MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్స్.. 100 కోట్ల మెగా హీరో మూవీని రిజెక్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్స్.. 100 కోట్ల మెగా హీరో మూవీని రిజెక్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Heroine: ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. స్టార్‌డమ్ కోసం ఎంతో మంది యంగ్ బ్యూటీస్ ఎలా కష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ హీరోయిన్ మెగా హీరో, 100 కోట్ల భారీ బ్లాస్టర్ మూవీని వదులుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?  

2 Min read
Author : Rajesh K
Published : Sep 23 2025, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్టార్‌డమ్ మిస్
Image Credit : our own

స్టార్‌డమ్ మిస్

సినిమా ఇదోక రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. స్టార్‌డమ్ కోసం ఎంతో మంది యంగ్ బ్యూటీస్ ఎలా పోరాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు దుమ్మురేపుతున్న ఈ కాలంలో, చిన్న సినిమాలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాంటి సమయంలో సినిమా ఆఫర్ రావడం అనేది కొత్త హీరోయిన్‌కి పెద్ద అవకాశమే. అయితే, కొంతమంది మాత్రం తమకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం వల్ల తమ కెరీర్‌కే తామే బ్రేకులు వేసుకుంటున్నారు. అలా ఓ హీరోయిన్ మెగా హీరో, భారీ బ్లాస్టర్ మూవీని రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

25
శివాని రాజశేఖర్
Image Credit : our own

శివాని రాజశేఖర్

ఆమె హీరోయిన్ ఎవరో కాదు. టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రాజశేఖర్ – జీవిత దంపతుల కూతురు శివాని. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో శివాని రాజశేఖర్ ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 2021లో ‘అద్భుతం’చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, అంతకుముందు శ్రీలీలా–రోషన్ జంటగా నటించిన ‘పెళ్లి సందD’లో కూడా మెరిసింది. కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉండే సినిమాలకు మాత్రమే ఓకే చెబుతూ వస్తోన్న శివాని, తనకు వచ్చిన ఆఫర్లను జాగ్రత్తగా ఎంచుకుంటోంది.

Related Articles

Related image1
Now Playing
జీవితా- రాజశేఖర్ గొడవపడతారా..? ఇంటి గుట్టు రట్టు చేసిన శివాని రాజశేఖర్..
Related image2
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ తెలుగు చిత్రం 'ఉప్పెన'.. పలు విభాగాల్లో అవార్డులు పిండేసిన RRR
35
భారీ బ్లాక్ బస్టర్ మిస్
Image Credit : our own

భారీ బ్లాక్ బస్టర్ మిస్

అయితే.. ఈ క్రమంలో శివాని రాజశేఖర్. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’లో హీరోయిన్ ఛాన్స్ వదులుకుందట. ఈ విషయాన్ని శివానీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే.. ఆ కథలో ఉన్న బోల్డ్ కంటెంట్ కారణంగా శివాని ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పిందట. ఈ విషయంపై శివానీ మాట్లాడుతూ.. “ఉప్పెన సినిమా ఆఫర్ నాకు వచ్చింది. కానీ ఆ సినిమా మొదటి కథ చాలా బోల్డ్‌గా రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్‌లో లిప్‌లాక్స్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. నేను అప్పట్లో అలాంటి సీన్స్ చేయడానికి కంఫర్ట్‌గా లేను. భయం వేసింది. ఇప్పటికీ అలాంటి సీన్స్ చేయాలంటే నన్ను నేను కన్విన్స్ చేసుకోవాలి. అందుకే ఆ సినిమా వదులుకున్నా’ అని చెప్పుకొచ్చింది.

45
100 కోట్ల మూవీ
Image Credit : our own

100 కోట్ల మూవీ

శివాని రాజశేఖర్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆ లక్కీ ఛాన్స్ కృతి శెట్టి కొట్టేసింది. ఉప్పెనతో హీరోయిన్‌గా పరిచయం అయిన కృతి ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ కావడం, అలాగే సినిమా రూ. 100 కోట్ల మార్క్ దాటడంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ మారిపోయింది. మరోవైపు శివాని మాత్రం ఉప్పెన లాంటి భారీ సినిమా వదులుకోవడం వల్ల కెరీర్‌లో భారీ సక్సెస్ ను కోల్పోయింది. ఇప్పటివరకు ఆమె ‘అద్భుతం’, ‘విద్య వాసుల అహం’, ‘కోట బొమ్మాళి పీఎస్’ వంటి చిత్రాల్లో నటించి, మెప్పించింది. కానీ, ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఉప్పెన అలాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఆమె కెరీర్ లో లేవు అనే చెప్పాలి.

55
ఆ సినిమా చేస్తే మరోలా
Image Credit : our own

ఆ సినిమా చేస్తే మరోలా

ఏదేమైనా, శివాని తన లిమిట్స్‌కి కట్టుబడి ఉండడం మంచిదే కానీ, ఒక మెగా హీరో సినిమా వదులుకోవడం కెరీర్‌ను ఎంతగానో ప్రభావితం చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Recommended image2
Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం
Related Stories
Recommended image1
Now Playing
జీవితా- రాజశేఖర్ గొడవపడతారా..? ఇంటి గుట్టు రట్టు చేసిన శివాని రాజశేఖర్..
Recommended image2
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ తెలుగు చిత్రం 'ఉప్పెన'.. పలు విభాగాల్లో అవార్డులు పిండేసిన RRR
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved