- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి మాటలకు అయోమయంలో ఏంజెల్.. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న శైలేంద్ర?
Guppedantha Manasu: రిషి మాటలకు అయోమయంలో ఏంజెల్.. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న శైలేంద్ర?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. బాబాయిని దెబ్బతీయటం కోసం తండ్రికి బిస్కెట్లు వేస్తున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఆగస్టు 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను రాత్రి మంచినీళ్లు కోసం బయటికి వచ్చినప్పుడు మీ గదిలో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఆ రాత్రి అప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అడగలేదు. అప్పటికి ఇంకా వర్క్ చేస్తున్నారా పిన్ని అని అడుగుతాడు శైలేంద్ర.అవును అంటుంది జగతి. నువ్వు హెల్ప్ చేసావా అని తమ్ముడ్ని అడుగుతాడు ఫణీంద్ర. లేదు అన్నయ్య అంతా తనే చేసుకుంది అంటాడు మహేంద్ర.
అంతా నువ్వు ఒక దానివే చేసుకునే బదులు నాకు కూడా పని అప్పచెప్పొచ్చు కదా పిన్ని నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటాను అని జగతితో మాట్లాడుతూ.. పిన్ని నన్ను ఎందుకో ఈ పనులకు దూరంగా ఉంచుతుంది అని తండ్రికి కంప్లైంట్ చేస్తాడు శైలేంద్ర. నువ్వు అక్కర్లేని విషయాల్లో కలుగ చేసుకుంటున్నావు అందుకే అవాయిడ్ చేస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం లేదు అంటాడు మహేంద్ర.
నేర్చుకోవాలని తపన పడుతున్నాడు పని నేర్పించండి అని దేవయాని, ఫణీంద్ర కూడా చెప్పడంతో సరే అని ఒప్పుకుంటారు జగతి దంపతులు. మరోవైపు రిషి లేటుగా లేచి వచ్చే హాల్లో కూర్చుంటాడు. లేటుగా లేచావా, రాత్రి ఎక్కడికో వెళ్ళావ్ అంట కదా అంటాడు విశ్వనాథం. అవును సార్ నిద్ర పట్టలేదు అందుకే అలా వెళ్లాను అంటాడు రిషి. మరోవైపు మూడు కాఫీలు చేసి తీసుకువస్తుంది రిషి ఇంకొకటి ఎవరికమ్మా అని అడుగుతాడు చక్రపాణి.
రిషి సార్ కి నాన్న ఆయన రాత్రి జరిగిన గొడవకి ఇంకా కాఫీ తాగి ఉండరు. ఆయనకి కాఫీ అంటే చాలా ఇష్టం అంటుంది వసుధార. అక్కడ రిషి కూడా వసూని తలుచుకుంటూ కాఫీ తాగుతాడు. నేను తప్పు చేశానా.. నేను చేసుకోబోయే వాడికి మరో వ్యక్తి కోసం లవ్ లెటర్ రాశాను అనుకుంటుంది వసుధార. అవును నువ్వు తెలిసి చేసినా,తెలియక చేసినా నా మనసుని బాధ పెడుతున్నావు అనుకుంటాడు రిషి. రిషి సార్ ఏంజెల్ బలవంతం మీద గాని విశ్వనాథ్ సార్ బలవంతం మీద కానీ ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటారేమో అని మనసులోనే కంగారుపడుతుంది వసుధార.
అలా ఎప్పటికీ జరగదు. నా మనసులో ఎప్పటికీ ఒకరికే స్థానం అనుకుంటాడు రిషి. మరోవైపు కారులో వెళ్తున్న మహేంద్ర వాళ్ళు శైలేంద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శైలేంద్ర ఇంత నక్క వినియం ప్రదర్శిస్తున్నడు అంటే మళ్ళీ ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నట్లుగా ఉన్నాడు అంటుంది జగతి. అవును అంటాడు మహేంద్ర. మనం రిషి మీద పడిన మచ్చని చెరిపేసేలాగా చేయాలి అప్పుడు అందరికీ శైలేంద్ర నిజస్వరూపం తెలుస్తుంది. అప్పుడే రిషి మీ ఇద్దరినీ అర్థం చేసుకుంటాడు అంటాడు మహేంద్ర.
అప్పటివరకు సైలేంద్రని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వేసే ప్రతి అడుగు నీ మనం అబ్జర్వ్ చేయాలి అంటుంది జగతి. మరోవైపు అద్దం ముందు నిలుచున్న రిషికి వసుధార ఆత్మ కనిపిస్తుంది. నేనంటే ఇష్టం లేదంటున్నారు మరి చేతికి ఉన్న బ్రాస్లెట్ ఎందుకు అంటుంది వసుధార ఆత్మ. ముందు పౌరుషంగా తీసేద్దాం అనుకుంటాడు కానీ వసుధార మీద ఉన్న ప్రేమతో తీయలేక పోతాడు. ఇది నాది నా ఇష్టం నా ఇష్టం వచ్చినప్పుడు తీస్తాను అంటాడు.
నాకు తెలుసు సార్ అది మీరు తీయలేరు. మీకు నేనంటే ఇప్పటికీ ప్రేమ ఉంది అంటుంది వసుధార. ఇందులో ఏంజెల్ రావడంతో వసుధార ఆత్మ మాయమైపోతుంది. రిషికి కర్చీఫ్ ఇస్తుంది ఏంజెల్. నాకు ఇలాంటివి నచ్చవు, నీకు కాబోయే వాడికి ఇలాంటి పనులు చేయు నాకు కాదు అంటాడు రిషి. నాకు కాబోయే వాడివి నువ్వే కదా, రాత్రి లెటర్ చదవడా,లేదా అని మనసులో అనుకుంటుంది ఏంజెల్.
నువ్వు అనుకున్నది ఏదీ జరగదు అంటాడు రిషి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ అని అయోమయంగా అడుగుతుంది ఏంజెల్. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాని గురించే మాట్లాడుతున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. అసలు ఏం మాట్లాడాడో, దేని గురించి మాట్లాడేటో అర్థం కాక అయోమయం పడుతుంది ఏంజెల్.
మరోవైపు కొడుకుని తన గదిలోకి రప్పించి మీ పిన్ని బాబాయ్ వాళ్ళని అంత రిక్వెస్ట్ చేయవలసిన పనేముంది అని కొడుకుని మందలిస్తుంది దేవయాని. దాని వెనక ఉన్న టార్గెట్ డాడీ. డాడీ మన మాట విన్నట్లయితే మనం అనుకున్నది సాధించవచ్చు. డాడీ సపోర్ట్ త్వరలోనే సాధిస్తాను చూడు అంటాడు శైలేంద్ర. నాకు కావలసింది కూడా అదే అంటుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.