- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రేమ్ కి ధైర్యం చెప్పిన శృతి.. తులసిని పూర్తిగా మార్చేసిన ప్రవళిక..?
Intinti Gruhalakshmi: ప్రేమ్ కి ధైర్యం చెప్పిన శృతి.. తులసిని పూర్తిగా మార్చేసిన ప్రవళిక..?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 28 వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ లో ప్రారంభంలో మ్యూజిక్ డైరెక్టర్ తనని మోసం చేస్తున్నాడు అని తెలుసుకున్న ప్రేమ్ (pream)అతనిపై కోప్పడతాడు. ఆ తరువాత అతను నీకు పని చేయాలనుకుంటే పని చెయ్ లేకుంటే మానేయ్ అని అనడంతో, అప్పుడు ప్రేమ్,శృతి మాటలు గుర్తుకు తెచ్చుకుని మీ దగ్గర పని చేస్తాను అని చెబుతాడు. మరొకవైపు తులసి(tulasi) ఫ్యాక్టరీకి ఇకపై రాను అని చెప్పేసి వచ్చి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుంది.
ఇంట్లో అందరూ తులసి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య(paramdamayya) మాట్లాడుతూ కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఫ్యాక్టరీ విషయంలో నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి నేను తొందరపడి నిర్ణయం తీసుకోలేదు మామయ్య ఫ్యాక్టరీని నా కన్నబిడ్డ అలాగే చూసుకున్నాను అందుకేనేమో నా బిడ్డలలాగే అది కూడా దూరం అయింది అని అనడంతో అందరూ బాధపడుతూ ఉంటారు.
ఉన్న ఒక్కగానొక్క ఆధారం కూడా లేకపోతే ఇప్పుడు మనం ఎలా బతుకుదాం తులసి(tulasi). అందరూ వెళ్లిపోయారు.. నీకు తోడు ఉండే వారు లేరు కదమ్మా.. కష్టాలకు తోడు మేము కూడా భారంగా మారాము. అసలు మేమే లేకపోతే నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు కదా అని అనసూయ దంపతులు అనడంతో.. అప్పుడు పక్కనే ఉన్న దివ్య(divya) అవును మమ్మీ నేను కూడా నీకు భారం గా మారాను.
నేను ఇకపై నా చదువు ఆపేస్తాను అని అనడంతో.. వారి మాటలకు తులసి కళ్ళు తిరిగి పడిపోతే ఉండగా ఇందులో ప్రవళిక (pravallika )వచ్చి తులసిని(tulasi) పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో అందరితో కలిసి పోయి ప్రవళిక మాట్లాడుతూ ఉంటుంది. తులసి నిర్ణయం తీసుకుంది తప్పో ఒప్పో తన వాళ్ళుగా మీరు సపోర్ట్ చేయాలి కానీ ఇలాo భయపెట్టడం కరెక్ట్ కాదు అని అంటుంది.
అప్పుడు ఆమె ఎవరు అన్నది అర్థం కాక అందరూ ఆమె వైపు అలా చూస్తుండటంతో, అప్పుడు ప్రవళిక (pravallika)మీ వాళ్ళు నన్ను ఎవరో అని అనుకుంటూ విచిత్రంగా చూస్తున్నారు అని వాళ్ళకు పరిచయం చెయ్యి అని అడుగుతుంది. ఆ తర్వాత తులసీ ప్రవళిక ను అందరికీ పరిచయం చేస్తుంది. అనంతరం తులసి వంట రుచి చూస్తుంది ప్రవళిక.
మరొక వైపు ప్రేమ్ (pream)తనకు ఎదురైన అవమానాన్ని తలుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. అక్కడ శృతికి జరిగినదంతా వివరించగా, అప్పుడు వావ్ మై డియర్ ప్రేమ్ అంటూ ప్రేమ్ నీ హగ్ చేసుకుంటుంది శృతి. ఆ తర్వాత శృతి(shruthi )అసలు విషయాన్ని చెప్పి ఫ్రేమ్ ని ఆనందంగా ఉండమని చెబుతుంది. మరొకవైపు ప్రవళిక తులసి తో మాట్లాడుతూ పెళ్లి 25 ఏళ్లు అయింది ఇప్పటికైనా విశ్రాంతి తీసుకో అని అంటుంది. కాని తులసి మాత్రం ఎప్పటిలాగే మాట్లాడటం తో నిన్ను నేను చాలా మార్చేయాలి, రేపు కృష్ణకాంత్ పార్క్ కి రా అక్కడ చెప్తాను అంటుంది ప్రవళిక.
మరొకవైపు లాస్య (ladya)తులసి గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలి పోతూ ఉండగా ఇంతలో నందు అక్కడికి వచ్చి తులసి ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడంతోలాస్య తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడు నందు (nandu)ఎంత ఎవరో కావాలనే చేస్తున్నారు అని అనడంతో లాస్య ఎవరు చేస్తే ఏమిటి మనకు కూడా అదే కదా కావాల్సింది అని అంటుంది.
అలా అంటావేంటి లాస్య(lasya) దాని వల్ల మనకు ఏమి ఉపయోగం ఉంది.. అని అనడంతో సంపాదన లేకపోతే తులసి మీ అమ్మానాన్నలని పోషించలేదు అప్పుడు మీ అమ్మ నాన్న ఇక్కడికి వస్తారు కదా అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా బయటకు వెళ్లిన తులసిని ప్రవళిక(pravallika )టోటల్ గా మార్చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.