MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • సిమ్రాన్‌తో ప్రేమలో పడ్డ హీరోలు ఇంత మంది ఉన్నారా?..ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ సీక్రెట్‌ లవ్‌ స్టోరీస్‌ తెలుసా?

సిమ్రాన్‌తో ప్రేమలో పడ్డ హీరోలు ఇంత మంది ఉన్నారా?..ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ సీక్రెట్‌ లవ్‌ స్టోరీస్‌ తెలుసా?

స్టార్‌ హీరోయిన్‌గా ఒకప్పుడు సౌత్‌ సినిమా ఇండస్ట్రీని ఊపేసింది సిమ్రాన్‌. అదే సమయంలో లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ ని కూడా గట్టిగానే ఫేస్‌ చేసింది. మరి ఎంత మంది హీరోలు ఆమె ప్రేమలో పడ్డారంటే..

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 09 2024, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Simran

Simran

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్లలో సిమ్రాన్‌ ఒకరు. సౌందర్య, రమ్యకృష్ణలకు సమకాలీకురాలు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. `సమరసింహారెడ్డి`, `కలిసుందాం రా`, `నువ్వు వస్తావని`, `యువరాజు`, `నరసింహనాయుడు`, `ప్రేమతో రా`, `బావ నచ్చాడు`, `డాడీ`, `సీమ సింహం`, `సీతయ్య`, `ఒక్క మగాడు` వంటి సినిమాలు చేసి మెప్పించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చాలా వరకు హిట్‌ సినిమాల్లో భాగమైంది సిమ్రాన్‌. టాప్‌ హీరోలందరితోనూ చేసింది. అయితే తెలుగు కంటే ఆమె తమిళంలో ఎక్కువ చిత్రాలు చేసింది. అక్కడ కూడా టాప్‌ స్టార్స్ తో సినిమాలు చేసి మెప్పించింది. తమిళ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. సినిమాల్లోకి 1995లో ఎంట్రీ ఇచ్చి 2008 తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రధానంగా ఆమె పదేళ్లు మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంది. ఆ సమయంలోనే ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది. 
 

37

అయితే సిమ్రాన్‌ సక్సెస్‌ రేట్‌తోపాటు లవ్‌ ఎఫైర్ వార్తలు కూడా గట్టిగానే వచ్చాయి. ఆమె చాలా మంది హీరోలతో డేటింగ్‌ చేసిందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. ప్రధానంగా కోలీవుడ్‌లో ఆమెపై ఎఫైర్‌ రూమర్స్ రావడం గమనార్హం. చాలా మంది హీరోలతో సిమ్రాన్‌ రొమాంటిక్‌ రిలేషన్స్ ని మెయింటేన్‌ చేసిందన్నారు. అందులో భాగంగా మొదట అబ్బాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 

47

సిమ్రాన్‌ తమిళంలో నటించిన తొలి చిత్రం `వీఐపీ`, ఇందులో ప్రభుదేవా, అబ్బాస్‌ హీరో. అబ్బాస్‌కి జోడీగా సిమ్రాన్‌ నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. అబ్బాస్‌.. సిమ్రాన్‌ని మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నాడట. కానీ సన్నిహితుల సలహా మేరకు ఆయన సిమ్రాన్ కి బ్రేకప్‌ చెప్పాడట. 
 

57

ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభుదేవా సోదరుడు, డాన్స్ మాస్టర్‌ రాజు సుందరం ఆమె ప్రేమలో పడ్డాడట. సిమ్రాన్‌ నటించిన చాలా సినిమాలకు రాజు సుందరం డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అంతేకాదు హీరోగా `ఐ లవ్యూ దా` వంటి సినిమాలో నటించారు. క్రమంలో సిమ్రాన్‌తో ఆయన ప్రేమలో పడ్డారట. చాలా కాలం పాటు ఈ ఇద్దరు లవ్‌ స్టోరీని కొనసాగించారు. వీరు కూడా పెళ్లి వరకు వెళ్లారట. ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చకావడంతో.. రాజు సుందరం మాస్టర్‌ సిమ్రాన్‌కి గుడ్‌ బై చెప్పేశాడట. 
 

67

మరోవైపు లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తోనూ సిమ్రాన్‌ ఎఫైర్‌ పెట్టుకుందని అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి `పంచతంత్రం` చిత్రంలో నటించారు. ఇందులో రెచ్చిపోయి రొమాన్స్‌ చేశారు. ఆ కెమిస్ట్రీ చూశాక  ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయని ప్రముఖ జర్నలిస్ట్ చెయ్యర్‌ బాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

77

వీటి అన్నింటికి పుల్‌ స్టాప్‌ పెడుతూ సిమ్రాన్‌ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్‌ బగ్గాని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత సిమ్రాన్‌ సినిమాలు తగ్గించింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కొంత కాలం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మెప్పిస్తుంది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image3
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved