- Home
- Entertainment
- Guppedantha Manasu: ఇక ఆట మొదలు పెడతానంటున్న శైలేంద్ర.. అన్న మాటలకు హర్ట్ అయిన రిషి!
Guppedantha Manasu: ఇక ఆట మొదలు పెడతానంటున్న శైలేంద్ర.. అన్న మాటలకు హర్ట్ అయిన రిషి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తమ్ముడి గెలుపుని ఓర్వలేక అసూయ పడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో డాక్టర్స్ మేక్ డాక్టర్స్ క్యాప్షన్ తో తన ఆలోచనని అందరికీ చెప్తాడు రిషి. అందరూ రిషిని అప్రిషియేట్ చేస్తారు. ఐదు నిమిషాలలో మా ఆలోచనా విధానం మార్చేశావు అంటూ మెచ్చుకుంటాడు ఫణీంద్ర. ఇక్కడ ఉన్న డాక్టర్స్ నే కాదు ఇంటర్నేషనల్ డాక్టర్స్ ని కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేద్దాం అంటుంది వసు. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ నా సర్కిల్లో ఉన్న ఇంటర్నేషనల్ డాక్టర్స్ ని చాలా మందిని అప్రోచ్ అయ్యాను చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు రిషి.
చదువుకోవాలి అని ఆశ పడుతున్న ప్రతి వ్యక్తికి మన కాలేజీ నుంచి సపోర్టు ఉంటుంది. ఇది స్పాన్సర్షిప్ కాదు జస్ట్ సపోర్ట్ అంటాడు రిషి. మళ్లీ అందరూ రిషి ఆలోచనలని అప్రిషియేట్ చేస్తారు. ఇదంతా చూస్తున్న శైలేంద్ర అసూయతో రగిలిపోతాడు. మరోవైపు విద్యాసంస్థల్లో పెను మార్పులు.. డి బి ఎస్ టి కాలేజ్ వినూత్న పథకం అంటూ కాలేజీ గురించి రిషి గురించి టీవీలో గొప్పగా న్యూస్ వస్తుంది. అది రిషికి చూపించి ఆనందపడతాడు మహేంద్ర.ఫణింద్ర కూడా ఆనందపడతాడు. రిషి సర్ ని చూసి మహేంద్ర సార్ చాలా ఆనంద పడుతున్నారు అంటుంది వసు.
కొడుకుని పదిమంది మెచ్చుకుంటుంటే ఆ ఆనందం వేరు అంటూ జగతి కూడా ఆనందపడుతుంది. ఆయన ఆనందం బయటికి కనిపిస్తుంది కానీ మీ ఆనందం పెదవులు దాటడం లేదు అని జగతిని అంటుంది వసు. విశిష్ట నిజంగా జెంటిల్మెన్ అటు ఇంట్లో వాళ్ళని ఇటు కాలేజీ ని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటుంది వసు. ఆ మాటలు అన్నీ విన్న శైలేంద్ర ఎవరైతే నిను పోగొడుతున్నారో వాళ్ళ దగ్గరే నిన్ను జీరోని చేసేస్తాను అనుకుంటాడు. మరోవైపు ఒంటరిగా కూర్చుని ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర.
సౌజన్య రావు కి ఫోన్ చేసి నువ్వు ఎంటర్ ఇవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చింది. ఇక ఆట మొదలు పెడతాను అని చెప్తాడు శైలేంద్ర. అంతలోనే జగతి వచ్చి ఒంటరిగా కూర్చున్న ఎందుకు అని అడుగుతుంది కూర్చోకూడదా దానికి ఎండి గారి పర్మిషన్ కావాలా అంటూ వెటకారంగా మాట్లాడుతాడు శైలేంద్ర. అంతలోనే రిషి వచ్చి కాలేజీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాలి రండి మేడం అంటాడు. నాకు తెలిసిన బిల్డర్ ఉన్నాడు అతనికి ఈ ప్రాజెక్టు అప్పచెబుదామంటాడు శైలేంద్ర. జగతి పాత బిల్డర్ కి ఇద్దాము అంటుంది. అన్నయ్యకి తెలిసినవాడికి ఇద్దాము అని రిషి అనడంతో మరేమి మాట్లాడలేక పోతుంది.
మరోవైపు రిషి, వసు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి వచ్చిన శైలేంద్ర కొన్ని పనులు నాకు అప్పచెప్పు అన్ని వసూనే చేస్తే తను స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంటాడు. తనకి స్ట్రెస్ అనేది తెలీదు చెప్పిన ప్రతి పని బాగా బ్యాలెన్స్ చేస్తుంది అందుకే ప్రతి విషయానికి నేను తన మీద డిపెండ్ అవుతాను అంటాడు రిషి. డాక్టర్స్ మేక్ డాక్టర్స్ అనేది సక్సెస్ అవ్వదేమో.. ఇప్పుడు అలానే అంటారు కానీ అనుకున్న సమయానికి ఎవరు వాళ్ల సాయం అందించరు అంటూ డిస్క్రైజ్ చేస్తాడు శైలేంద్ర.
అలా ఏమీ కాదన్నయ్య నేను అందరితోని మాట్లాడాను అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అంటాడు రిషి. దానికి సంబంధించిన ఫైల్ ఏది అని అడుగుతాడు. మేడం దగ్గర ఉంది అని వసు చెప్పటంతో జగతికి ఫోన్ చేసి ఫైల్ తీసుకుని తన రూమ్ కి రమ్మంటాడు రిషి. ఫైల్ తీసుకొని వచ్చిన జగతి ఇప్పుడే ఇవన్నీ డిస్కస్ చేయడం ఎందుకు? ప్రాసెస్ అవుతుంది కదా అంటుంది. చెప్పనివ్వండి పిన్ని నాకు కూడా తెలుస్తుంది కదా అంటాడు శైలేంద్ర. నీకోసం ఎంతో తపన పడుతుంది పిన్ని. తనని మేడం అని పిలిచి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అమ్మ అని పిలవచ్చు కదా అంటాడు శైలేంద్ర.
ఈ విషయంలో తనని ఇబ్బంది పెట్టొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి. శైలేంద్ర సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి మూడ్ ఆఫ్ అవటంతో టాపిక్ చేంజ్ చేయడం కోసం ఏదైనా మెయిల్ వచ్చిందేమో చెక్ చెయ్ అని వసుకి చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ చూద్దాం.