టాలీవుడ్ క్రేజీ హీరో తండ్రి నాపై మోజు పడ్డాడు, గదికి వస్తే అలా చేస్తా అన్నాడు.. పేరుతో సహా బయటపెట్టిన షకీలా
కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడు చర్చ జరిగినా షకీలా స్పందిస్తూ ఉంటుంది. షకీలా ఎన్నో చిత్రాల్లో అశ్లీల మైన పాత్రలు చేసింది. ఫలితంగా తాను ఎన్నో వేధింపులకు గురయ్యానని కూడా షకీలా గతంలో పేర్కొంది.
షకీలా గురించి ఎవ్వరికి పరిచయం అవసరం లేదు. 90 దశకంలో ఆమె మలయాళంలో శృంగార చిత్రాలతో ఒక ఊపు ఊపింది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేలా సహాయం చేసింది మాత్రం డైరెక్టర్ తేజనే.
జయం, నిజం చిత్రాల్లో షకీలాకు తేజ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత షకీలా పలు చిత్రాల్లో కామెడీ రొమాంటిక్ వేషాలు వేసింది. ఇటీవల షకీలా బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆమె సెకండ్ వీక్ లో ఎమిలినేట్ అయిన సంగతి తెలిసిందే.
కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడు చర్చ జరిగినా షకీలా స్పందిస్తూ ఉంటుంది. షకీలా ఎన్నో చిత్రాల్లో అశ్లీల మైన పాత్రలు చేసింది. ఫలితంగా తాను ఎన్నో వేధింపులకు గురయ్యానని కూడా షకీలా గతంలో పేర్కొంది. ఇటీవల నటి విచిత్ర ఓ స్టార్ హీరో రాత్రి తనని రూమ్ కి పిలిచాడని, వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఆ సంఘటనతోనే సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమైనట్లు విచిత్ర చెప్పుకొచ్చింది. విచిత్ర చేసిన ఈ కామెంట్స్ నందమూరి బాలకృష్ణపైనే అని అంతా భావించారు.
అయితే విచిత్ర కామెంట్స్ పై షకీలా తాజాగా స్పందించింది. విచిత్ర నేను స్నేహితులం. కలసి అనేక చిత్రాల్లో నటించాం. అయితే విచిత్ర తనని ఎవరు వేధించారు ? ఏ హీరో గదికి రమ్మని పిలిచాడు అనేది కూడా చెప్పి ఉంటే బావుండేది అని తెలిపింది. అతడి పేరు బయట పెట్టాల్సింది అని పేర్కొంది. అయితే ఈ విషయంలో షకీలా విచిత్రకి మద్దతు తెలిపింది.
టాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ నుంచి తనకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది అని షకీలా పేర్కొంది. అయితే షకీలా ధైర్యంగా ఆ డైరెక్టర్ పేరు కూడా చెప్పేసింది. ఆయన ఎవరో కాదు అప్పటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ. ఈవీవీ సత్యనారాయణ క్రేజీ హీరో అల్లరి నరేష్ తండ్రి అనే సంగతి తెలిసిందే.
ఈవీవీ దర్శకత్వంలో ఒక చిత్రంలో నేను నటించాను. ఆ సమయంలో ఈవీవీ నన్ను అడ్జెస్ట్ మెంట్ అడిగారు. నువ్వు నాతో అడ్జెస్ట్ అవ్వు.. నా రూమ్ కి రా అని పిలిచారు. అలా చేస్తే నీకు నా నెక్స్ట్ మూవీలో కూడా ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. నేను వెంటనే సర్ ఈ సినిమాలో నటించినందునుకు నాకు డబ్బులు వచ్చేశాయి.. నెక్స్ట్ మూవీలో నాకు ఛాన్స్ వద్దు.. ఎందుకంటే నాకు ఆ అవసరం లేదు అని ముఖం మీదే చెప్పేసినట్లు షకీలా పేర్కొంది.
ఎవ్వరు వచ్చి అడిగినా ఈ విషయం నేను ధైర్యంగా చెబుతా. అవును ఈవీవీ గారు నన్ను గదికి రమ్మని పిలిచారు.. నేను ఒప్పుకోలేదు అని చెబుతా. షకీలా చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.