- Home
- Entertainment
- Karthika Deepam: పాపం.. హిమ కోసం సౌర్యను అలా వాడుకుంటున్న నిరూపమ్.. తట్టుకోలేకపోతున్న హిమ!
Karthika Deepam: పాపం.. హిమ కోసం సౌర్యను అలా వాడుకుంటున్న నిరూపమ్.. తట్టుకోలేకపోతున్న హిమ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 28 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. హిమను (Hima) ప్రేమ్ నీ మనసులో ఏముంది ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అని ప్రశ్నిస్తాడు. దాంతో హిమ ఆ విషయాన్ని ఇప్పుడు వదిలేయ్ అని ఇకపై ఈ విషయం గురించి నాతో మళ్ళీ మాట్లాడవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ (Prem) నిరూపమ్ ను వద్దనుకుంటే నన్ను కోరుకుంటుందా అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు.
మరోవైపు శోభ (Shobha) తన ఇంట్లో ఉన్న పని మనిషి శాంతాబాయ్ ను అర్జెంట్ గా తన ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఒక అడ్రస్ చెప్పి అక్కడే ఉండమని చెబుతుంది. అంతేకాకుండా జ్వాలను గుర్తుచేసుకొని ఇక నీ పని అయిపోతుంది అనుకుంటూ.. నీకు నిరూపమ్ (Nirupam) కు మధ్య అడ్డుగోడగా నేను ఉంటాను అని క్రూరంగా అనుకుంటుంది.
ఇక ఓ రెస్టారెంట్లో నిరూపమ్, జ్వాల (Jwala) హిమ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే హిమ అక్కడికి వచ్చి వాళ్ళను చూస్తుంది. అనుమానం రాకుండా ఇదే మంచి అవకాశం అని ఎలాగైనా జ్వాల మనసులో నిరూపమ్ ఉండేలా చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక నిరూపమ్ శోభ అన్నట్లుగా హిమ (Hima) ముందు మరో అమ్మాయితో క్లోజ్ గా ఉండాలి అని జ్వాలతో క్లోజ్ గా ఉంటాడు.
జ్వాల కూడా హిమతోనే ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటుంది. ఇక ముగ్గురు ఏదో సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే ఆర్డర్ తీసుకోటానికి వేయిటర్ రావడంతో జ్వాల (Jwala), నిరూపమ్ చల్లగా ఐస్ క్రీమ్ తీసుకుంటే హిమ మాత్రం వేడి వేడి సూప్ అడుగుతుంది. ఇక తన మనసులో ఎలాగైనా సౌర్యను నిరూపమ్ (Nirupam) తో పెళ్లి జరిపిస్తాను అని ఉంటుంది.
ఇక ప్రేమ్ హిమ (Hima) ఫోటో చూసుకుంటూ హిమ మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది అని ఆలోచనలో పడతాడు. ఇక హిమ అంటే తనకు చాలా ప్రాణం అని తనను చాలా ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడు. రెస్టారెంట్ లో నిరూపమ్ హిమ ముందు జ్వాల (Jwala) ను పొగుడుతూ ఉంటాడు.
కానీ హిమ (Hima) నిన్ను అడ్డుగా పెట్టుకొని నేను అసహ్యించుకునే విధంగా అట్ల ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటుంది. నిరూపమ్ హిమ ను ఉద్దేశించి జ్వాలతో మాట్లాడుతూ ఉంటాడు. నీవు మనసులో ఉన్న మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెబుతావని కొందరు మాత్రం అలా చెప్పరని హిమను ఉద్దేశించే మాట్లాడతాడు. ఆ మాటలు వింటున్న హిమ నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు బావ కానీ సౌర్య (Sourya) నిన్ను ఇంకా ప్రేమిస్తుంది అని అనుకుంటుంది.
నిరూపమ్ (Nirupam) కూడా తన మనసులో తన జీవిత భాగస్వామి హిమనే అని అనుకొని అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఇక సౌర్య (Sourya) మాత్రం నిరూపమ్ అలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా పొంగిపోతుంది. అప్పుడే హిమతో డాక్టర్ సాబ్ కి నేను ఐ లవ్ యు చెబుతాను అంటే ఎందుకు అడ్డుపడుతున్నావని అనటంతో అప్పుడే నిరూపమ్ వెనక్కి వస్తాడు.
ఆ మాటలు అతడి విన్నాడని అని భయపడతారు. కానీ వారి మాటలు నిరూపమ్ (Nirupam) వినలేదు. మరోవైపు సౌందర్య దంపతులు తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు. హిమకు వేరే పెళ్లి చేయాలని అనుకుంటారు. హిమ రావటం ఇప్పుడైనా నిజం చెప్పు అంటారు. కానీ హిమ (Hima) ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది.