Bigg Boss Telugu 7: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఇదేం ట్విస్ట్!
రైతుబిడ్డ ట్యాగ్ తో పాపులారిటీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అతడికి కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట.
బిగ్ బాస్ తెలుగు 7 సెన్సేషన్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అవతరించాడు. కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టిన ఇతగాడు ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. షో మొదలై రెండు వారాలు ముగియగా రెండుసార్లు నామినేషన్స్ లో ఉన్నాడు. అయితే మొత్తం ఓటింగ్ లో 40% ఓట్లు ఆ ఒక్కడికే వస్తున్నాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఇంటి సభ్యులు ఆల్రెడీ పసిగట్టారు. అతనికి జనాల్లో ఉన్న సింపథీ పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ వీక్ నామిషన్స్ లో అమర్ దీప్ చౌదరి, రితికా రోజ్, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు మరికొందరు అతనిపై దాడి చేశారు. సింపథీ డైలాగ్స్ కొట్టొద్దని హెచ్చరించారు. అయినా అతని మేనియా తగ్గకపోగా పెరిగిందని సమాచారం.
ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ పేదవాడు కాదు, అతనికి కోట్ల ఆస్తి ఉందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం పల్లవి ప్రశాంత్ కి సొంత ఊరిలో దాదాపు 26 ఎకరాల పొలం ఉందట. అలాగే మంచి ఇల్లు, కారు కూడా ఉన్నాయట. అతడికి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండటంతో ఆ పనులకు సంబంధించిన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు.
Bigg Boss Telugu 7
వారసత్వంగా పల్లవి ప్రశాంత్ కి ఆస్తులు ఉన్నాయి. అతడు మరీ పేదవాడు కాదు. అతని పొలం, ఇల్లు విలువ కలిపితే కోట్లలో ఉంటుందని ఓ వాదన తెరపైకి వచ్చింది. ఇక తన వీడియోలకు లక్షల వ్యూస్ వస్తున్నా పల్లవి ప్రశాంత్ ప్రమోషన్స్ చేయడు అట. ఆ విధంగా డబ్బులు సంపాదించడం తనకు ఇష్టం లేదట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.
Bigg Boss Telugu 7
ఇటీవల పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారి మాటలను బట్టి చూస్తే పేదవారుగానే అనిపించారు. గతంలో అతని ఫ్రెండ్స్ రూ. 7 లక్షలు మోసం చేశారని, అప్పుడు చనిపోతాను అన్నాడని వారు చెప్పారు. వీడియోలు చేసుకుంటాను అంటే ఫోన్ కొనిచ్చాను, రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోకి రావడానికి చాలా కష్టపడ్డాడని చెప్పడం విశేషం.
Bigg Boss Telugu 7
రతికా రోజ్ మా వాడిని వాడుకుంది. అతనితో ఉంటే తనకు మేలు జరుగుతుందని భావించింది. అమర్ దీప్ చౌదరి ఏరా పోరా అని మాట్లాడటం నచ్చలేదని వారు చెప్పుకొచ్చారు. తమ కొడుకు బిగ్ బాస్ షోకి వచ్చినందుకు ఆనందం అన్నారు.