ఆ సీన్ కోసం డ్రెస్ తీసేయ్ చెక్ చేయాలి అన్నారు... హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్
కన్నడ అమ్మాయి అయిన ఆమని తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగారు. ఈ సీనియర్ హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Amani
ఆమని అచ్చు తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఫ్యామిలీ చిత్రాలకు ఆమెకు పర్ఫెక్ట్ హీరోయిన్. జంబలకడి పంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం చిత్రాల్లో ఆమని నటన అద్భుతం. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. కాగా ఆమని పరిశ్రమలో తనకు ఎదురైన ఇబ్బందులను తెలియజేసింది.
amani
ఆమని పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. అయితే హీరోయిన్స్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఓ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సన్నివేశం ఉంది. నీ శరీరం మీద స్క్రాచ్ లు ఉన్నాయేమో చెక్ చేయాలి డ్రెస్ తీసేయ్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి సన్నివేశం నేను చేయను అని నో చెప్పాను.
ఒకసారి నిన్ను ఫైనాన్షియర్ చూడాలంటున్నారు రమ్మని అన్నారు. చూస్తే దర్శకుడు, నిర్మాత, హీరో చూడాలి. అసలు ఫైనాన్షియర్ ఎవరు? ఆయన నన్నెందుకు చూడాలని చెప్పాను. కారు ఎక్కమంటే రాను అని చెప్పాను. అప్పట్లో మొబైల్స్ కూడా ఉండేవి కాదు. విషయం ఏదైనా నేరుగా కలవనేవారు.
ఒక్కోసారి అమ్మ లేకుండా మీరొక్కరే రావాలని అనేవారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు నాకు ఎదురయ్యాయి. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నటులదే ఛాయిస్. ఒకరిని పూర్తిగా తప్పుబట్టడానికి లేదని ఆమని చెప్పుకొచ్చారు.
క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె గట్టిగా చెప్పారు. ఆమని సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. శ్రీకారం, చావు కబురు చల్లగా, రిపబ్లిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ఉర్వశివో రాక్షసివో వంటి చిత్రాల్లో ఆమె నటించారు.