MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 13 ఏళ్ళకే భార్యని వదిలేశాడు, 17 ఏళ్ళ కూతురు..అలాంటి వ్యక్తితో వరలక్ష్మి పెళ్లి ఎందుకంటే, సంచలన విషయాలు

13 ఏళ్ళకే భార్యని వదిలేశాడు, 17 ఏళ్ళ కూతురు..అలాంటి వ్యక్తితో వరలక్ష్మి పెళ్లి ఎందుకంటే, సంచలన విషయాలు

సౌత్ లో ఒకప్పుడు హీరోగా రాణించిన శరత్ కుమార్  కుమార్తె వరలక్ష్మి. ఆమె కూడా నటిగా రాణిస్తున్నారు. అలాంటి సెలెబ్రిటీకి కాబోయే భర్త గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపడం సహజం. ప్రస్తుతం నీకొలాయ్ సచ్ దేవ్ ఎవరు అంటూ నెటిజన్లు అతడి వివరాలు తెగ వెతికేస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 17 2024, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరలక్ష్మి శరత్ కుమార్ అంటే సిల్వర్ స్క్రీన్ పై లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తుకు వస్తారు. ఆమె నటించే అన్ని చిత్రాల్లో వరలక్ష్మి పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది. కథకి కీలకం అవుతుంది. క్రాక్, వీర సింహారెడ్డి, హను మాన్ ఇలా పలు సూపర్ హిట్ చిత్రాలు వరలక్ష్మికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. సమంత యశోద చిత్రంలో ఆమె నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ వయసు 39 ఏళ్ళు. ఇంతవరకు వరలక్ష్మి వివాహం చేసుకోలేదు. ఎట్టకేలకు ఆ శుభ తరుణం వచ్చింది. వరలక్ష్మి జూలై 2న థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగే వివాహ వేడుకలో నీకొలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో మూడు ముళ్ళు వేయించుకోనుంది. ఇటీవల వరలక్ష్మి, నీకొలాయ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 

37
Varalaxmi

Varalaxmi

సౌత్ లో ఒకప్పుడు హీరోగా రాణించిన శరత్ కుమార్  కుమార్తె వరలక్ష్మి. ఆమె కూడా నటిగా రాణిస్తున్నారు. అలాంటి సెలెబ్రిటీకి కాబోయే భర్త గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపడం సహజం. ప్రస్తుతం నీకొలాయ్ సచ్ దేవ్ ఎవరు అంటూ నెటిజన్లు అతడి వివరాలు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

47

నీకొలాయ్ సచ్ దేవ్ ముంబై కి చేసిన ఆర్ట్ గ్యాలరిస్టు. అతడికి గ్యాలరీ 7 పేరుతో ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం ఉంది. ఇక్కడికి తరచుగా బాలీవుడ్ సెలెబ్రిటీలు వస్తుంటారు. ఆ విధంగా నీకొలాయ్ కి సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. తొలిసారి నికొలాయ్ సచ్ దేవ్, వరలక్ష్మి అక్కడే కలుసుకున్నారట. పరిచయం పెరగడంతో ఫ్రెండ్స్ అయ్యారు. 

57

సచ్ దేవ్ కి ఆల్రెడీ పెళ్లయింది. 2006లో అతడు ఫిట్ నెస్ కోచ్ అయిన కవిత అనే మహిళని వివాహం చేసుకున్నాడు. వీరికి కషా అనే కుమార్తె కూడా ఉంది. సరైన కారణాలు తెలియవు కానీ 2019లో సచ్ దేవ్ తన భార్య కవితకి దూరమయ్యాడు. అంటే 13 ఏళ్ళ వివాహ బంధం తర్వాత వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో సచ్ దేవ్, వరలక్ష్మి మధ్య రిలేషన్ పెరుగుతూ వచ్చింది. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనంలో ఉన్నట్లు కూడా తెలిసింది. ఎట్టకేలకు తమ రిలేషన్ ని సచ్ దేవ్, వరలక్ష్మి నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. 

67

ప్రస్తుతం సచ్ దేవ్ కుమార్తె వయసు 17 ఏళ్ళు. అంత పెద్ద కుమార్తె ఉంది.. పైగా సెకండ్ మ్యారేజ్.. అతడిని ఎందుకు వరలక్ష్మి వివాహం చేసుకుంటోంది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పైగా అతడి లుక్స్ పై కూడానా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఒళ్ళంతా టాటూలు, పొడవైన జుట్టు ఏంటి ఆ లుక్ అంటూ నెటిజన్లు షాక్ అయ్యారు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం సచ్ దేవ్ తో ఘాడమైన ప్రేమలో ఉంది. 

77

దాదాపు దశాబ్దానికి పైగా వీళ్లిద్దరికీ పరిచయం ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. పైగా సచ్ దేవ్ వ్యాపారంలో రాణిస్తున్నాడు. అతడి తల్లి దండ్రుల నుంచి సచ్ దేవ్ కి 80 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ కుమార్తె కషా.. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గత ఏడాది గోల్డ్ మెడల్ సాధించింది. తన కుమార్తెని సచ్ దేవ్ చిన్నప్పటి నుంచే పవర్ లిఫ్టింగ్ లో ట్రైన్ చేస్తున్నాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved