- Home
- Entertainment
- 6 అడుగులు ఉంటాడు, తెలుగు మాట్లాడడం చేతకాని తెలుగు హీరో.. క్రేజీ హీరోయిన్ సెటైర్లు ఎవరిపై
6 అడుగులు ఉంటాడు, తెలుగు మాట్లాడడం చేతకాని తెలుగు హీరో.. క్రేజీ హీరోయిన్ సెటైర్లు ఎవరిపై
యంగ్ హీరోయిన్ శ్వేతా బసు తెలుగులో మెరుపులా మెరిసి వెళ్ళిపోయింది. శ్వేతా బసుకి దక్కిన బిగ్గెస్ట్ హిట్ కొత్త బంగారు లోకం. అదే విధంగా రైడ్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీలో కూడా నటించింది.

Shweta Basu Prasad
యంగ్ హీరోయిన్ శ్వేతా బసు తెలుగులో మెరుపులా మెరిసి వెళ్ళిపోయింది. శ్వేతా బసుకి దక్కిన బిగ్గెస్ట్ హిట్ కొత్త బంగారు లోకం. అదే విధంగా రైడ్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీలో కూడా నటించింది. కొన్ని చిన్న చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఓ వివాదంలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంది.
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ బంధం నిలబడలేదు. ఏడాదికే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్వేతా బసు టాలీవుడ్ పై, ఓ తెలుగు హీరోపై సంచలన వ్యాఖలు చేసింది. టాలీవుడ్ లో నా కెరీర్ చాలా బాగా సాగింది. కానీ ఒక సందర్భంలో మాత్రం వేధింపులు ఎదురయ్యాయి.
swetha basu prasad
తెలుగు హీరోతో నటిస్తున్న సమయంలో బాడీ షేమింగ్ కి గురయ్యాను. నేను 5'2 హైట్ ఉంటాను. ఆ హీరో మాత్రం సుమారు 6 అడుగులు ఉంటాడు. సెట్స్ వచ్చిన ప్రతి సారీ నా హైట్ గుర్తు చేస్తూ వేధించేవాడు. నా ఎత్తు అనేది నా చేతుల్లో లేని విషయం. అయినా కూడా వేధిస్తూ ఉండేవాడు. అతనితో పాటు సెట్స్ లో మరికొందరు కూడా వేధించారు. హీరో ఆరడుగులు ఉన్నారు, ఈమె 5 అడుగులు మాత్రమే.. అసలు వీళ్లిద్దరికీ ఎలా సెట్ అవుతుంది అన్నట్లుగా కామెంట్స్ చేసేవారు.
Shwetha Basu
కానీ అతడికి ఉన్న లోపాన్ని మాత్రం ఎవరూ ఎత్తిచూపేవారు. ఆ హీరో గురించి చెప్పాలంటే.. తెలుగు హీరో అయినప్పటికీ తెలుగు మాట్లాడడం చేతకాదు. ఒక్కో సన్నివేశానికి చాలా టేకులు వేస్ట్ చేసేవాడు. నేను తెలుగు అమ్మాయిని కాకపోయినప్పటికీ డైలాగులు బాగా నేర్చుకుని చెప్పేద్దాన్ని. ఆ హీరోకి తెలుగులో డైలాగులు చెప్పడమే చేతకాదు. హైట్ అనేది నాచేతుల్లో లేని విషయం. కానీ డైలాగులు చెప్పడం నా చేతుల్లో ఉంది. అది పర్ఫెక్ట్ గా చేశా. కానీ అందరూ నా హైట్ గురించే ఎగతాళి చేయడం బాధగా అనిపించింది అని శ్వేతాబసు పేర్కొంది.
Shwetha Basu
ఆ హీరో పేరు నేరుగా చెప్పడానికి మాత్రం శ్వేతా బసు ఇష్టపడలేదు. శ్వేతా బసు చివరగా తెలుగులో విజేత చిత్రంలో నటించింది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ లు, ఓటిటి చిత్రాల్లో నటిస్తోంది.