MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • National Film Awards: దుమ్ములేపిన టాలీవుడ్..కల్కి, పుష్ప 2తో పాటు చిన్న సినిమాలకు జాతీయ అవార్డుల పంట

National Film Awards: దుమ్ములేపిన టాలీవుడ్..కల్కి, పుష్ప 2తో పాటు చిన్న సినిమాలకు జాతీయ అవార్డుల పంట

2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలని ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఏకంగా 9 విభాగాల్లో తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు దక్కాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 18 2026, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు(72nd National Film Awards)
Image Credit : Asianet News

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు(72nd National Film Awards)

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర పురస్కారాల (National Film Awards) ప్రకటన వెలువడింది. 2024వ సంవత్సరానికి గాను 72వ జాతీయ అవార్డులని ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రూపొందిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాలను ప్రకటించారు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ నిలవగా, నటన పరంగా అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు గానూ ఉత్తమ నటిగా యామి గౌతమ్, ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా పురస్కారాలను దక్కించుకున్నారు. వీటితో పాటు మిగిలిన సాంకేతిక, ప్రాంతీయ విభాగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా కమిటీ వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టాలీవుడ్ ప్రభంజనం
Image Credit : Asianet News

టాలీవుడ్ ప్రభంజనం

ఈ ఏడాది జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) మరోసారి తన జెండాను ఎగురవేసింది. విభిన్న కథాంశాలతో, భారీ నిర్మాణ విలువులతో ప్రేక్షకులను అలరించిన తెలుగు చిత్రాలు ఏకంగా తొమ్మిది విభాగాలలో జాతీయ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ కమర్షియల్ విలువలతో పాటు వైవిధ్యభరితమైన కంటెంట్‌తో దూసుకుపోతోందని ఈ అవార్డుల జాబితా నిరూపించింది. టాలీవుడ్ నుండి అవార్డులు గెలుచుకున్న విజేతల పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

34
టాలీవుడ్ కి దక్కిన జాతీయ అవార్డులు
Image Credit : allu arjun instagram

టాలీవుడ్ కి దక్కిన జాతీయ అవార్డులు

ఉత్తమ పూర్తి వినోదాత్మక చిత్రం : కల్కి 2898ఏడీ

ఉత్తమ బాలల చిత్రం : 35 ఇది చిన్న కథ కాదు

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్ళు

ఉత్తమ స్క్రీన్ ప్లే : సుకుమార్ (పుష్ప 2)

ఉత్తమ సంభాషణ రచయిత : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ బాల నటుడు : అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: పి. రవికుమార్ (కమిటీ కుర్రాళ్ళు)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2)

44
కథా బలం ఉన్న చిత్రాలకు అవార్డులు
Image Credit : x

కథా బలం ఉన్న చిత్రాలకు అవార్డులు

టాలీవుడ్ గ్లోబల్ స్థాయికి రీచ్ అవుతున్న తరుణంలో, జాతీయ స్థాయిలో కేవలం కమర్షియల్ విభాగాలకే పరిమితం కాకుండా సాంకేతిక విభాగాల్లో (మేకప్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్ డిజైన్, స్క్రీన్ ప్లే) ఇన్ని అవార్డులు రావడం తెలుగు సినిమా సాధించిన ప్రగతికి నిదర్శనం. అటు భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వచ్చిన 'కల్కి 2898ఏడీ', 'పుష్ప 2' చిత్రాలతో పాటు, ఇటు చిన్న బడ్జెట్‌తో వచ్చి కథా బలంతో నిలిచిన 'కమిటీ కుర్రాళ్ళు', '35 ఇది చిన్న కథ కాదు' లాంటి సినిమాలు అవార్డుల పంట పండించడం విశేషం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Naga Chaitanya: నాగ చైతన్యకి ఆస్తులు ఎలాగూ ఉన్నాయి, కానీ అలా చేస్తే నకిలీ అవుతాడు.. బాలకృష్ణ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved