అందుకే ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టాను.. ఖుష్బు కామెంట్స్ వైరల్..
ఓ వ్యక్తి గూబ గుయ్యిమనేలా చెంప దెబ్బ కొట్టిందట హీరోయిన్ ఖుష్బు. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసింది. అతన్ని కొట్టడానికి గల కారణం ఏంటీ..?
సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి కుష్బు(Kushboo). మెగాస్టార్ చిరంజీవి తప్పించి.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా మెరిసింది బ్యూటీ. ఈమధ్య మెగాస్టార్ తో ఓ యాడ్ ఫిల్మ్ లో మాత్రం నటించింది. గతంలో స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ అక్కగా మెప్పించింది. కాని హీరోయిన్ గా మాత్రం నటించలేదు కుష్బు.
Kushboo Sundar
ఇక తమిళనాట ఆమె క్రేజ్ ఎలా ఉండేదంటే... ఖుష్బుకు ఏకంగా ఏకంగా గుడి కట్టారంటే.. ఆమె ఇమేజ్ ఏరేంజ్ లో ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటు సౌత్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించింది కుష్బు. సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది .
Kushboo Sundar
సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది ఖుష్బు సుందర్. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ షో.. జబర్థస్త్ కు జడ్జిగా ఉన్న కుష్బుూ.. తెలుగులో మరికొన్ని ప్రోగ్రామ్స్ కు న్యాయ నిర్ణేతగా.. సందడి చేస్తున్నారు. ఇటు తెలుగులో హీరోలకు అమ్మ పాత్రలు చేస్తూ.. బిజీగా గడిపేస్తోంది.
ఇక రాజకీయంగా కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉన్నారు ఖుష్బు. బీజేపీలో ఉన్న ఆమె.. సొషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటారు. అంతే కాదు.. కాంట్రవర్సీయల్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది ఖుష్బు. సమాజాంలో జరిగే వాటిపై ఎక్కువగా స్పందిస్తుంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు ఖుష్బు.
నటిగా పలు సందర్భాల్లో తను ఎదుర్కున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి, ఆ సమయంలో తను రియాక్ట్ అయిన తీరు గురించి కూడా ఖుష్బూ మాట్లాడారు. చాలా మంది అంటుంటారు.. మీరు ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్స్ గురించే ఎక్కువగా ఉంటాయి అంటుంటారు. కానీ మేము, సౌత్ ఇండియన్స్ అలాగే ఉంటాము. ఎప్పుడూ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతాము. దానికి మేమేం సిగ్గుపడము అన్నారు.
kushboo sundar
మేము ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం అంటూ నటుల పేర్లను.. వారి గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు ఖుష్బూ. సినిమాలతో పాటు తను నిజ జీవితంలో ఎదుర్కున్న ఒక చేదు అనుభవాన్ని కూడా గుర్తుచేసుకున్నారు ఖుష్బు. ఓ రాజకీయ ర్యాలీలో ఒకరు నాతో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. అందుకే అతడిని చెప్పుతో కొట్టాను.. అలాంటి సందర్భం కూడా నా జీవితంల ఉంది అంటూ.. అసలు విషయం బయటపెట్టారు ఖుష్బూ.