- Home
- Entertainment
- Shruti Haasan: శృతి హాసన్ ఆరోగ్యంపై వదంతులు..అంతా ఫేక్ అంటూ మండిపడ్డ హీరోయిన్, ఆమె అలా చెబితే..
Shruti Haasan: శృతి హాసన్ ఆరోగ్యంపై వదంతులు..అంతా ఫేక్ అంటూ మండిపడ్డ హీరోయిన్, ఆమె అలా చెబితే..
సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు.

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. కానీ నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తోంది.
శృతి హాసన్ ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. శృతి హాసన్ స్వయంగా సోషల్ మీడియాలో తాను పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. యోగ, వర్కౌట్లు చేస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నట్లు తన సోషల్ మీడియా పోస్ట్ లో శృతి హాసన్ తెలిపింది.
కానీ శృతి హాసన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది అని ఆమె ఆరోగ్యం క్రిటికల్ గా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువైంది. దీనితో శృతి హాసన్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన ఆరోగ్యం క్రిటికల్ గా ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడింది.
నాకు PCOS ఉంది. దానిని నేను పాజిటివ్ గా చెప్పాను. ఇది చాలా మంది మహిళలకు ఉండే సమస్యే. దాని వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం నేను పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా ఉన్నాను. నేను పెట్టిన పోస్ట్ ని పూర్తిగా చదువుకుండా చాలా మంది సోషల్ మీడియాలో నా హెల్త్ గురించి పుకార్లు సృష్టిస్తున్నారు. నా ఆరోగ్యం గురించి ఆ పోస్ట్ లో చాలా పాజిటివ్ గా తెలిపాను అని శృతి హాసన్ పేర్కొంది.
నా ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం అవాస్తవం. నేను చెప్పిన అసలు విషయాన్ని గాలికి వదిలేసి.. క్రిటికల్ గా ఉందంటూ అబద్దాలు చెబుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
<p>श्रुति से जब उनकी पर्सनल लाइफ से जुड़ा सवाल किया गया तो उससे बचती नजर आईं। उन्होंने कहा कि 'वह अपनी निजी जिंदगी को निजी ही रखना चाहती हैं।' उन्होंने कहा कि 'एक वक्त था, जब उन्होंने इस बारे में खुलकर बात की थी, लेकिन बाद में उन्हें इस बात के लिए पछतावा झेलना पड़ा था।' </p>
ప్రస్తుతం శృతి హాసన్.. బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ కి జోడిగా సలార్ మూవీలోనూ నటిస్తోంది. తెలుగులో చాలా కలం తర్వాత శృతి హాసన్ మళ్ళీ బిజీగా మారింది.