- Home
- Entertainment
- Devatha: సత్య ఆదిత్య చెంప పగలగొట్టిన భాగ్యమ్మ, దేవుడమ్మా.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన రుక్మిణి!
Devatha: సత్య ఆదిత్య చెంప పగలగొట్టిన భాగ్యమ్మ, దేవుడమ్మా.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన రుక్మిణి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను.. జానకమ్మ ఆరోగ్యం చూసుకోండి అంటూ రాధ రామ్మూర్తికి చెప్పి వెళ్ళిపోతుంది. మరో సీన్ లో దేవుడమ్మా ఆదిత్య కోసం ఎదురు చూస్తుంటుంది. రుక్మిణి మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటుంది.. ఆదిత్య రాగానే దేవుడమ్మా ఒక్క చెంప దెబ్బ కొడుతుంది. అయ్యో ఏంటి అలా కొట్టారు అని కుటుంబసభ్యులు అడిగితే మీరు ఎవ్వరు మాట్లాడకండి నేను ఆదిత్య మాత్రమే మాట్లాడాలి అని అంటుంది.
నువ్వు రుక్మిణి కలిసి గుడిలో దీపాలు వెలిగించారు అంటూ సీరియస్ అవుతుంది. రుక్మిణి బ్రతికే ఉంది అన్న దేవుడమ్మా నమ్మకం నిజమేనని కుటుంబ సభ్యులు అంటారు.. నువ్వు ఎలా కలిశావు దేవుడమ్మ అని ఇంట్లో వాళ్ళు అడిగితే ఆమె జరిగిన విషయం మొత్తం పూసకి వచ్చినట్టుగా చెప్తుంది.. ఆదిత్య కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి రుక్మిణికి ఫోన్ చేసి చెప్పగానే ఆమె పరుగున వచ్చిందిఅని దేవుడమ్మ చెప్తుంది. రుక్మిణి బతికే ఉందన్న విషయం ఆదిత్య ఇంట్లో ఎందుకు చెప్పలేదు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు.. అదేనండి నేను కూడా అడుగుతుంది చెప్పరా ఇప్పుడైనా అని చెప్పి ఆదిత్యని అడుగుతుంది దేవుడమ్మ.
మరోవైపు సత్య చంప పగలగొడుతుంది... ఎవరే నిన్ను మోసం చేసింది నా బిడ్డ నిన్ను మోసం చేసేది అయితే కట్టుకున్న భర్తను వదిలి కడుపులో బిడ్డ తోటి ఇంట్లో కెళ్ళి ఎందుకు బయటకు వస్తుంది. నాకోసమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే.. నేను బాగుండాలని కోరుకుంటే.. నిన్న ఆదిత్యతో కలిసి దీపాలు వెలిగించింది అని భాగ్యమ్మను సత్య ప్రశ్నిస్తుంది. అవును రోజు కలుస్తుంది.. ఆమె మొగుడుతో దీపాలు వెలిగిస్తే తప్పేంటి? ఇంకా రుక్మిణి భర్త ఆదిత్య ఏంటి ఆమె వెళ్లిపోయినందుకే కదా నాకు ఆదిత్య తో పెళ్లి చేశారు.. అంతగా దీపాలు వెలిగించాలనుకుంటే ఆమె భర్త మాధవ్ తో కలిసి వెలిగించవచ్చు కదా అని సత్య అంటుంది.
నోరు ముయ్ అంటూ భాగ్యమ్మ మళ్లీ సత్య చెంప పగలగొడుతుంది. ఆ మాధవ్ గాడు రుక్మిణి భర్త అని ఎవరూ చెప్పారు? అని అంటే ఏ కదా.. తన భర్త మాధవ్ తో ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉందిగా.. మళ్లీ నా భర్తతో తిరగడం ఎందుకు అని సత్య సీరియస్ అవుతుంది. ఎవరూ చెప్పారు నీకు.. వాడికి రుక్మిణికి సంబంధం లేదు అంటే ఏంటి అమ్మ నిజామా అని సత్య అంటుంది. అయినా నువ్వు నీ అక్కను అర్ధం చేసుకుంది ఇదినా అని సత్యను భాగ్యమ్మ తిడుతుంది. నీకోసం ఈ ఇంటికి రుక్మిణి రాలేదు.. చెల్లి బతుకు బాగుండడం కోసం తను ఎన్నో బాధలు పడిందంటూ సత్యకు చెప్తుంది. నిజం తెలిస్తే తన బిడ్డ మీకు అడ్డం వస్తుందేమోనని ఇప్పటి దేవికి తండ్రి ఎవరో చెప్పలేదంటుంది భాగ్యమ్మ.
సీన్ కట్ చేస్తే.. అవును నేను రుక్మిణి తో కలిసి గుడిలో ఉన్న దీపాలు వెలిగించాను.. నాకు రుక్మిణి ఇప్పుడే కాదు చాలా రోజుల క్రితమే కనిపించింది. అంటే మాధవ్ భార్య రుక్మిణి కదా? అని ఆదిత్యను అడిగితే కాదు అని గట్టిగా అరిచి చెప్పాలి అనిపించేది.. నా భార్యను మాధవ్ భార్య అని అందరూ అంటుంటి నరకం అనుభవించాను.. ఆ ఇంటికి రుక్మిణికి ఎటువంటి సంబంధం లేదు.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి చేరింది.. ఆ ఇంటి మనిషిగా ఉంది.. అంతేకాని ఆ ఇంట్లో వారికి ఏం సంబంధం లేదు వారికి ఏం కాదు.. రుక్మిణి ఇప్పటికి ఈ ఇంటి కోడలే అని చెప్తాడు ఆదిత్య. ఆ మాటలు దేవుడమ్మా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే దేవి ఇంటికి వస్తుంది.. ఇదిగో దేవినే నీ మనవరాలు అంటూ దేవుడమ్మాకు ఆదిత్య చెబుతాడు.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.