- Home
- Entertainment
- Prema Entha Madhuram: అను ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన అంజలి.. నిజం చెప్పి శారదమ్మకి షాకిచ్చిన మాన్సీ!
Prema Entha Madhuram: అను ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన అంజలి.. నిజం చెప్పి శారదమ్మకి షాకిచ్చిన మాన్సీ!
Prema Entha Madhuram:జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. తమ్ముడిని ఉన్నత స్థాయిలో చూడాలని తపన పడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో యాదగిరి నవ్వుతూ ఉండగా దయచేసి ఇంకెప్పుడూ నవ్వద్దు యాదగిరి తట్టుకోలేము అని అంటుంది అంజలి. ఇంతలో బయలుదేరుతాము అంటాడు ఆర్య. మాస్క్ పెట్టుకున్న ఆర్య తో నీలాంటి అందమైన ముఖాన్ని మాస్క్తో కప్పేయడం ఎందుకు ఆనంద్ మాస్క్ పెట్టుకుంటే యాదగిరి లాంటి వాళ్ళు పెట్టుకోవాలి అంటుంది అంజలి.
యాదగిరి ఉడుక్కుంటూ మీరు ఇలా అంటే ఉద్యోగం మానేస్తాను మేడం అంటాడు అదేంటి యాదగిరి నీకు బెస్ట్ మేనేజర్ అవార్డు కి నామినేషన్ చేయిద్దాం అనుకున్నాను నీ ఇష్టం మానెయ్ అంటుంది అంజలి. నేనెందుకు మానేస్తాను మేడం ఇక్కడే ఉంటాను అని చెప్పి అందరూ లోపలికి బయలుదేరుతారు లోపలికి వచ్చిన తరువాత అక్కడ ఉన్న మినిస్టర్ ని చూసి షాక్ అవుతుంది అంజలి.
ఆనంద్ ఈయన ఆరోజు నీతో మాట్లాడిన మినిస్టర్ గారే కదా ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చారు వాట్ ఎ కో ఇన్సిడెంన్స్ అంటుంది. ఆ తర్వాత సీన్లో శారదమ్మ కుటుంబంతో సహా అక్కడికి వస్తుంది. ఆ ఫంక్షన్ హాల్ ని చూసి జెండే 2003 2004 ఆ సమయంలో ఆర్య కొత్తగా బిజినెస్ పెట్టిన మొదల్లో తన ప్రతిభకు మెచ్చి ఒక పెద్ద అవార్డు ఇచ్చారు మేడం గుర్తుందా అని శారదమ్మతో అంటాడు.
నేనెందుకు మర్చిపోతాను ఆర్య కి వచ్చిన మొదటి అవార్డు కదా అది అంటుంది శారదమ్మ. అయితే తర్వాత నాకే వస్తుంది అన్నమాట అని మనసులో అనుకుంటుంది మాన్సీ తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. అదే సమయంలో ఇప్పుడే వస్తాను మేడం అని చెప్పి అంజలి దగ్గరనుంచి బయటికి వస్తుంది అను. మెట్లు ఎక్కుతున్న దారిలో మాన్సీ కనిపిస్తుంది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అనుని అడుగుతుంది.ఆ క్వశ్చన్ నేను అడగాలి బ్యూటీ పార్లర్ లోని ఫ్యాషన్ షో లోని ఉండాల్సిన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంది అను.
నాకు ఇక్కడికి రావడానికి అర్హత ఉన్నది నేను ఆర్య వర్ధన్ భార్యని గట్టిగా మాట్లాడితే ఇక్కడికి రావడానికి మీకు ఏం హక్కు ఉన్నది అంటుంది. కోపంతో మాన్సీ చెయ్యి ఎత్తుతుంది. అను గట్టిగా మాన్సీ చేయి పట్టుకొని కిందకు తోస్తుంది. ఇది ఇల్లు కాదు పబ్లిక్ లోకి వచ్చాము బస్తీ చేతి దెబ్బ చంపకు తగిలితే అందరి ముందు పరువు పోతుంది అని ఊరుకుంటున్నాను అంటుంది అను. ఇంతలో అక్కడికి వచ్చిన అంజలి భలే వార్నింగ్ ఇచ్చావు విజిల్ వేయడం రాదు కానీ అదొకటే తక్కువ అంటుంది అంజలి. నువ్వు దానికి సపోర్ట్ చేస్తావేంటి అంజలి నీ బర్త్ డే కి కూడా నువ్వు తనకే సపోర్ట్ చేశావు అంటుంది మాన్సీ.
