MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పునీత్ రాజ్‌కుమార్‌ బయోపిక్‌ ప్లాన్‌.. శివరాజ్‌ కుమార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

పునీత్ రాజ్‌కుమార్‌ బయోపిక్‌ ప్లాన్‌.. శివరాజ్‌ కుమార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

Shiva Rajkumar: శివరాజ్‌కుమార్ ప్రస్తుతం 'ఘోస్ట్'(45) సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో తాజాగా ఆయన పునీత్‌ రాజ్‌కుమార్‌ బయోపిక్‌పై రియాక్ట్ అయ్యారు. అప్పు ఫ్యాన్స్ కి హార్ట్ టచ్చింగ్‌ విషయాలను పంచుకున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 22 2025, 06:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Rajkumar

Rajkumar

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మాణం గురించి గాంధీనగర్ లో చాలా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై అభిమానుల్లో అంచనాలు నెలకొంటున్నాయి. అప్పు అభిమానులు తమ అభిమాన నటుడి స్ఫూర్తిదాయకమైన జీవిత కథను వెండితెరపై చూడటానికి  ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Puneeth Rajkumar

Puneeth Rajkumar

ఈ నేపథ్యంలో తాజాగా పునీత్‌ అన్నయ్య, హీరో శివరాజ్‌ కుమార్‌ దీనిపై స్పందించారు. ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు. తన రాబోయే  చిత్రం 'ఘోస్ట్' ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, పునీత్ బయోపిక్ గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు శివరాజ్‌కుమార్ స్పష్టంగా సమాధానమిచ్చారు. 

310
rajkumar, shivarajkumar

rajkumar, shivarajkumar

ప్రస్తుత పరిస్థితుల్లో పునీత్ బయోపిక్ తీసే ఆలోచన తమ కుటుంబానికి లేదని ఆయన అన్నారు. దీనికి కారణాన్ని వివరిస్తూ  `పునీత్ మమ్మల్ని విడిచిపెట్టి చాలా కాలం కాలేదు. ఆ సంఘటనకు సంబంధించిన షాక్, బాధ ఇప్పటికీ మా కుటుంబంలో పచ్చిగా ఉంది" అని అన్నారు. 

410
Puneeth Rajkumar

Puneeth Rajkumar

మనం ఇంకా ఆ దుఃఖం నుండి పూర్తిగా బయటపడలేదు. "ఇలాంటి సమయంలో తన జీవిత కథ గురించి సినిమా తీయడం గురించి ఆలోచించడం, మాట్లాడటం చాలా కష్టం` అని ఆయన వెల్లడించారు. ఇది చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలిపారు. 

510
rajkumar

rajkumar

పునీత్ రాజ్‌కుమార్ జీవితం కేవలం నటనకే పరిమితం కాదని శివరాజ్‌కుమార్ చెప్పారు. `అప్పు ఒక నటుడు మాత్రమే కాదు, విజయవంతమైన గాయకుడు, నిర్మాత, టీవీ హోస్ట్, ముఖ్యంగా, పెద్ద మనసున్న దాత, సామాజిక కార్యకర్త కూడా. 

610
rajkumar

rajkumar

ఆయన వ్యక్తిత్వం బహుముఖమైనది, ఆయన జీవిత పరిధి విశాలమైనది. అప్పు పర్సనాలిటీని, సక్సెస్‌ని, గొప్ప మనస్తత్వాన్ని కొన్ని గంటల సినిమాలో పూర్తిగా చెప్పడం చాలా సవాలుతో కూడుకున్న పని. దానికి న్యాయం చేయడం అంత సులభం కాదు` అని ఆయన అభిప్రాయపడ్డారు.

710
Puneeth Rajkumar, shivarajkumar

Puneeth Rajkumar, shivarajkumar

భవిష్యత్తులో బయోపిక్ తీసే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చకపోయినా, అలాంటి ప్రయత్నం చేయాలంటే అనుసరించాల్సిన ప్రమాణాల గురించి శివన్న మాట్లాడారు. "ఒక బయోపిక్ తీస్తే, దానిని అత్యంత గౌరవంతో, బాధ్యతగా సున్నితత్వంతో చేయాలి` 

810
Puneeth Rajkumar

Puneeth Rajkumar

ఏ కారణం చేతనైనా వారి వ్యక్తిత్వానికి, గౌరవానికి హాని కలిగించని విధంగా, రియాలిటీకి దగ్గరగా ఉండేలా స్క్రిప్ట్‌ను రూపొందించాలి. రియల్‌ స్వభావాన్ని, వ్యాల్యూస్‌ని, సమాజం కోసం చేసిన ఆయన చేసిన సేవలను నిజాయితీగా ప్రతిబింబించాలి. అప్పు పాత్రకు ప్రాణం పోసే సరైన నటుడిని కనుగొనడం కూడా ఒక పెద్ద సవాలుతో కూడుకున్నది` అని తెలిపారు శివరాజ్‌ కుమార్‌. 

910
Puneeth Rajkumar

Puneeth Rajkumar

ప్రస్తుతం శివరాజ్‌కుమార్ 'ఘోస్ట్'(45 మూవీ) విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతోపాటు కన్నడలో మరో రెండు సినిమాలు, తమిళంలో `జైలర్‌ 2`, తెలుగులో `పెద్ది` చిత్రాల్లో నటిస్తున్నారు శివరాజ్‌ కుమార్. 

1010
Puneeth Rajkumar

Puneeth Rajkumar

మొత్తం మీద, పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ కోసం అభిమానులు ఎంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, శివరాజ్ కుమార్ మాత్రం.. తమ కుటుంబ భావాలకు విలువ ఇవ్వాలని, దానికిసరైన టైమ్‌ రావాలని  స్పష్టం చేశారు. 

read  more: నెపోలియన్ కొడుకు ఆరోగ్యంపై వదంతులు, పోలీసులకు ఫిర్యాదు!

also read:9 సార్లు రీమేక్‌ అయిన త్రిష మూవీ ఏంటో తెలుసా? తెలుగులో అది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved