MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 46 ఏళ్ల వయసులో రెండో వివాహం?... హాట్ టాపిక్ గా హీరోయిన్ మీనా వ్యవహారం!

46 ఏళ్ల వయసులో రెండో వివాహం?... హాట్ టాపిక్ గా హీరోయిన్ మీనా వ్యవహారం!

సీనియర్ హీరోయిన్ మీనా రెండో వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కూతురు భవిష్యత్ కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 29 2022, 07:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


మీనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మీనా సినిమా ప్రేమికులను అలరిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా నట ప్రస్థానం మొదలైంది. దాదాపు 30 సినిమాల్లో బాలనటి పాత్రలు చేశారు. 1990లో నవయుగం మూవీతో మీనా హీరోయిన్ అయ్యారు. 
 

26


ఇన్నేళ్ళలో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. హిందీలో కూడా ఒకటి రెండు చిత్రాలు చేసినట్లు ఉన్నారు. రజినీకాంత్, కమల్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి టాప్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. 

36


ఇప్పటికీ మీనా హీరోయిన్ కి సమానమైన పాత్రలు చేస్తున్నారు. వెంకటేష్, మోహన్ లాల్ వంటి హీరోలతో జతకడుతున్నారు. మీనా సెకండ్ ఇన్నింగ్స్ సైతం సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. సిల్వర్ స్క్రీన్ పై చేస్తూనే పలు బుల్లితెర సీరియల్స్ లో మీనా నటించారు. 
 

46

హ్యాపీగా సాగిపోతున్న మీనా జీవితం పెద్ద కుదుపుకి లోనైంది. భర్త విద్యాసాగర్ అకాల మరణం చెందారు. ఒక్కసారిగా మీనా జీవితం తలకిందులు అయ్యింది. 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకున్నారు. వీరికి పదేళ్ల లోపున్న ఒక పాప ఉన్నారు. విద్యాసాగర్ అనారోగ్యంతో ఈ ఏడాది కన్నుమూశారు.

56

అప్పటి నుండి మీనా కూతురితో పాటు ఒంటరిగా ఉంటున్నారు. అయితే మీనా పేరెంట్స్ రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. కూతురితో పాటు తన భవిష్యత్ బాగుండాలి అంటే మగతోడు అవసరం అంటున్నారట. ఈ క్రమంలో మీనా తన ఫ్యామిలీ ఫ్రెండ్  ని రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. 

66
meena

meena

బాగా తెలిసిన ఆ వ్యక్తికి మీనా భర్త విద్యాసాగర్ తో మంచి సాన్నిహిత్యం ఉందట. మీనా కూతురు ఆయన్ని అంకుల్ అని పిలుస్తారట. అతనితో మీనా వివాహం దాదాపు ఖాయమే అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. లేటు వయసులో రెండో పెళ్లి చేసుకోవడం సెలెబ్రిటీలకు సాధారణ విషయం. సింగర్ సునీత 42 ఏళ్ల వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image2
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved