- Home
- Entertainment
- Guppedantha Manasu: రంగంలోకి దిగుతానంటున్న శైలేంద్ర.. రిషికి నిజం చెప్పాలనుకుంటున్న జగతి?
Guppedantha Manasu: రంగంలోకి దిగుతానంటున్న శైలేంద్ర.. రిషికి నిజం చెప్పాలనుకుంటున్న జగతి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఓ తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార మహేంద్ర కి ఫోన్ చేసి నాకు రిషి సార్ నేను చూడాలనిపిస్తుంది ఒకసారి వీడియో కాల్ చేస్తారా అని రిక్వెస్ట్ చేస్తుంది. రిషి విషయంలో నువ్వు ఎప్పుడూ రిక్వెస్ట్ చేయొద్దు. నీకు రిషి అంటే ఎంత ప్రాణమా నాకు తెలుసు. మీ ఇద్దరి బంధాన్ని చూసి నాకే గర్వంగా ఉండేది.
అలాంటిది ఇలా వీడియో కాల్ లో చూసుకోవలసిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు అంటూ వసుధారకి రిషి ని వీడియో కాల్ చేసి చూపిస్తాడు. మర్నాడు విశ్వనాథం ఇంటికి ఎస్ఐ వస్తాడు. ఈ కేసుని పర్సనల్ గా తీసుకోమని, అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా వదిలిపెట్టొద్దు ఎందుకంటే రీసెంట్ గానే రిషి మీద మా ఇంట్లో అటాక్ జరిగింది అని చెప్తాడు విశ్వనాథం.
అవునా మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు. అయినా వీళ్ళ వెనక కచ్చితంగా ఎవరో ఉన్నారు. నేను కచ్చితంగా పట్టుకొని తీరుతాను అవసరమైతే రౌడీలందరినీ స్టేషన్ కి రప్పిస్తాను. అటాక్ చేసిన వాడిని ఐడెంటిఫై చేయవచ్చు అంటాడు ఎస్ఐ. అలా అయితే నేను రిషి, వసుధార కూడా స్టేషన్ కి వస్తాము అంటాడు మహేంద్ర. సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎస్ఐ.
మరోవైపు రిషి మీద ఎటాక్ చేసిన రౌడీ శైలేంద్ర కి ఫోన్ చేసి మేము ఊరు వదిలి పారిపోతున్నాం సార్. ఈ కేసు గురించి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు వారి వెనుక చాలా పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు అని చెప్తాడు. ఆ మాటలకి కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. ఆ అటెండర్ గాడు దొరికాడా.. అతడిని కూడా వెతికి పట్టుకొని తీసుకు వెళ్ళకండి లేదంటే అతని ద్వారా పోలీసులు నిజాన్ని తెలుసుకుంటారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర.
కథ అడ్డం తిరిగినందుకు ఫ్రెష్టేట్ అవుతాడు శైలేంద్ర. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు నేనే రంగంలోకి దిగాలి అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు మహేంద్రవాళ్లు. ఇప్పుడు ఈ పెరేడ్ అది అవసరమా అని తండ్రిని అడుగుతాడు రిషి. చాలా అవసరం నాన్న లేదంటే నువ్వు ఎప్పుడు ఎలాంటి ప్రమాదంలో పడతావు అని నేను నిత్యం భయపడవలసి ఉంటుంది అంటాడు మహేంద్ర.
లోపలికి వెళ్ళిన తరువాత ఎస్ఐ రౌడీలందరినీ పిలిపిస్తాడు. వాళ్లలో రిషి మీద ఎటాక్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ముందుగానే తప్పించుకున్నారు అనమాట అంటాడు ఎస్ఐ. అవును సార్ నిఘా పెట్టినట్టుగా రిషి సార్ గురించి అన్ని విషయాలు ముందే తెలుసుకుంటున్నారు. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడుగుతాడు ఎస్ఐ. వాళ్ళు ఎవరో నాకు తెలుసు కానీ మనసులో అనుకుంటాడు మహేంద్ర.
బయటికి మాత్రం అనుమానంతో కాకుండా సాక్షాలతో వాళ్లని పట్టుకోవాలని చూస్తున్నాము అంటాడు మహేంద్ర. నేరస్తులు ఎంత దూరమని పారిపోతారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళని పట్టుకుని తీరుతామని మాటిస్తాడు ఎస్సై. బయటికి వచ్చిన తర్వాత రిషి ని పట్టుకొని బాగా ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. ఇలాంటి కష్టంలో ఉన్నప్పుడు పక్కనుండి చూసుకోవటం అనేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది నాకు నిజంగా అక్కడి నుంచి వెళ్లాలని లేదు అంటాడు.
మీరు ఇక్కడ ఉండటం కన్నా అక్కడ ఉండడమే చాలా అవసరం లేదంటే డిబిఎస్టీ కాలేజ్ పనులు మందగిస్తాయి అని మహేంద్ర కి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపిస్తాడు రిషి. మరోవైపు రిషి మీద ఎటాక్ జరిగిందని తెలుసుకొని కంగారు పడతారు పాండ్యన్ వాళ్లు. ప్రతిసారి ఎలాగైనా రక్షించుకోవాలి ఆయనకి మనం సెక్యూరిటీ ఇవ్వాలి అని అనుకుంటారు. ఇంతలో రిషి రావటంతో అతనిని పరామర్శించే అతని వెనకే వెళుతూ ఉంటారు. క్లాస్ కి వెళ్ళటం మానేసి నా వెనకే ఎందుకు వస్తున్నారు అంటాడు రిషి. మీకు సెక్యూరిటీ సర్ మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అంటాడు పాండ్యన్. మీరు మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి ఇది నా పర్సనల్ విషయం నేను కేర్ తీసుకుంటాను అని చెప్తాడు రిషి.
మరోవైపు జరిగిందంతా జగతికి చెప్తాడు మహేంద్ర. రిషి నీ కోసం వసుధార కోసం తల్లడిల్లి పోతున్నాడు. నీ విలువ తెలుసుకొని నీకు దగ్గర అవ్వాలి అనుకున్న సమయానికి నువ్వు అలా చేసేసరికి నీ మీద కోపం పెంచుకున్నాడు. రిషి కి నిజం చెప్పేద్దాము అంటుంది జగతి. వాడు నమ్మడు.. శత్రువులని తన వాళ్ళు అనుకుంటున్నాడు అంటాడు మహేంద్ర. నువ్వు చెప్పినా కూడా నమ్మడా.. తప్పకుండా నమ్ముతాడు. చెప్పేద్దాం మహేంద్ర అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.