MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పగిలిన గోడలతో అద్దె ఇంట్లో హృతిక్.. దాదాపు రూ.100 కోట్లతో కొత్త ఇల్లు ?

పగిలిన గోడలతో అద్దె ఇంట్లో హృతిక్.. దాదాపు రూ.100 కోట్లతో కొత్త ఇల్లు ?

ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరడుగుల కటౌట్, సిక్స్ ప్యాక్ బాడీతో హృతిక్ సినిమాల్లో చేసే సాహసాలు కళ్ళు చెదిరే విధంగా ఉంటాయి.

2 Min read
Author : pratap reddy
Published : Sep 20 2021, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరడుగుల కటౌట్, సిక్స్ ప్యాక్ బాడీతో హృతిక్ సినిమాల్లో చేసే సాహసాలు కళ్ళు చెదిరే విధంగా ఉంటాయి. ఇండియన్ సినిమా యాక్షన్ కు కొత్త అర్థం చెప్పిన హీరో హృతిక్ రోషన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడప్పుడూ హృతిక్ రోషన్ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల హృతిక్ రోషన్ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ పిక్ నెట్టింట వైరల్ అయింది. తన తల్లి పింకీ రోషన్ తో కలసి బ్రేక్ ఫాస్ట్ చేశానని హృతిక్ పోస్ట్ పెట్టాడు. ఇందులో వైరల్ కావడానికి ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఫోటోలో హృతిక్ ఇంటి గోడ పగుళ్లతో ఉంది. 

37

ఈ విషయాన్ని కనిపెట్టిన హృతిక్ అభిమానులు కామెంట్స్ తో మోతెక్కించారు. కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకునే హృతిక్ ఇంటికి పగుళ్లు ఉండడం ఏంటి అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనితో అభిమానుల కామెంట్స్ కు హృతిక్ రోషన్ స్పందించాల్సి వచ్చింది. 

47

తాను ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని త్వరలోనే కొత్త ఇల్లు కొనబోతున్నట్లు హృతిక్ ప్రకటించాడు. అలాగే గోడపై ఉన్న పగుళ్లు గురించి కూడా హృతిక్ జోకులు వేశాడు. గోడలపై పగుళ్లు లేకుంటే వాటిని సరిచేసే ఆనందం ఎలా పొందుతాం అని కామెంట్ చేశాడు. 

57

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ టాప్ లీగ్ హీరో. హృతిక్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. అలాంటి హీరో అద్దె ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ హృతిక్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దె ఎంతో తెలిస్తే షాక్ కి గురికావడం ఖాయం. హృతిక్ ఉంటున్న ఇంటి రెంట్ నెలకు రూ 8 లక్షలట. 

67

ఇదిలా ఉండగా ముంబై జుహు ప్రాంతంలో హృతిక్ రోషన్ దాదాపు ఋ 100 కోట్లతో డూప్లెస్ హౌస్ కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో 14, 15, 16 ఫ్లోర్స్ హృతిక్ రోషన్ కి చెందినవిగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. అరేబియన్ సముద్రం కనిపించేలా హృతిక్ తన కొత్త ఇంటిని కొన్నాడట. మరి హృతిక్ కొత్త ఇంట్లోకి ఎప్పుడు షిప్ట్ అవుతాడో చూడాలి. 

77

ఇక సినిమాల విషయానికి వస్తే హృతిక్ ప్రస్తుతం క్రిష్ 4 చిత్రానికి రెడీ అవుతున్నాడు. తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలోనే ఈ మూవీ తెరకెక్కనుంది. హృతిక్ రోషన్ సూపర్ హీరోగా నటిస్తున్న క్రిష్ ప్రాంచైజీ పిల్లల నుంచి పెద్దల వరకు అభిమానులని సొంతం చేసుకుంది. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Recommended image2
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?
Recommended image3
Chiranjeevi: 1 టూ 10 చిరంజీవి అయితే బాలయ్య 11..కానీ అది మెగాస్టార్ రేంజ్ కాదు, అన్నీ పిచ్చి సినిమాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved