కోన్ ఐస్‌క్రీమ్‌తో డస్కీ బ్యూటీ కొంటె పోజులు.. చీరకట్టులో క్యూట్ అందాలతో ఊరిస్తున్న శివాత్మిక రాజశేఖర్..
డస్కీ బ్యూటీ, తెలుగు హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఏ సినిమా చేసినా అందులో కచ్చితంగా విషయం ఉంటుందనే ముద్రని వేసుకుంది. ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో తాను వెళ్తున్న దారి ఏంటో స్పష్టం చేసింది.
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. మంచి నటిగా పేరుతెచ్చుకుంటుంది. ఆమె తెలుగులో నటించింది మూడు సినిమాలే అయినా తన టేస్ట్ ని తెలియజేసింది. తాను ఎలాంటి సినిమాలు చేస్తుందో స్పష్టం చేసింది. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఇంపాక్ట్ చూపించే పాత్రలు చేసేందుకు తాను సిద్ధమే అని చాటి చెబుతుంది.
సెలక్టీవ్‌గా వెళ్లే క్రమంలో ఆఫర్లు తగ్గిపోతాయి. అందుకే ఈ బ్యూటీ చేతిలో ఎక్కువ ప్రాజెక్ట్ లు లేవు. ప్రస్తుతం కేవలం తమిళంలో ఒకటే సినిమా చేస్తుంది. అర్జున్ దాస్‌తో కలిసి నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తెలుగులో ఇప్పటి వరకు మరే సినిమాని ప్రకటించలేదు.
దీంతో సోషల్ మీడియా ద్వారా అలరిస్తుంది. ఆ వెలితి లేకుండా చేస్తుంది. ఈ సారి డోస్ పెంచుతుంది. మొన్న సైమా ఈవెంట్ కోసం రెచ్చిపోయి షో చేసింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపించింది. ఇప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. చీరకట్టి కవ్వింపులు చేస్తుంది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో కవ్విస్తుంది శివాత్మిక రాజశేఖర్. అయితే కోన్ ఐస్ క్రీమ్ తో చిలిపిపోజులిచ్చింది. డస్కీ బ్యూటీ విత్ ఛాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ తింటూ పిచ్చెక్కిస్తుంది. డెడ్లీ కాంబినేషన్‌లో హీటు పెంచుతుంది. కుర్రాళ్లకి హాట్ టచ్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
Shivathmika Rajashekar
శివాత్మిక రాజశేఖర్ `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. రాజశేఖర్, జీవితల తనయ అనే ట్యాగ్‌ని తీసేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. తన నటనతో ఆ విషయాన్ని చాటుకుంటుంది. `పంచతంత్రం`లో చిన్న పాత్రనే అయినా మెప్పించింది. ఇటీవల `రంగమార్తాండ`లోనూ ముఖ్య పాత్రలో అదరగొట్టింది. దిగ్గజ నటులతో పోటీ పడి నటించి ప్రశంసలందుకుంది.
Shivathmika Rajashekar
కమర్షియల్ సినిమాలు కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తుంది. బలమైన పాత్రలతో అలరిస్తుంది. తన దారి ఇదే అనే విషయాన్ని చాటి చెబుతుంది. గ్లామర్ షోకి పోకుండా నటనతో మెప్పించే ప్రయత్నం చేస్తుంది. వెండితెరపై నటనతో, సోషల్ మీడియాలో అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందీ డస్కీ బ్యూటీ.