- Home
- Entertainment
- ‘అందమే కాదు... అదృష్టం కూడా ఉండాల్సిందేనేమో’! శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్ పై కామెంట్స్!
‘అందమే కాదు... అదృష్టం కూడా ఉండాల్సిందేనేమో’! శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్ పై కామెంట్స్!
టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆమె లేటెస్ట్ పోస్ట్ పై ఇలా స్పందిస్తున్నారు.

బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఫిట్ నెస్ విషయంలో, అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తన లేటెస్ట్ లుక్స్ తో ఫ్యాన్స్, నెటిజన్లను కట్టిపడేస్తోంది.
ఈక్రమంలో తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఓ హోటల్ ను సందర్శించిన సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది.
ట్రెడిషనల్ లుక్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. వయస్సు పెరుగుతున్నా మరింత యంగ్ లుక్ తో ఆకర్షిస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తోంది.
అయితే శ్రద్దా దాస్ లేటెస్ట్ లుక్ తో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతోంది. తన అందం యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఉంది. ఈ క్రమంలో ఫొటోషూట్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
కొందరు అభిమానులు మాత్రం శ్రద్ధా దాస్ కున్న అందానికి కాస్తా అదృష్టం కూడా తోడై ఉంటే.. ఈపాటికి స్టార్ హీరోయిన్ గా దుమ్ములేపేదని అంటున్నారు. ఇప్పటికైనా ఆమె దశతిరగాలని కోరుకుంటున్నారు.
కెరీర్ తొలినాళ్లలో శ్రద్ధా దాస్ కూడా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ఎంతో కృషి చేశారు. కానీ పెద్దగా హిట్లు లేకపోవడంతో అలాఅలా కెరీర్ సాగించింది. ప్రస్తుతం మాత్రం విభిన్న పాత్రలతో అలరిస్తోంది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’, ‘అర్ధం’ వంటి సినిమాల్లో నటిస్తోంది.