MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Tillu Square Review: టిల్లు స్క్వేర్  ప్రీమియర్ రివ్యూ: హిట్టా ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

Tillu Square Review: టిల్లు స్క్వేర్  ప్రీమియర్ రివ్యూ: హిట్టా ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం టిల్లు స్క్వేర్. ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ ఏమిటో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 29 2024, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tillu Square Movie Review

Tillu Square Movie Review

2022లో వచ్చిన డీజే టిల్లు భారీ విజయం అందుకుంది. ఈ చిత్ర బడ్జెట్ రీత్యా అత్యధిక లాభాలు పంచింది. సిద్దు జొన్నలగడ్డ-నేహా శెట్టి జంటగా నటించగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. డీజే టిల్లు మూవీలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కుర్రకాళ్లకు సిద్దు పాత్ర తెగ నచ్చేసింది. నాన్ స్టాప్ నవ్వులతో డీజే టిల్లు సాగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Tillu Square Movie Review

Tillu Square Movie Review

ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్లాన్ చేశారు. విమల్ కృష్ణ స్థానంలో దర్శకుడిగా మాలిక్ రామ్ ని తెచ్చారు. నిర్మాత నాగ వంశీ సీక్వెల్ ని కూడా నిర్మించారు. సిద్దు జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మార్చి 29న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. 

 

37
Tillu Square Movie Review

Tillu Square Movie Review

టిల్లు స్క్వేర్ మూవీ పై యూత్ లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. డీజే టిల్లు సక్సెస్ కావడంతో పాటు టిల్లు స్క్వేర్ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముద్దు సన్నివేశాల్లో నటించడం ఒకింత షాక్ కి గురి చేసింది.అనుపమ ఆ తరహా రోల్ చేయడం చర్చకు దారి తీసింది. 

47
Tillu Square Movie Review

Tillu Square Movie Review

మరి టిల్లు స్క్వేర్ అంచనాలు అందుకుందా? డీజే టిల్లు మాదిరి సీక్వెల్ లో కూడా విషయం ఉందా? అంటే... ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. సిద్దు ఎప్పటిలాగే తన ఎనర్జీ తో ఆకట్టుకున్నాడు. ఆయన యాటిట్యూడ్, క్యారెక్టరైజేషన్ నవ్వులు పూయిస్తాయి. సిద్ధూ మరోసారి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. 

 

57
Tillu Square Movie Review

Tillu Square Movie Review

వన్ లైనర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సైతం మెప్పించాయి. అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా ఉందని అంటున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటుంటే మరికొందరు ఆడియన్స్ చాలా బాగుంది. సూపర్ హిట్ అంటున్నారు. 

67

అయితే అనుపమ పరమేశ్వరన్ గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. ఆమె పాత్ర టిల్లు స్క్వేర్ లో పెద్దగా ప్రభావం చూపలేదేమో అనే భావన కలుగుతుంది. పార్ట్ 1 లో నేహా శెట్టి రోల్ ప్రేక్షకులను గట్టిగా తాకింది. రాధిక అంటే నేహా శెట్టి గుర్తుకు వచ్చేలా ఆమె క్యారెక్టర్ ఉంటుంది. 

 

77

సెకండ్ హాఫ్ లో సైతం నాన్ స్టాప్ నవ్వులు. టిల్లు స్క్వేర్ తో పోల్చుకుంటే డీజే టిల్లు జస్ట్ షార్ట్ ఫిల్మ్ లాంటిది మాత్రమే. పార్ట్ 1 కంటే పార్ట్ 1 చాలా బాగుంది అనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. బీజీఎం, సాంగ్స్ కి పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి.  మొత్తంగా చూస్తే టిల్లు స్క్వేర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. సినిమా ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూ వస్తే కానీ చెప్పలేం..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image2
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image3
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved