలరిస్తుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో నటించి మెప్పించింది. మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడి కెరీర్ గాడి తప్పింది. సరైన ఆఫర్స్ రాలేదు. దీంతో సినిమాలను పక్కన పెట్టి యాంకరింగ్ తో బిజీగా ఉంది.
మధ్యలో బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ గా మెరిసింది. కానీ హిట్ రాలేదు. కానీ సడెన్ గా ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ మూవీలో మెరిసింది. చిరు తో కలిసి హాట్ స్టెప్పులేసింది. అందరినీ సర్ప్రైజ్ చేసింది. కాసేపు ఐటమ్ గర్ల్ లా మారిపోయింది. పెద్ద తెరపై రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు మరో మూవీ బాయ్స్ హాస్టల్ మూవీలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులోనూ బోల్డ్ లుక్ లో కనిపించింది. మరింత ఆశ్చర్య పరిచింది.
ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో రష్మీ తో పాటు, బేబీ నిర్మాత skn, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి పాల్గొన్నారు. ఇందులో skn రష్మీ పై క్రేజీ కామెంట్స్ చేశారు. తాను చదువుకునే రోజుల్లో బాయ్స్ హాస్టల్స్ రూముల్లో రష్మీ ఫోటోలు అంటించుకునే వాళ్ళని తెలిపారు. దీంతో అంతా షాక్ అయ్యారు. రష్మీ ఏకంగా కంగు తిన్నది. షాక్ లో నోరెళ్ళ బెట్టింది.
Skn వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ తాను ఇలాంటి గ్లామర్ రోల్స్ చేసేందుకు తాను సిద్ధమే అని చెప్పింది. తాను సినిమాలు చేయడం లేదని అంతా అనుకుంటున్నారని, కానీ తాను ఎలాంటి పాత్రలైనా చేస్తానని తెలిపింది.
Rashmi Gautam
ఇప్పటివరకు యాంకర్ గా మెప్పించిన రష్మీ, ఇకపై నటిగాను రచ్చ చేయబోతోందని చెప్పొచ్చు. మరి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.