- Home
- Entertainment
- Guppedantha Manasu: శైలేంద్ర కాలర్ పట్టుకున్న జగతి.. వసుధారను అలర్ట్ చేసిన మహేంద్ర?
Guppedantha Manasu: శైలేంద్ర కాలర్ పట్టుకున్న జగతి.. వసుధారను అలర్ట్ చేసిన మహేంద్ర?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అధికారం చేసికించుకోవడం కోసం తమ్ముడు ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో శైలేంద్ర రిషి ఎంగేజ్మెంట్ ఫోటోలు పంపించి బ్యానర్స్ కట్టించమని అటెండర్ కి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు విని, అక్కడ ఉన్న రిషి ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూసి కంగారు పడుతుంది జగతి ఏదో ప్లాన్ చేయబోతున్నాడు అని అర్థం చేసుకుంటుంది. కంగారు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్చేస్తే వసుధార పాండ్యన్ వాళ్ళని పిలిచి మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేకపోతున్నాను.
నాకు మీ సపోర్ట్ కావాలి అని అడుగుతుంది. ఏం చేయాలో చెప్పండి మేడం అంటారు వాళ్ళు. రిషి సార్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయవచ్చు కానీ మొన్న జరిగిన ఇష్యూ కి ఆయన చాలా డిస్టబెన్స్ గా ఉన్నారు అందుకే నేను చెప్పినట్లు చేయండి అని పాండ్యన్ వాళ్ళకి ఏదో చెప్తుంది. ఆ తర్వాత రిషి కాలేజీకి వస్తే అతని చేతిలో ఒక పేపర్ పెడతాడు పాండ్యన్. అందులో మిషన్ ఎడ్యుకేషన్ ని యాక్సెప్ట్ చేయండి అని రాసి ఉండడం చూస్తాడు రిషి కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.
మిగతా ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు శైలేంద్ర బాత్రూంలో ఉన్నప్పుడు ధరణి భర్త ఫోన్ తీసుకొని జగతికి ఇస్తుంది. త్వరగా చూసి ఇచ్చేయండి ఆయన వచ్చేలోపు మళ్ళీ పెట్టేస్తాను అంటుంది. జగతి ఆ ఫోన్ చూసేలోపే శైలేంద్ర వచ్చి చాలా సాహసం చేశారు కానీ మీరు ఎంత వెతికినా మీకు ఏమీ దొరకదు. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు ఎవరికీ తెలియకూడదని మీరంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను అంటాడు.
నేను నీతో తర్వాత మాట్లాడుతాను ముందు మాట్లాడాలి అని చెప్పి ధరణినిa అక్కడ నుంచి నెట్టేస్తాడు. తర్వాత శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది జగతి మళ్ళీ రిషి కి ఏం ప్రమాదం తలపెట్టావు అంటూ నిలదీస్తుంది. అప్పుడు శైలేంద్ర అసలు విషయం చెప్పకుండా మీరు బాబాయి ఏం చేస్తున్నారో నాకు తెలియదనుకుంటున్నారా.. రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అంటాడు శైలేంద్ర. తెలిస్తే ఏం చేస్తావురా అని మహేంద్ర మాటలు వినిపించడంతో గుమ్మం వైపు చూస్తారు శైలేంద్ర, జగతి. అక్కడ కోపంతో ఉన్న మహేంద్ర ని చూసి షాక్ అవుతారు.
శైలేంద్ర ఏదో మాట్లాడకపోతే నువ్వు ఎక్కువ నటించకు చూడలేకపోతున్నాను నువ్వు ఏమేమి చేసావో నాకు అన్ని తెలుసు కానీ మా నీకోసం ఓపిక పడుతున్నాను అంటాడు మహేంద్ర. బాబాయ్ ఎప్పటికైనా ఎండి సీట్ నాదే మీ బలహీనత అయినా నా బలహీనత అయినా మా డాడీ యే. కాబట్టి ఈ పోటీలో కచ్చితంగా నేనే గెలిచి తీరుతాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. జరిగిన విషయాన్ని వసుధార కి ఫోన్ చేసి చెప్తాడు మహేంద్ర.
మీరు జాగ్రత్తగా ఉండండి అని అలెర్ట్ చేస్తాడు. అని ఫోన్ పెట్టేసిన వసుధార రిషికి మీతో మాట్లాడాలి నాకోసం కాదు మీకోసమే కారిడార్ లో వెయిట్ చేస్తూ ఉంటాను అని మెసేజ్ పెడుతుంది. అదే సమయంలో రిషి ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ ఉంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ఆక్సెప్ట్ చేస్తున్నట్లుగా డిబిఎస్డి కాలేజీకి ఇన్ఫార్మ్ చేయండి. అంతేకాదు పవర్ ఆఫ్ స్టడీస్ ని మిషన్ ఎడ్యుకేషన్ ని కలిపి వర్క్ చేస్తాం అని చెప్పండి అని చెప్తాడు రిషి. ఆ మాటలకి సంతోషిస్తాడు ప్రిన్సిపల్. పవర్ ఆఫ్ స్టడీస్ కి మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన బ్యానర్స్ కొట్టిద్దాము అతనిని ఇక్కడికి రప్పిస్తాను అంటాడు ప్రిన్సిపల్.
వద్దు సార్ అతను ఇక్కడికి వస్తే రెండు మూడు డిజైన్స్ మాత్రమే తీసుకువస్తాడు నేనే వెళ్లి డిజైన్స్ సెలెక్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. రిషి డెసిషన్ ఎలా ఉండబోతుందో అని కంగారుగా బయట వెయిట్ చేస్తూ ఉంటారు పాండ్యన్ వాళ్ళు. బయటికి వచ్చిన రిషి మొహంలో నవ్వు చూసి రిషి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ చేయటానికి యాక్సెప్ట్ చేశాడు అని సంతోషపడతారు. మీరు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పండి మీ వెనకాతల మేము ఫాలో అయిపోతాము అంటూ రిషికి తమ ఆనందాన్ని తెలియజేస్తారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.