MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shriya Sharma: చిరంజీవి మూవీతో ఎంట్రీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటి.. ఇప్పుడు ముంబైలో టాప్ లాయర్

Shriya Sharma: చిరంజీవి మూవీతో ఎంట్రీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటి.. ఇప్పుడు ముంబైలో టాప్ లాయర్

ఒకప్పుడు సూర్య, జ్యోతికల కూతురిగా 'నువ్వంటే నాకిష్టం' సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియా శర్మ గుర్తుందా? ఇప్పుడు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి ముంబైలో కార్పొరేట్ లాయర్‌గా స్థిరపడ్డారు. ఆమె ప్రయాణం గురించి ఈ ఫొటో గ్యాలరీలో చూడండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 13 2026, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జై చిరంజీవ మూవీతో ఎంట్రీ
Image Credit : Asianet News

జై చిరంజీవ మూవీతో ఎంట్రీ

తమిళ సినిమా 'సిల్లును ఒరు కాదల్' (2006) తెలుగులో 'నువ్వంటే నాకిష్టం'గా డబ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్య, జ్యోతికల కూతురిగా శ్రియా శర్మ నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఆమె కెరీర్ మొదలైంది తెలుగులోనే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జై చిరంజీవ'లో ఆయన చెల్లి కూతురిగా నటించి శ్రియా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’, మహేష్ బాబు దూకుడు వంటి భారీ చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించింది. అంతేకాదు, దాదాపు 150కి పైగా టీవీ యాడ్స్‌లో నటించి అప్పట్లో అందరికీ సుపరిచితమైన ముఖంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సినిమాలకు గుడ్ బై
Image Credit : Instagram

సినిమాలకు గుడ్ బై

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి సక్సెస్ చూసిన శ్రియా శర్మ, హీరోయిన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2015లో 'గాయకుడు', 2016లో 'నిర్మలా కాన్వెంట్' సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా అందంగా ఉన్నా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. దీంతో శ్రియా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పి చదువుపై పూర్తి దృష్టి పెట్టింది. లా పూర్తి చేసి, ఇప్పుడు ముంబైలో ఒక సక్సెస్‌ఫుల్ 'కార్పొరేట్ లాయర్‌'గా రాణిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల న్యాయపరమైన వ్యవహారాలను చూసుకుంటోంది.
33
ఆశ్చర్యపోతున్న అభిమానులు
Image Credit : Instagram

ఆశ్చర్యపోతున్న అభిమానులు

శ్రియా శర్మ సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు చూసిన అభిమానులు, "మనం చూసిన ఆ చిన్న పాప ఈమెనా? ఎంత పెద్దదైపోయిందో!" అని ఆశ్చర్యపోతున్నారు. తన లాయర్ వృత్తికి సంబంధించిన అందమైన క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. ఒకప్పుడు కెమెరా ముందు నటించిన ఆ చిన్నారి, ఇప్పుడు కోర్టులో వాదిస్తోంది. సినిమానే జీవితం కాదు, ఇతర రంగాల్లోనూ రాణించవచ్చని శ్రియా శర్మ నిరూపించింది. ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Upasana: రామ్‌ చరణ్‌ని అలా చూస్తే ఉపాసన తట్టుకోలేదు.. ఆమెని ఏడిపించే విషయం ఏంటంటే?
Recommended image2
Jailer 2 Movie 7 Days Collections: సరికొత్త రికార్డుల దిశగా జైలర్‌ 2.. రజనీకాంత్‌ మూవీ 7వ రోజు దుమారం
Recommended image3
Prabhas Favorite Actor: ప్రభాస్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? చిరు, కృష్ణంరాజు, ఎన్టీఆర్‌ మాత్రం కాదు
Related Stories
Recommended image1
Dridam Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్, అదరహో అంతే
Recommended image2
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved