- Home
- Entertainment
- 10 ఏళ్లకే నేషనల్ అవార్డు, 17 ఏళ్లకు స్టార్ హీరోయిన్, 27 ఏళ్లకు పెళ్లి, ఏడాదిలోపు విడాకులు తీసుకున్నహీరోయిన్ ఎవరో తెలుసా?
10 ఏళ్లకే నేషనల్ అవార్డు, 17 ఏళ్లకు స్టార్ హీరోయిన్, 27 ఏళ్లకు పెళ్లి, ఏడాదిలోపు విడాకులు తీసుకున్నహీరోయిన్ ఎవరో తెలుసా?
ఆమె 10 ఏళ్లకే బాలనటిగా నేషనల్ అవార్డు అందుకుంది, 17 ఏళ్లకు హీరోయిన్ గా హిట్ కొట్టింది, కాని ఆతరువాత కెరీర్ లో ఎన్నో ఆటుపోటులు చూసింది. 27 ఏళ్లకు పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్ 28 ఏళ్లకు విడాకులు కూడా తీసుకుంది. ఇంతకీ ఎవరా నటి? ఏంటా కథ?

ఫిల్మ్ ఇండస్ట్రీ మాయా ప్రపంచం
సినిమా ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా హీరోయిన్ల జీవితం కాస్త తప్పటడుగులు వేసినా ఇబ్బందుల్లో పడుతుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న హీరోయిన్లు ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కాని కొంత మంది మాత్రం జీవితాన్ని చేతులారా చెడగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా వేసిన రాంగ్ స్టెప్స్ వారిని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. అలాంటి పొరపాట్లే చేసింది ఓ హీరోయిన్. టాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలగాల్సింది, ప్రస్తుతం అసలు కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు
ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్వేతా బసు ప్రసాద్. చిన్న వయసులోనే బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ జీవిత ప్రయాణం అనేక మలుపులతో నిండి ఉంది. 10 ఏళ్ల వయసులోనే జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న ఆమె, ఆతరువాత కాలంలో ఓ వివాదంలో చిక్కుకొని, మూవీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయింది. 2002లో ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘మక్దీ’ ద్వారా శ్వేతా బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టింది శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘కహానీ ఘర్ ఘర్ కీ’ సీరియల్ ద్వారా ఆమె బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది.
హీరోయిన్ గా పస్ట్ సినిమాతోనే హిట్టు
తెలుగులో ఆమె 2008లో విడుదలైన ‘కొత్త బంగారు లోకం’ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వరుణ్ సందేశ్ సరసన నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఫస్ట్ మూవీతోనే ఆమెకు హిరోయిన్‌గా స్టార్ డమ్ వచ్చేసింది. కాని ఆతరువాత తన కెరీర్ ను సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది శ్వేతా బసు ప్రసాద్. కథల విషయంలో , సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయింది. దాంతో ఇండస్ట్రీలో ఎదురయ్యే పోటీని ఆమె ఫేస్ చేయలేకపోయింది. టాలీవుడ్ లో కొన్నిసినిమాల్లో నటించింది కానీ, సాలిడ్ హిట్ మాత్రం సాధించలేకపోయింది. పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఆమెకు రాలేదు.
ఊహించని కష్టాలు అనుభవించిన శ్వేతా బసు ప్రసాద్
ఇక కెరీర్ ఎలాగోలా సాగుతున్న క్రమంలోనే ఆమె కెరీర్‌లో ఊహించని మలుపు 2014లో వచ్చింది. అదే ఏడాది హైదరాబాద్ లో జరిగిన ఓ రైడ్ లో శ్వేతా బసును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన శ్వేతా, తనను తప్పుగా ఇరికించారని వివరణ ఇచ్చింది. అయితే కోర్డు కూడా శ్వేతా ప్రసాద్ ను నిర్ధోషిగా విడుదల చేసింది. కాని అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. శ్వేతా బసు ప్రసాద్ కు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు అసలే లేకుండా పోయాయి. ఇక వీటన్నింటి తరువాత శ్వేతా తన వ్యక్తిగత జీవితంలో మరో ముందడుగు వేసింది. 2018లో ఆమె తన స్నేహితుడు, నిర్మాత రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు.
శ్వేతా బసు ప్రసాద్ రీ ఎంట్రీ
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్వేతా బసు ప్రసాద్ తాజాగా రీఎంట్రీ ఇచ్చింది. వెబ్ సిరీస్‌ల ద్వారా ఆమె మళ్లీ సినీరంగంలో యాక్టీవ్ అవుతోంది. కొత్త కంటెంట్, నూతన ప్లాట్‌ఫాంలపై ఫోకస్ పెడుతూ ఆమె నటనతో మళ్లీ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.జాతీయ అవార్డు గెలిచిన బాలనటి నుంచి వివాదంలో చిక్కుకుని, ఆ తర్వాత వ్యక్తిగత కష్టాలను అధిగమించి తిరిగి రంగంలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు, ప్రస్తుతం చాలా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. వరుసగా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.