MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కూతురుని చూడాలని ఉందమ్మా అన్నాడు.. అయినా చూపించలేదు.. మెగా ఫ్యామిలీపై శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి సంచలన వ్యాఖ్యలు

కూతురుని చూడాలని ఉందమ్మా అన్నాడు.. అయినా చూపించలేదు.. మెగా ఫ్యామిలీపై శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి సంచలన వ్యాఖ్యలు

శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ గత నెలలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురు నివృతిని చూడాలనుకున్నాడట. కానీ పంపించలేదట.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 03 2024, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన లివర్స్, లంగ్స్ పాడవడంతో కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది. కానీ గుండెపోటు(కార్డియక్‌ అరెస్ట్)తో చనిపోయినట్టు శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి స్పష్టం చేసింది. తాను తాగుడుకి బానిసై చనిపోయినట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించింది. అందరు తాగినట్టే తాగేవాడు తప్ప, బాధతో ఎక్కువగా తాగేవాడు కాదని తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇదిలా ఉంటే చనిపోవడానికి నెల రోజుల వరకు బాగానే ఉన్నాడని, దుబాయ్‌లో బర్త్ డే కూడా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చాక హెల్త్ సమస్య వచ్చిందని, దీంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందాడని చెప్పింది శిరీష్‌ మదర్‌.  నెల రోజులుగా ఆ ఆసుపత్రిలోనే ఉన్నాడని, ఉన్నట్టుండి కార్డియక్‌ అరెస్ట్ కావడంతో మృతి చెందనట్టు తెలిపింది శిరీష్‌ తల్లి. లంగ్స్, లివర్‌ డ్యామేజీతో చనిపోయాడనే వార్తలు నిజం,  అలాగే ఏఐజీలో ఛాయిన్‌ చేశారని, చెన్నైలో ట్రీట్‌ మెంట్‌ తీసుకున్నాడని వస్తోన్న వార్తలు నిజం కావని తెలిపింది శిరీష్‌ తల్లి. 
 

35

ఈ సందర్బంగా తన కొడుకు లేకపోవడం పట్ల ఆమె బాధని వ్యక్తం చేసింది. అయితే ఆయనకు కొడుకు ఉన్నాడనే రూమర్‌ని ఖండించిన ఆమె, అవన్నీ అబద్దమని, కూతురు నివృతి మాత్రమే ఉందని, ఇప్పుడు శ్రీజ ఫ్యామిలీ(చిరంజీవి ఫ్యామిలీ)తోనే ఉంటున్నట్టు చెప్పింది.  శిరీష్‌కి కూతురు అంటే ఎంతో ఇష్టమని, అచ్చు శిరీష్‌లాగే ఉంటుందని, నివృతిని చూడాలనిపిస్తుందని తెలిపింది. పంపిస్తే చూడాలని ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది. 
 

45

శిరీష్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూతురుని చూడాలనిపిస్తుందని అడిగాడట. దీంతో పాపని పంపించమని  శ్రీజ, మెగా ఫ్యామిలీని అడిగారట. తెలిసిన వాళ్ల ద్వారా అడిగిపించామని, కానీ వాళ్లు పంపించలేదని తెలిపింది శిరీష్‌ తల్లి. దీంతో కొడుకు ఎంతో బాధపడ్డాడని చెప్పింది. ఏ తండ్రి అయినా కూతురుని దూరం చేసుకోవాలనుకోడని చెప్పింది. నివృతి మా వంశం, మా పాప, నా మొదటి మనవరాలు, ఆమెని చూడాలని నాకూ ఉంటుంది. కానీ పంపించడం లేదని, పెద్ద వాళ్లు కదా అని చెప్పింది. ఆమెని కలిస్తే, పాపతో మాట్లాడాల్సి వస్తే ఏం చెబుతారని అడగ్గా, మీ నాన్నగారు ఇది, నేను నానమ్మని, ఇది మన ఫ్యామిలీ` అని చెబుతా అని తెలిపింది శిరీష్‌ తల్లి.  

55

శ్రీజ, శిరీష్‌ విడిపోవడానికి సంబంధించిన ఆమె మాట్లాడుతూ, కారణాలు తెలియదని, అది గుర్తు లేదని, చాలా ఏళ్లు అయిపోయిందని తెలిపింది. శ్రీజపై ప్రశంసలు కురిపించింది. మంచి అమ్మాయని, చాలా ఇన్నోసెంట్‌ అని, బాగా ఉండేదని తెలిపింది. విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు, తన మనవరాలిని మాత్రం చూడాలని ఉందనే కోరికని వెల్లడించింది శిరీష తల్లి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Recommended image2
CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?
Recommended image3
Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved