- Home
- Entertainment
- నేను ముఖేష్ అంబానీ చుట్టాన్ని, అనంత్ పెళ్ళికి ఎందుకు పిలవలేదు... షాకిచ్చిన సీరియల్ నటి!
నేను ముఖేష్ అంబానీ చుట్టాన్ని, అనంత్ పెళ్ళికి ఎందుకు పిలవలేదు... షాకిచ్చిన సీరియల్ నటి!
సీరియల్ నటి జ్యోతి రెడ్డి తనను అనంత్ అంబానీ పెళ్లికి పిలవనందుకు అసహనం వ్యక్తం చేసింది. నేను ముఖేష్ అంబానీ చుట్టాన్ని అంటూ షాకింగ్ లాజిక్ చెప్పింది. ఆమె ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది.

Anant Ambani
ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డులకు ఎక్కింది అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మ్యారేజ్. ఆసియాలోనే అతిపెద్ద ధనవంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీ తన కొడుకు వివాహానికి రూ. 5000 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం. వారం రోజులకు పైగా ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరిగాయి. సామూహిక వివాహాలు నిర్వహించారు. గుజరాతీ సాంప్రదాయ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. సంగీత్, మెహందీ... ఇలా ఒక్కోరోజు ఒక్కో వేడుక నిర్వహించారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దగ్గుబాటి వెంకటేష్ సైతం హాజరయ్యారు. అయితే అనంత్ అంబానీ పెళ్ళికి తనను పిలవకపోవడం పై సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేసింది. ఓ ఆసక్తికర వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
mukesh ambani and nita
జ్యోతిరెడ్డి మాట్లాడుతూ... నాకు ఎవరో మెసేజ్ పెట్టారు. అంబానీ ఫ్యామిలీ మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదని మీకు కడుపు మంట అని... నాకు కడుపు మంటలు గిడుపు మంటలు ఏమీ లేవు కానీ... ఆ మెసేజ్ చూశాక నాకు ఓ ధర్మ సందేహం కలిగింది. 2018 నుండి నేను జియో వాడుతున్నాడు. ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నాను. నేను అంబానీ చుట్టాన్ని కాదా? జియో వాడేవారంతా అంబానీ చుట్టాలు కారా? ప్రపంచంలోని గొప్పోళ్ళు అందరినీ పెళ్లికి పిలిచారు.
ఇన్ని సంవత్సరాల నుండి జియో వాడుతూ... మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు పెళ్ళికి పిలవలేదు. ప్రతి నెలా జియో బిల్ క్రమం తప్పకుండా బిలు చెల్లిస్తున్నాను. చార్జీలు విపరీతంగా పెంచేశారు. ఒక నెల జియో ఫ్రీగా ఇవ్వొచ్చుగా. అదేమంటే చాలా మంది ఆర్టిస్టులను పోషించారు అంటున్నారు. ఎవరి డబ్బుతో పోషించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు.. అని అన్నారు. జ్యోతి రెడ్డి సెటైరికల్ వీడియో వైరల్ అవుతుంది.
జ్యోతిరెడ్డి చాలా కాలంగా బుల్లితెరపై రాణిస్తున్నారు. ఆమె సీనియర్ సీరియల్ నటి. ఎండమావులు, కార్తీక దీపం, రాధకు నీవే ప్రాణం, ప్రేమ ఎంత మధురం, మధురానగరిలో వంటి హిట్ సీరియల్స్ లో ఆమె నటించారు. ఇక జ్యోతి రెడ్డి వీడియో పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.