- Home
- Entertainment
- పానకం విషయంలో జబర్దస్త్ యాంకర్, ఇంద్రజ మధ్య గొడవ.. స్టేజ్‌పై నుంచి వెళ్లిపోయిన రాకెట్ రాఘవ
పానకం విషయంలో జబర్దస్త్ యాంకర్, ఇంద్రజ మధ్య గొడవ.. స్టేజ్‌పై నుంచి వెళ్లిపోయిన రాకెట్ రాఘవ
జబర్దస్త్ కామెడీ షో గత పదేళ్లుగా విజయవంతంగా రన్ అవుతుంది. ఆడియెన్స్ కి నవ్వులు పంచుతుంది. అయితే ఇందులో తరచూ గొడవలాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

జబర్దస్త్ కామెడీ షోలో నటి ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ కామెడీ ఆర్టిస్టు కృష్ణభగవాన్ సైతం జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త యాంకర్ సౌమ్యరావు దీనికి యాంకరింగ్ చేస్తున్నారు. తాజాగా వచ్చే వారం కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో జడ్జ్ ఇంద్రజ, యాంకర్ సౌమ్య రావు మధ్య గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీరామనవమి స్పెషల్‌గా ఈ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. రాకెట్ రాఘవ పాన్ ఇండియా స్కిట్ అని డాన్ తరహా స్కిట్‌తో నవ్వులు పూయించారు. ఆ తర్వాత యాంకర్ సౌమ్యారావు `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలో శ్రీదేవి పాత్రలో కనిపించింది. అందాలలో.. అంటూ పాటేసుకుంటూ వచ్చి సర్‌ప్రైజ్ చేసింది. అంతేకాదు ఏకంగా స్కిట్ చేసింది. అందులో కర్మనే ఈ స్కిట్ ఎందుకురా ఒప్పుకున్నాను అంటూ కామెడీని పంచింది. నూకరాజ్, పంచ్ ప్రసాద్ ల కామెడీ ఆకట్టుకుంది.
అనంతరం శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ వచ్చింది. అందులో కమెడియన్లు పండగ స్పెషల్‌గా పానకాలు తయారు చేశారు. అందరు చేసిన పానకాలను ఇంద్రజ టేస్ట్ చేశారు. ఇక సౌమ్యరావు అయితే ఏకంగా గ్లాసులకు గ్లాసులే ఎత్తేసింది. అంతా అయిపోయాక పానకం ఎవరు బాగా చేశారని సౌమ్యరావు అడగ్గా.. రాఘవ బాగా చేశాడని ఇంద్రజ చెబుతుంది. కానీ అది కాదని వెంకీ, తాగుబోతు రమేష్ లు చేసింది చాలా బాగుందని సౌమ్యరావు చెప్పారు.
దీంతో ఖంగుతిన్న ఇంద్రజ లేదు రాఘవది బాగుందని మళ్లీ టేస్ట్ చేయించారు, కానీ సౌమ్యరావు అది కాదని, కృష్ణభగవాన్‌కి వెంకీ, తాగుబోతు రమేష్‌ల పానకం టేస్ట్ చేయించబోయింది. దీంతో హర్ట్ అయిన ఇంద్రజ.. `సౌమ్య మీరు ఇంత మంది ఒపీనియన్ తీసుకునేటట్టయితే నన్ను అడగాల్సిన అవసరం లేదని మోహం మీదే చెప్పేసింది. దీంతో సౌమ్యరావుకి మైండ్ బ్లాంక్ అయ్యింది. `ఇది కరెక్ట్ కాదు` అని ఇంద్రజ చెప్పేయడంతో అంతా షాక్ అయ్యారు.
ఈ ఘటనతో రాకెట్ రాఘవ షో మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. స్టేజ్ మీద నుంచి దిగి వెళ్లిపోవడంతో షోలో పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. ఆద్యంతం నవ్వులు పంచే ఈ షోలో తరచూ కమెడియన్ల మధ్య యాంకర్, కమెడియన్ల మధ్య తరచూ గొడవతో కూడిన సీన్లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. టీఆర్‌పీ రేటింగ్ కోసం, ఎపిసోడ్‌పై ఆసక్తిని రేకెత్తించడం కోసం ఇలాంటి హడావుడి సన్నివేశాలను క్రియేట్ చేస్తుంటారనే కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్‌లోని ఇంద్రజ, సౌమ్యరావు గొడవ కూడా అలా క్రియేట్ చేసేందే అని అంటున్నారు నెటిజన్లు. అబ్బో టీఆర్‌పీ స్టంటా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మరి నిజం ఏంటో గురువారం తేలనుంది. ఈ షో గురువారం రాత్రిప్రసారం కానున్న విషయం తెలిసిందే.