MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ట్రెండింగ్‌లో షారూఖ్‌ తనయ సుహానా ఖాన్‌.. ట్విన్స్ డాటర్సా? అంటూ నెటిజన్ల కామెంట్‌

ట్రెండింగ్‌లో షారూఖ్‌ తనయ సుహానా ఖాన్‌.. ట్విన్స్ డాటర్సా? అంటూ నెటిజన్ల కామెంట్‌

షారూఖ్‌ ఖాన్‌ ముద్దుల తనయ సుహానా ఖాన్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అభిమానులు విపరీతంగా ట్రెండ్‌ చేస్తున్నారు. కానీ అసలు విషయం తెలుసుకుని ఇప్పుడు ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. మరి వాళ్ల షాక్‌కి కారణమేంటంటే?  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 22 2021, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్ కేసులోనే తలమునకలైపోతున్నాడు. ఆర్యన్‌ ఖాన్‌కి బెయిల్‌ రాకపోవడంతో షారూఖ్‌ మదనపడుతున్నాడు. ఓ వైపు ఆ టెన్షన్‌లో ఉంటే ఇప్పుడు ఆయన కూతురు సుహానా ఖాన్ ఇలా ట్రెండ్‌ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అసలు విషయం తెలిశాక ఆయన కూడా షాక్‌ అవుతుండటం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మనిషిని పోలి మనిషి ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. అలా సుహానా ఖాన్ ని పోలి ఇప్పుడు మరో అమ్మాయి ఉంది. పేరు ఇషా జైన్‌. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పాపులర్‌ ఫిగర్‌గా మారిపోయింది. ఓవర్‌నైట్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

38

అయితే చూడ్డానికి అచ్చు సుహానా ఖాన్‌ని పోలి ఉండటం విశేషం. షారూఖ్‌ ఖాన్‌ కూతురుని పోలి ఉండటంతో ఇప్పుడు ఇషాజైన్‌ని నెటిజన్లు, షారూఖ్‌ అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. అయితే ఆమె సుహానా ఖాన్‌ కాదని తెలియకపోవడం విశేషం. 
 

48

షారూఖ్‌ తనయకొత్త ఫోటోలని భావించిన నెటిజన్లు ఆమె లేటెస్ట్‌ గ్లామర్‌ ఫోటోలను ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే తీరా అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. సుహానా ఖాన్‌ కాదని, ఆమెని పోలిన మరో అమ్మాయి అని తెలిసి షాక్‌ అవుతున్నారు. 
 

58

ఈ సందర్బంగా నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. షారూఖ్‌కి ట్విన్స్ డాటర్స్‌ ఉన్నారా? అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం. ఇలా నెటిజన్లు కామెంట్లు, ఫ్యాన్స్ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటోల షేరింగ్‌తో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది ఇషా జైన్‌. ఓవర్‌ నైట్‌లో వెలకట్టలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. 

68

లక్షా ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఇషాజైన్‌.. ఇలా షారూఖ్‌ తనయలాగా ఉండటంతోనే పాపులారిటీని సొంతం చేసుకుందని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి సుహానాని పోలిఉండటంతో ఊహించని క్రేజ్‌ని, గుర్తింపు తెచ్చుకుని సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది ఇషా జైన్‌. 

78

ఇక సుహానా ఖాన్ సైతం నటిగా డెబ్యూకి రంగం సిద్దమవుతుందట. అంతకంటే ముందే `ది గ్రే పార్ట్ ఆఫ్‌ బ్లూ` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీనికి థియో గిమినో దర్శకత్వం వహించబోతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి అప్ డేట్‌ రావాల్సి ఉంది. సుహానా ఖాన్‌ ప్రస్తుతం న్యూయార్క్ లో హైయ్యర్‌ స్టడీస్‌ చేస్తుంది. అక్కడే యాక్టింగ్‌ కోర్స్ కూడా చేస్తుందట. అన్ని కుదిరితే తర్వలోనే సుహానాని వెండితెరపై చూడొచ్చని చెప్పొచ్చు. 
 

88

షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్లు కోరు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు ఆర్యన్‌. గురువారం తనయుడిని జైల్లో షారూఖ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

also read: కొడుకు ఆర్యన్ ఖాన్ కోసం జైలుకి వచ్చిన షారుక్!

also read: మోకాళ్లపైకున్న పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ పరువాల విందు.. విరహంతో కూడిన చిలిపి పోజులు చూడతరమా !

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved