- Home
- Entertainment
- Karthika Deepam: నిరుపమ్‌తో నాకు పెళ్లి చెయ్యండి.. శౌర్య ఎక్కడుందో చెప్తా.. సౌందర్యకు శోభ ఆఫర్!
Karthika Deepam: నిరుపమ్‌తో నాకు పెళ్లి చెయ్యండి.. శౌర్య ఎక్కడుందో చెప్తా.. సౌందర్యకు శోభ ఆఫర్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో... నిరుపమ్ నన్ను ఎందుకు పిలిచి ఉంటారు? వాళ్ళ అమ్మానాన్నకు పరిచయం చేస్తాడు ఏమో.. అయినా కొత్తగా ఏం చేస్తారులే అని జ్వాలా అనుకుని.. నిరుపమ్ పిలిచినా చోటకు వెళ్తుంది.. మరో సీన్ లో హిమను కుటుంబం అంత పెళ్లి కూతురు చేస్తుంటారు. హిమ ఫీల్ అవుతుంటుంది. ఏంటి నాకు ఈ పరీక్షా అని షాక్ అవుతుంది.
ఈరోజు కార్తిక్ దీపలా పెళ్లి రోజు అని సౌందర్య అంటే మమ్మల్ని అత్తయ్య, మామయ్య దీవిస్తారు అని నిరుపమ్ అంటాడు. అనంతరం వారందరు పెళ్లి పనులు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. ఆతర్వాత హిమ, నిరుపమ్ పసుపు దంచుతుంటే వాళ్ళని చూసి తట్టుకోలేక అక్కడ నుంచి శోభ వెళ్ళిపోతుంది. అదే సమయంలో శౌర్య అక్కడకి వస్తుంది.. అలా వచ్చేది చూసి నా ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది శోభ అనుకుంటుంది.
ఎలా అయినా సరే జ్వాలాను అక్కడకు వెళ్లకుండా ఆపాలి అని శోభ ఆపాలి అనుకుంటుంది. మళ్లీ జ్వాలకు హిమలా ఫోన్ చేసి నేను హిమను అని అంటుంది. ఎక్కడున్నావ్ చెప్పు అంటే.. నేను నీ ఆటోలోనే ఉన్న అని.. ఆ శోభ ఆటో డ్రైవ్ చేస్తూ గెట్ బయటకు తీసుకువెళ్తుంది. వెనకే శౌర్య పరుగెత్తుతూ వెళ్తుంది. ఇక మరోవైపు జ్వాలా ఎందుకు రాలేదని నిరుపమ్ ఆలోచిస్తుంటారు.
మరో సీన్ లో నిరుపమ్ కు, శౌర్యకు పెళ్లి చెయ్యాలని హిమ ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఆస్పత్రికి సౌందర్య వచ్చి.. నిరుపమ్ పెళ్లి ముహూర్తం పెట్టమన్నాడని చెప్తుంది. అప్పుడే హిమ సీరియస్ అయ్యి ఏంటి మీరు.. నాకు నచ్చలేదని చెప్పిన మీరు వినర అని అంటుంది. నేను చచ్చిపోబోతున్న అయినా మీరు వినకుండా పెళ్లి చెయ్యాలి అనుకోవడం ఏంటి నా పెళ్లి ఆపండి అంటుంది.
ఇక అప్పుడే నిరుపమ్ వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్పకపోయేసరికి నువ్వు ఏ టైమ్ లో ముహూర్తం అని అడుగుతాడు. హిమ కోపంగా బావ ఆపుతావా అని సీరియస్ అవుతుంది. అప్పుడే ఆటో డ్రైవ్ చేస్తూ శౌర్య వస్తుంది. డాక్టర్ బాబు కోపంగా ఉంటాడు ఎలా అయినా సరే డాక్టర్ బాబు అలక తీర్చాలి అని అనుకుంటూ లోపలికి వస్తుంటుంది.
అప్పుడే సౌందర్య హిమ, నిరుపమ్ పై సీరియస్ అయ్యి మీరు మీరు తేల్చుకోండి అంటూ అక్కడ నుంచి సౌందర్య వెళ్ళిపోతుంది. అప్పుడే శౌర్య వస్తే నిన్ను ఫంక్షన్ కు రమ్మన్నాను కదా ఎందుకు రాలేదు అని నిరుపమ్ అడుగుతాడు. నేను మీ ఇంటికి వచ్చాను చివరి నిమిషంలో వెనక్కు వీళ్ళిపోయాను అని చెప్పి శత్రువు గురించి పూర్తి వివరాలు చెప్తుంది.
ఈ డూప్లికేట్ హిమ ఎవరో కానీ నాకు సహాయం చేసింది.. లోపలికి వచ్చి ఉంటే శౌర్యకు అంత తెలిసేది అని హిమ అనుకుంటుంది. తర్వాత నిరుపమ్ శౌర్య చెయ్యి పట్టుకొని నీతో అన్ని విషయాలు తేల్చుకోవాలి అని అంటే నేను వస్తా అని హిమ అడ్డుకుంటుంది. ఏంటి తింగరి ఇలా చేశావ్ నేను నిరుపమ్ లు సారీ చెప్పాలి అని అంటుంది.
ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవ్వగా శోభ సౌందర్యతో మాట్లాడుతుంది. మీ మనవరాలు ఎక్కడ ఉందొ నాకు తెలుసు మీకు చెప్పాలి అంటే మీరు నాకు నిరుపమ్ కు పెళ్లి చెయ్యాలి అని కండిషన్ పెడుతుంది శోభ. మరి సౌందర్య ఏ నిర్ణయం తీసుకోనుంది.. హిమ జీవితం ఏం మలుపు తిరగనుందో చూడాలి.