- Home
- Entertainment
- Karhika Deepam: హిమ, శౌర్యల గురించి నిజం తెలుసుకున్న శోభ.. అచ్చం మోనితలానే కుట్రలు?
Karhika Deepam: హిమ, శౌర్యల గురించి నిజం తెలుసుకున్న శోభ.. అచ్చం మోనితలానే కుట్రలు?
Karhika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karhika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనె సౌర్య (Sourya) ఎప్పటినుంచో మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను.. ఐ లవ్ యూ అని నిరుపమ్ (Nirupam) తో అంటుంది. దాంతో నిరుపమ్ స్టన్ అవుతాడు. అంతేకాకుండా అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అని అడుగుతాడు.
ఇక ఆ తర్వాత నిరుపమ్ (Nirupam) ఇంత లేటుగా గాన చెప్పడం అంటూ ఒక చిరునవ్వు ఇస్తాడు. దానికి జ్వాల (Jwala) కూడా చాలా సంతోషపడుతుంది. ఇక ఇదంతా జ్వాల జరిగినట్టు ఊహించుకుంటుంది. ఇక కలలో నుంచి బయటకు వచ్చిన జ్వాల డాక్టర్ సాబ్ పేరు చెప్తేనే.. నా మనస్సు గాల్లో తేలిపోతుందని హిమ తో అంటుంది.
మరోవైపు నిరుపమ్ (Nirupam) జ్వాల (Jwala)ను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? అని చిరాకు పడుతూ ఉంటాడు. ఇక హిమ నిరుపమ్ జ్వాల లను ఒక చోట కలపబోతుంది. మరోవైపు సౌర్య నా మనసులో మాట డాక్టర్ సాబ్ కి చెప్పేయ బోతున్నాను అంటూ తెగ సంతోష పడుతూ ఉంటుంది.
ఒకవైపు ఆనందరావు (Anand Rao) మళ్లీ మనకు సౌర్య కనిపిస్తుంది అంటావా? అని సౌందర్య (Soundarya) చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక సౌందర్య నిరుపను పెళ్లి వద్దని హిమ ఒప్పించిన సంగతి ఆనందరావు కు చెబుతుంది. ఒకవైపు జ్వాల అందంగా చీర కట్టుకుని అనుకున్న చోటుకి వస్తుంది.
ఈలోపు జ్వాల (Jwala) కు డాక్టర్ సాబ్ కనిపించగా.. హలో డాక్టర్ సాబ్ అని అంటుంది. ఇక హిమ (Hima) జ్వాల ప్రపోస్ చేయ బోయే విషయంలో తనకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇక జ్వాల నిరుపమ్ దగ్గరకు వెళ్లడానికి హిమ ఏడు అడుగులు పూలతో అలంకరిస్తుంది. ఇక జ్వాల ఎంతో ఆనందంగా ఉంటుంది.
కానీ అటుగా ఉన్న నిరుపమ్ (Nirupam) ఎంతో విచారంగా ఫీల్ అవుతాడు. ఇక జ్వాల (Jwala) అందంగా ఏడు అడుగులు నడుస్తూ ఉంటుంది. ఇక ఒక పక్క ఉన్న హిమ మీ మధ్య మూడో మనిషి గా ఉన్న నేను త్వరలోనే వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక నిరూపమ్ రా జ్వాల నా మనసు అంతా హిమ నె నిండి ఉంది.
తననే నేను పెళ్లి చేసుకోబోయేది.. అని నీకు స్పష్టంగా చెప్పేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు జ్వాల (Jwala) కు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో ఒక్కసారిగా స్టన్ అయ్యి అక్కడ నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత హిమ (Hima) నువ్వు అక్కడ నుంచి ఎందుకు వచ్చేసావు జ్వాల.. కరెక్ట్ ఏనా అని అడుగుతుంది. ఇక జ్వాల నా శత్రువు హిమ ఫోన్ చేసింది అని చెబుతుంది.