- Home
- Entertainment
- Shruti Haasan: ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్.. బాగా హర్ట్ అయిన శృతి హాసన్ , గబ్బర్ సింగ్ 3 ఉంటుందా ?
Shruti Haasan: ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్.. బాగా హర్ట్ అయిన శృతి హాసన్ , గబ్బర్ సింగ్ 3 ఉంటుందా ?
సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు.

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శృతి హాసన్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తన కెరీర్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చింది శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తె కాబట్టి ఓవర్ నైట్ లో తాను స్టార్ గా మారిపోలేదని శృతి తెలిపింది. అందరి అమ్మాయిలలాగే నేను కూడా టెన్షన్ పడుతూ ఇండస్ట్రీకి వచ్చాను. నా తొలి రెండు సినిమాల విషయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.
నా గొంతు సరిగాలేదని ఎగతాళి చేశారు. అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ నేను తెలుగులో నటించిన తొలి రెండు చిత్రాలు. ఆ రెండు మూవీస్ నిరాశపరిచాయి. దీనితో తాను సినిమాలో ఉంటే దురదృష్టం అని.. ఐరెన్ లెగ్ అని ముద్ర వేశారు. కానీ నేను నటించిన మూడవ చిత్రం గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. దీనితో నాపై ఇండస్ట్రీలో ఒపీనియన్ కూడా మారింది. మనపై ఇతరులకు ఉన్న అభిప్రాయం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కానీ మనం స్థిరంగా ఉండాలని నేర్చుకున్నట్లు శృతి తెలిపింది.
ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు శృతి తెలిపింది. సలార్ టీం తో వర్క్ చేయడం ఎంతో పాజిటివ్ గా ఉంది. ప్రశాంత్ నీల్.. సినిమాలని లార్జ్ స్కేల్ లో తెరకెక్కిస్తారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అలాంటి సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ ఎమోషల్ డ్రామాని అద్భుతంగా జోడించగలరు అంటూ శృతి హాసన్ ప్రశంసించింది.
ఇక పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. మరోసారి మీరిద్దరూ నటించే ఛాన్స్ ఉందా ? గబ్బర్ సింగ్ 3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అది నన్ను అడిగితే ఎలా.. దానికి సంబందించిన వాళ్ళని అడగండి. ఉంటే బావుంటుంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది శృతి హాసన్.