Prabhas: ‘ది రాజాసాబ్’ షాకింగ్ అప్‌డేట్, అలా వద్దంటూ ఫ్యాన్స్
Prabhas: ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న 'రాజా సాబ్' సినిమాకు లేటెస్ట్ అప్డేట్ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాకు ఇలాంటివి అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ అప్డట్ ఏంటి

SEQUEL ALERT: Prabhas Raja Saab to Get a Second Installment!in telugu
కల్కి 2898 ఏడీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రకరకాల వార్తలు ప్రచారంలో వస్తున్నాయి.
మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) భారీ అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ మూవీ గురించి తాజా అప్‌డేట్ ఫ్యాన్స్ ని షాక్ గురి చేస్తోది. అదేంటో చూద్దాం.
SEQUEL ALERT: Prabhas Raja Saab to Get a Second Installment!in telugu
ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టి ‘ది రాజాసాబ్’పైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ కి సీక్వెల్ ఉందనే వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కు లీడ్ వదులుతున్నారట. అంటే రెండో పార్ట్ అన్నమాట. బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారని రికవరీ అయ్యి లాభాలు రావాలంటే పార్ట్ 2 కావాలని ప్రభాస్ ని ఒప్పించారట.
అయితే ఈ వార్త ప్రభాస్ అభిమానులకు ఆనందం అయితే కలిగించటం లేదు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికి పూర్తి కాలేదు. ప్యాన్ ఇండియా మార్కెట్ కు ఇలాంటి సినిమాకు సీక్వెల్స్ అవసరమా, సీక్వెల్ చేసేటంత టైమ్ ప్రభాస్ కు ఉంటుందా,కల్కి పార్ట్ 2 చేయటానికే ప్రబాస్ డేట్స్ కేటాయించలేకపోతున్నాడని అంటున్నారు.
SEQUEL ALERT: Prabhas Raja Saab to Get a Second Installment!in telugu
‘ది రాజాసాబ్’తో పాటు, హను రాఘవపూడి సినిమా, ‘సలార్2’, ‘స్పిరిట్’ చిత్రాలు ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి. కాగా, 'రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ నటి మాళవికా మోహనన్ కు ఇది తెలుగులో ఇదే తొలి చిత్రం కానుంది. 'రాజా సాబ్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు