Shyam Singha Roy Movie Review: శ్యామ్ సింగరాయ్ ట్విట్టర్ టాక్.
ఈరోజు (డిసెంబర్ 24 ) శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy) గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోస్ వేసేశారు. గంటకు పైగా ఆలస్యంగా షోస్ స్టార్ట్ అయ్యాయి. ఇక అక్కడి ఆడియన్స్ శ్యామ్ సింగరాయ్ సినిమాను చూసి, తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. మరి నెటిజన్ల అభిప్రాయం ప్రకారం శ్యామ్ సింగరాయ్ హిట్ అయ్యిందా..? ఎవరెలా చేశారు..? నచ్చిన అంశాలేంటి...? నచ్చనివి ఏంటీ చూద్దాం.
Shyam Singha Roy
నేచురల్ స్టార్ నాని-సాయిపల్లవి-క్రుతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ జంటగా.. రాహుల్ సంక్రుత్యన్ డైరెక్షన్ లో.. తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy). కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై.. వరుసగా ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేస్తున్న నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేశాడు. ప్రమోషన్ల విషయంలో కూడా నాని రెస్ట్ లెస్ గా పనిచేశారు.
Shyam Singha Roy
ముందుగా శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy) కథ విషయానికి వస్తే.. వాసు(నాని) ఓచిన్న సినిమా డైరెక్టర్. అతను కీర్తి (క్రితి శెట్టి)ని ప్రేమిస్తుంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్న టైమ్ లో వాసుపై రౌడీల అటాక్ జరుగుతుంది. ఈ క్రమంలో వాసు తలకి బలమైన గాయం తగులుతుంది.. వాసుకి అప్పుడు గత జన్మ గుర్తుకు వస్తుంది. వెళ్తాడు.. అతను శ్యామ్ సింగరాయ్ అని వాసు తెలుసుకుంటాడు. శ్యామ్ సింగరాయ్ గురించి రిసర్చ్ చేస్తాడు. గతంలో కూడా శ్యామ్ సింగరాయ్ లవ్ స్టోరీ, ఆయన చేసిన ఉద్యమం..... గురించి తెలుస్తుంది. అందులో మైత్రేయి( సాయిపల్లవి) తో ప్రేమలో ఉంటాడు. మరి నెక్ట్స్ ఏం జరిగింది. క్లైమాక్స్ ఏంటీ అనేది అసలు ట్విస్ట్.
ఈ సినిమా యూఎస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటీవ్ రివ్యూస్ తో సోషల్ మీడియాను నింపేశారు. ముఖ్యంగా రాహుల్ డైరెక్షన్, నానీ యాక్టింగ్, సాయి పల్లవి స్క్రీన్ ప్రజన్స్ కు గట్టిగా మార్కులు పడ్డాయి.క్రితి శెట్టితో బోల్డ్ సీన్స్ తో అదరగొటింది. ఇక శ్యామ్ సింగరాయ్ గా నానీ మరోసారి తన నటను ప్రూవ్ చేసుకున్నాడు. ఈమధ్య వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న యంగ్ హీరో ఈసారి ఎలాగైనా సినిమా హిట్ కొట్టాలి అని పట్టుదలతో శ్యామ్ సింగరాయ్ కోసం బాగా కష్టపడ్డాడు. ఇప్పటి వరకూ ఎప్పుడు లేని విధంగా కొత్త అవతారంలో కనిపించాడు నానీ. డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. అనుకున్నట్టుగానే ఆడియన్స్ నుంచి మంచి మార్కులు సాధించాడు. నాని నటనకు డైలాగ్ డెలివరీకి చాలా మంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నీ పేరు ఏంటీ అంటే శ్యామ్ సింగరాయ్ అంటూ వచ్చే సన్నీవేశం. ఇలాంటి కొన్ని సీన్స్ నానిని స్క్రీన్ పై కొత్తగా చూపించాయి.
ఇక ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి ప్రతీ ప్రేక్షకుడు సాయి పల్లవిని, ఆమె నటనను పొగడ కుండా ఉండలేకపోతున్నారు. ఆమె నటన, డాన్స్, స్క్రీన్ ప్రజన్స్..ఇలా ప్రతీ ఎలిమెంట్ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు ఉన్నా.. ఆడియన్స్ ను మాత్రం బాగా ఆకట్టుకుంది సాయి పల్లవి నటనే. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మరీ ముఖ్యంగా నెలరాజుని పాట ప్రేక్షకుల మనసుని తాకింది. ఈ పాటలో సాయి పల్లవి స్క్రీన్ ప్రజన్స్ ను చూసి..తెగ ముచ్చట పడిపోయారు ఆడియన్స్.
శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం డైరెక్టర్ రాహుల్ సంక్రుత్యన్. టాక్సీవాల సినిమాతో తనేంటో నీరూపించుకున్న ఈ యంగ్ డైరెక్టర్, చాలా గ్యాప్ తరువాత మరో మంచి సినిమాను అందించాడు. సోషల్ మీడియా రివ్యూస్ లో రాహుల్ ను ఆకాశానికి ఎత్తేశారు ఆడియన్స్. సినిమాలో ప్రతీ సెకండ్.. ప్రతీ ఫ్రేమ్ ను రాహుల్ అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. ఇంట్రవెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్. అదే సినిమాను కొత్త మలుపు తిప్పింది. . స్టోరీ లైన్ గట్టిగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఫెస్టివల్ ఎపిసోడ్ అద్భుతమంటూ ట్వీట్ చేస్తున్నారు. రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్ అవుట్ స్టాండింగ్. సెకండ్ ఆఫ్ అంతా ఈచ్అండ్ ఎవ్రీ సెకండ్ బ్రిలియంట్ షార్ట్స్ తో నింపేశారు. రాహుల్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా స్వార్థం మనిషికే కాని సిధ్దాంతానికి కాదు అనే డైలాగ్ గట్టిగా పేలింది.
Shyam Singha Roy
ఇక ఈ సినిమాను నిలబెట్టిన మరో ఎలిమెంట్ మ్యూజిక్. మిక్కీజెమేయర్ అందించిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శ్యామ్ సింగరాయ్ స్టోరీకి తగ్గట్టు.. ప్రతీ సీన్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌడ్ స్కోర్ అందించాడు మిక్కి. మ్యూజిక్ గురించి చాలా మంది ఒక్క పదంలో జస్ట్ అమేజింగ్ అంటూ కామెంట్ చేస్తున్నరు. సినిమా విజ్యూవల్స్ కు తగ్గట్టు మ్యూజిక్ సెట్ అయ్యిందన్నారు ఆడియన్స్. నీ పేరు ఏంటీ.. శ్యామ్ సింగరాయ్ అంటూ వచ్చే షాట్ కు.. దాని వెనుక వచ్చే బిజియంకు బాగా కనెక్ట్ అయ్యారు యూఎస్ ఆడియ్స్. మొత్తానికి శామ్ సింగరాయ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ క్రిస్ మస్ కు నానీకి మంచి సక్సెస్ దొరికినట్టే.