ఎందుకు మాన్సీ మనుషుల్ని పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని డబ్బుతో పోలుస్తారు అందరూ ఒకరే కదా అని అంటుంది అంజలి. ఇంతలో శారదమ్మ వాళ్ళు అక్కడికి వస్తారు అనుని చూసిన శారదమ్మ వెంటనే వెళ్లి హత్తుకుంటుంది ఇప్పుడే అందరు కలిస్తే బాగున్ను అనుకున్నాము ఇంతలో మీరు వచ్చారు ఇంకెవరూ రాలేదా అని నీరజ్ అడుగుతాడు. ఆనంద్ కూడా వచ్చాడు అని ఆర్య కోసం వెతుకుతూ ఆర్యని పిలుస్తుంది. అప్పుడు ఆర్య అక్కడికి వచ్చి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ శారదమ్మని పలకరిస్తాడు. నువ్వు ఇచ్చిన రక్తం కదా బాబు బానే ఉన్నాను అంటుంది శారదమ్మ.
అప్పుడు అంజలి నాకు ఈ ఫంక్షన్ లో నామినేషన్ వచ్చింది ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ కింద అని అనగా ఏంటి నీకు కూడా వచ్చిందా అని మాన్సీ ఆశ్చర్య పోతుంది అంటే నీకు కూడా వచ్చిందా అని అడుగుతుంది అంజలి. ఫ్యాషన్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి నామినేషన్ వచ్చింది అంటుంది మాన్సీ. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు చెప్పనేలేదు అని శారదమ్మ అంటుంది. మాన్సీ ఇంతలో షిండే డైనమిక్ బిజినెస్ మాన్ అఫ్ ది ఇయర్ గా నీరజ్ సార్ కి కూడా నామినేషన్ వచ్చింది అని అనగా దానికి మాన్సీ ఆశ్చర్య పోతుంది ఇంతలో మదన్ అక్కడికి వచ్చి నీకు రాదు ఎందుకంటే అందులో నాకు కూడా నామినేషన్ ఉన్నది.
నేను పోటీగా ఉన్నానంటే ఎదుటి వాళ్ళు కచ్చితంగా ఓడిపోవాల్సిందే గెట్ రెడీ అని అంటాడు. అప్పుడు నీరజ్ నో నేను ఓడిపోయే ఛాన్సే లేదు ఎందుకంటే నేను గ్రేట్ ఆర్య వర్ధన్ తమ్ముణ్ణి కచ్చితంగా గెలుస్తాను అని చెప్తాడు నీరజ్. వెయిట్ అండ్ సీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్. మిగిలిన వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అను, ఆర్య దగ్గరికి వచ్చి మదన్ సార్ కూడా ఉన్నారంటే కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది కదా అని అంటుంది. అయినా నీరజ్ గెలుస్తాడని నాకు అనిపిస్తుంది అంటాడు ఆర్య
ఆ తర్వాత సీన్లో మాన్సీ బ్యాక్ స్టేజ్ కి వెళ్లి నేనొక్కదాన్నే నామినేట్ అయ్యాను అనుకుంటే ఇన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి ఏంటి అని అనుకుంటుంది ఇంతలో ఎవరో అటువైపు వెళుతూ ఒక ఫోటోని పారేసుకుంటారు.అది తీసిన మాన్సీ, ఆర్య ఫోటో ని చూస్తుంది ఈయన ఆర్య వర్ధన్ గారు అని చాలా గొప్ప ఆయన నేను ఏమీ చేయలేను అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఈయన స్పీచ్ విని బిజినెస్ మొదలు పెట్టాను అందుకే నాకు అవార్డు వస్తే ఈయన ఆర్ట్ని అందరి ముందు గీస్తాను అని అంటాడు. అప్పుడు మాన్సీ మనసులో ఇప్పుడు బ్రో ఇన్ లా అసలు రూపం బయటపడితే కథ మలుపులు తిరిగి నా కొంపే ములుగుతుంది అంటుకుంటుంది.
ఆ వ్యక్తికి మాయమాటలు చెప్పి వేరే గదిలోకి తీసుకొని వెళ్లి గడియ వేసేస్తుంది మాన్సీ. హమ్మయ్య ఒక సమస్య తీరిపోయింది అని చెప్పి ఏమీ ఎరుగనట్లు లోపలికి వచ్చేస్తుంది. ఇంతలో అవార్డు ఫంక్షన్ మొదలవుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.