MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కృష్ణంరాజు కొడుకు ఎలా చనిపోయాడు, ఆ తప్పు జరగకుంటే..మొదటి భార్య సీత గురించి శ్యామలదేవి సంచలనం

కృష్ణంరాజు కొడుకు ఎలా చనిపోయాడు, ఆ తప్పు జరగకుంటే..మొదటి భార్య సీత గురించి శ్యామలదేవి సంచలనం

కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు. మొదటి భార్యని ప్రమాదంలో కోల్పోయారు. అది కృష్ణంరాజుకు పిడుగులాంటి సంఘటన. ఆయన వ్యక్తిగత విషయాలని కృష్ణంరాజు రెండవ సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2024, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెబల్ స్టార్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగిన కృష్ణం రాజు మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. కృష్ణంరాజు సినిమాలు తగ్గించిన తర్వాత తన వారసుడు ప్రభాస్ లో తనని తాను చూసుకుని మురిసిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదగడం తో కృష్ణంరాజు ఎంతో గర్వపడ్డారు. కృష్ణంరాజు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
krishnam raju

krishnam raju

మొదటి భార్యని ప్రమాదంలో కోల్పోయారు. అది కృష్ణంరాజుకు పిడుగులాంటి సంఘటన. ఆయన వ్యక్తిగత విషయాలని కృష్ణంరాజు రెండవ సతీమణి శ్యామల దేవి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కృష్ణంరాజు శ్యామల దేవిని 1996లో రెండవ వివాహం చేసుకున్నారు. శ్యామల దేవి మాట్లాడుతూ 1995లో రాజుగారి మొదటి భార్య సీత షాపింగ్ కి వెళుతూ యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. 

 

36

సీత రాజుగారి మేనకోడలు అవుతుంది. దశాబ్దాల అనుబంధం వాళ్ళది. సీత గారు మరణించడంతో రాజుగారి జీరించుకోలేదు. కొంతకాలం ఇంట్లో నుంచి బయటకి రాలేదు. రాజుగారికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచన వాళ్ళ నాన్నకే వచ్చింది. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు.. కానీ తన ఆకలి తనకి తెలియదు. మంచి భార్య ఉంటే సమయానికి భోజనం పెడుతుంది కదా అని కృష్ణంరాజు గారి నాన్న ఆలోచించారట. 

 

46

కృష్ణంరాజుని రెండో పెళ్లి చేసుకోమని అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. దీనితో నేను నిరాహార దీక్ష చేస్తా అని భోజనం మానేసి వాళ్ళ నాన్న కూర్చున్నారు. రాజుగారికి ఒప్పుకోక తప్పలేదు. అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలో నేను వైజాగ్ లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కృష్ణంరాజు గారు బాగా దానాలు సహాయాలు చేస్తారట అనే మంచి అభిప్రాయం నాకు ఉంది. 

 

56

కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. రెండో పెళ్లి అనేసరికి మా అమ్మకి ఇష్టం లేదు. నేను చేసుకుంటా అని చెప్పా. మా అమ్మ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పింది. నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పా. దీనితో మా అమ్మ కూడా ఒప్పుకుంది. నన్ను బలవంతంగా ఒప్పించారని కృష్ణంరాజు గారు అనుకున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందొ లేదో కనుక్కో అని వాళ్ళ కజిన్ ని పంపారు. నేను అప్పుడు చిన్న పిల్లలతో ఆడుకుంటున్నా. నా ఇష్టపూర్వకంగా ఇప్పుకున్నట్లు వాళ్ళకి చెప్పా.  

 

66

చిన్న పిల్లలతో ఆడుకుంటుంది అని నా గురించి రాజుగారికి చెప్పారు. చిన్నపిల్లలతో ఆడుకుంటోంది అంటే మంచి మనసున్న అమ్మాయి అయి ఉంటుంది అని ఆయన కూడా ఇష్టపడ్డారు. ఆ విధంగా మా పెళ్లి జరిగింది. కృష్ణంరాజు గారికి కొడుకులు లేరు. కానీ మొదటి భార్య సీతా దేవికి కొడుకు పుట్టారు. డెలివరీ టైంలో డాక్టర్ చేసిన తప్పు వల్ల బిడ్డ చనిపోయాడు. డాక్టర్ తప్పు చేయకుంటే రాజు గారికి వారసుడు ఉండేవారు అని శ్యామల దేవి అన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
కృష్ణంరాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image2
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image3
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved