- Home
- Entertainment
- అడిగినంత పుచ్చుకోవాలి.. పూజా హెగ్డే వైఖరిపై రూమర్స్.. డబ్బు కోసం దిగజారను అంటున్న బుట్టబొమ్మ
అడిగినంత పుచ్చుకోవాలి.. పూజా హెగ్డే వైఖరిపై రూమర్స్.. డబ్బు కోసం దిగజారను అంటున్న బుట్టబొమ్మ
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. అయితే ఈ ఏడాది పూజా హెగ్డే కి అంతగా కలసి రాలేదు.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. దీనితో పూజా హెగ్డే సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా మారింది. అయితే ఈ ఏడాది పూజా హెగ్డే కి అంతగా కలసి రాలేదు.
పూజా హెగ్డే ఈ ఏడాది ప్రభాస్ సరసన రాధే శ్యామ్ చిత్రంలో నటించింది. ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది.
మూడు క్రేజీ చిత్రాలు కళ్ళముందే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కథ అడ్డం తిరిగింది. దీనితో సౌత్ లో పూజా హెగ్డే ప్రభావం తగ్గుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. క్రేజ్ తగ్గితే రెమ్యునరేషన్ విషయంలో కూడా పట్టింపులు ఉండకూడదు. కానీ పూజా హెగ్డే పారితోషికం విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది అట.
నిర్మాతలు ఆమెని సంప్రదించడానికి వెళ్ళినప్పుడు కొందరికి రెమ్యునరేషన్ పెంచి చెబుతోంది అట. దీనితో పూజా హెగ్డే వైఖరిపై అంతా ఆశ్చర్యపోతున్నారు. టైం కలసి రానప్పుడు మరీ ఇంత బెట్టు చేయకూడదు అని సూచిస్తున్నారు.
తనపై వస్తున్న రూమర్స్ పై పూజా హెగ్డే స్పందించినట్లు తెలుస్తోంది. డబ్బు విషయంలో తాను ఎప్పటికీ దిగజారను అని తెలిపింది. నాకు డబ్బే ముఖ్యం అయితే వచ్చిన ప్రతి ఆఫర్ అంగీకరించాలి. కానీ నేను అలా చేయడం లేదు. కథ, తన పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవని తెలిపింది.
ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ హిందీ మూవీ సర్కస్ డిసెంబర్ 23న రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే సల్మాన్ ఖాన్ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.