MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమ్మ రెండో పెళ్లి చేసుకుంటాను అంటే నేను అడిగింది ఇదే, చాలా భయపడింది..సింగర్ సునీత కొడుకు

అమ్మ రెండో పెళ్లి చేసుకుంటాను అంటే నేను అడిగింది ఇదే, చాలా భయపడింది..సింగర్ సునీత కొడుకు

యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే జనవరి 1న సింగర్ సునీత తనయుడు ఆకాష్ కూడా సర్కారు నౌకరి అనే చిత్రంతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 03 2024, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే జనవరి 1న సింగర్ సునీత తనయుడు ఆకాష్ కూడా సర్కారు నౌకరి అనే చిత్రంతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. ఈ ఎయిడ్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి ప్రయత్నం అంటూ రెస్పాన్స్ వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీనితో ఆకాష్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆకాష్ మాట్లాడుతూ తన ఫ్యామిలీ పర్సనల్ విషయాలపై కూడా ఓపెన్ అయ్యాడు. నేను ఎదో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ మమ్మల్ని సింగిల్ మదర్ గా పోషిచడం మొదలు పెట్టింది. 

36
Singer Sunitha

Singer Sunitha

నాన్న ఎప్పుడో ఒకసారి వచ్చేవారు. పదవతరగతి నుంచి చిరంజీవి సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టా. ఆ విధంగా సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. చదువు పూర్తి కాకముందే యాక్టర్ కావాలని ఉన్నట్లు అమ్మతో చెప్పా. కాళ్ళు విరగ్గొడతా అని అమ్మ తిట్టింది. 

46

ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసాక ఇండస్ట్రీ వైపు వచ్చినట్లు ఆకాష్ పేర్కొన్నాడు. అమ్మ ఒంటరిగా ఉంటూ నన్ను చెల్లిని, తాతయ్యని బాగా చూసుకుంది. అయితే రెండో పెళ్లి విషయంలో అమ్మ చాలా భయపడింది. మేము ఏమనుకుంటామో అని టెన్షన్ పడింది. 

56

మాకు రెండో పెళ్లి గురించి చెప్పినప్పుడు నేను ఒక్కటే అడిగా.. రామకృష్ణ గారిపై నమ్మకం ఉందా అని ప్రశ్నించా. చాలా నమ్మకం అని చెప్పింది. నేను కూడా ఆయన్ని కలిశా. చాలా ఫ్రెండ్లిగా ఉంటారు. చాలా ఏళ్లపాటు అమ్మ ఎమోషనల్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఉండింది. ఎట్టకేలకు అమ్మకి ఒక తోడు దొరికింది. అదే మాకు సంతోషం అని ఆకాష్ తెలిపారు. 

66
Singer Sunitha

Singer Sunitha

సింగర్ సునీతకి 19 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ తో వివాహం జరిగింది. వీళ్లిద్దరికీ ఆకాష్, శ్రేయ సంతానం కలిగారు. వివిధ కారణాల వల్ల తన భర్త నుంచి సునీత విడిపోయింది. 2021లో సునీత.. రామకృష్ణ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Recommended image3
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved