- Home
- Entertainment
- పల్లవి ప్రశాంత్ ని ఎందుకు అరెస్ట్ చేశారో, ఏం జరిగిందో నాకు తెలుసు..తొలిసారి స్పందించిన శివాజీ
పల్లవి ప్రశాంత్ ని ఎందుకు అరెస్ట్ చేశారో, ఏం జరిగిందో నాకు తెలుసు..తొలిసారి స్పందించిన శివాజీ
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి.

Pallavi Prashanth Arrest
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీనితో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ప్రశాంత్ తన ఫ్యాన్స్ కి, అనుచరులకు నచ్చజెప్పి పోలీసులకు సహకరించాల్సింది పోయి రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు నమోదైంది.
Pallavi Prashanth Arrest
ఫలితంగా పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. పల్లవి ప్రశాంత్ లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచాడనే సంతోషం లేకుండా పోయింది అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తీరుని తప్పుబడుతూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు పల్లవి ప్రశాంత్ కి మద్దతు తెలుపుతున్నారు.
ఫ్యాన్స్ అతివల్లే ప్రశాంత్ ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు అని అంటున్నారు. అయితే ప్రశాంత్ అరెస్ట్ పై ఇప్పటికే చాలా మంది స్పందించారు. హౌస్ లో ప్రశాంత్ కి ఎంతో మద్దతుగా, అన్నగా ఉన్న శివాజీ రియాక్షన్ కోసం అంతా ఎదురుచూశారు. ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే శివాజీ స్పందించడం లేదు ఏంటి అని ఆశ్చర్యపోయినవాళ్లు కూడా ఉన్నారు.
ఎట్టకేలకు శివాజీ ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించారు. చాలా మంది ప్రశాంత్ గురించి మాట్లాడాలని అంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే.. ప్రశాంత్ కి ఏమీ కాదు.. చట్ట ప్రకారం ప్రశాంత్ త్వరగానే బయటకి వస్తాడు. ప్రశాంత్ కి చట్టంపై గౌరవం ఉంది. పారిపోయాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అలా చేయడం కరెక్ట్ కాదు. ప్రశాంత్ తో నాలుగు నెలలపాటు హౌస్ లో ఉన్నాను. అతడు ఎలాంటి వాడో నాకు తెలుసు.
bigg boss 7
బయట ఏం జరుగుతుంది అనేది ప్రశాంత్ కి తెలియదు. అతడు రాకముందే కొందరు కారు అద్దాలు ధ్వంసం చేశారు. వాళ్ళు ఎవరి అభిమానుల్లో తెలియదు. ఎవరు చేసినా జరిగింది చాలా తప్పు. అమర్ దీప్ ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ప్రశాంత్ గురించి పదేపదే నేను బయటకి వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే వివాదం జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలు నాకు తెలుసు. సోమవారం లోపు ప్రశాంత్ బయటకి వస్తాడు. ప్రశాంత్ నేరస్థుడు కాదు, క్రిమినల్ కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను టచ్ లో ఉన్నా. గెలిచాను అనే సంతోషం కొన్నిసార్లు మనిషిని డామినేట్ చేస్తుంది. దానిని హ్యాండిల్ చేసే వయసు కూడా ప్రశాంత్ కి లేదు. అక్కడ జరిగిన తప్పే కానీ.. ప్రశాంత్ ఏ పొరపాటు చేయలేదు.
Bigg Boss Telugu 7
దయచేసి ప్రశాంత్ గురించి దారుణమైన థంబ్ నెయిల్స్ ఎవరూ పెట్టొద్దు. ఎవరో చేసిన తప్పుకి, ఫ్యాన్స్ పేరుతో జరిగిన అల్లర్లకు ప్రశాంత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని శివాజీ అన్నారు.