- Home
- Entertainment
- Singanamala Ramesh: పవన్, మహేష్ వల్ల 100 కోట్ల నష్టం.. నిందలు వేసిన నిర్మాతకి బండ్ల గణేష్ సాలిడ్ కౌంటర్
Singanamala Ramesh: పవన్, మహేష్ వల్ల 100 కోట్ల నష్టం.. నిందలు వేసిన నిర్మాతకి బండ్ల గణేష్ సాలిడ్ కౌంటర్
Singanamala Ramesh Vs Bandla Ganesh : చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన నిర్మాత శింగనమల రమేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Singanamala Ramesh, Bandla Ganesh
Singanamala Ramesh Vs Bandla Ganesh :చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన నిర్మాత శింగనమల రమేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగులో కొన్ని చిన్న చిత్రాలు నిర్మించిన శింగనమల రమేష్.. ఖలేజా, కొమరం పులి లాంటి స్టార్ హీరో చిత్రాలని కూడా నిర్మించారు. ఆ రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
Komaram Puli
ఈ చిత్రాల గురించి శింగనమల రమేష్ మాట్లాడుతూ.. ఖలేజా, కొమరం పులి చిత్రాల వల్ల తాను 100 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నన్ను పట్టించుకోలేదు. కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదు. ఈ రెండు చిత్రాలు మూడేళ్ళ పాటు డిలే అవుతూ వచ్చాయి. అంత భారీ స్థాయి నష్టాలకు కారణం ఈ రెండు చిత్రాల చిత్రీకరణకు 3 ఏళ్ళు పట్టింది అని రమేష్ బాబు అన్నారు.
సాధారణంగా రాజమౌళి, శంకర్ చిత్రాలకు అంత టైం పడుతుంది. కానీ కొమరం పులి, ఖలేజా చిత్రాలకు అంత టైం పట్టడం వల్ల తనపై వడ్డీల భారం కూడా పెరిగింది అని రమేష్ పేర్కొన్నారు. అంతలా షూటింగ్ డిలే కావడానికి కారణాలు చెబుతూ రమేష్ .. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టైం ప్రజారాజ్యం పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ కొమరం పులి చిత్రాన్ని గాలికి వదిలేసారు అని తెలిపారు. దానితో పాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఖలేజా ఆలస్యం కావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అని రమేష్ తెలిపారు.
Khaleja movie
రమేష్ వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. 'సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.
మొత్తంగా శింగనమల రమేష్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి కొత్త వివాదం రేపారు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తాను అని శింగనమల రమేష్ తెలిపారు.