- Home
- Entertainment
- చిరంజీవి గారి పాత్రలో నాకు శ్రీకృష్ణుడు కనిపించాడు.. గాడ్ ఫాదర్ కి, లూసిఫెర్ కి తేడా చెప్పిన సర్వధామన్ బెనర్జీ
చిరంజీవి గారి పాత్రలో నాకు శ్రీకృష్ణుడు కనిపించాడు.. గాడ్ ఫాదర్ కి, లూసిఫెర్ కి తేడా చెప్పిన సర్వధామన్ బెనర్జీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలు కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలు కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రతి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో కీలకమైన పీకేఆర్ పాత్రలో సీఎంగా, చిరంజీవి తండ్రిగా సర్వధామన్ బెనర్జీ నటించారు. ఆయన గురించి పరిచయం అవసరం లేదు. బెనర్జీ 90 దశకంలో దూరదర్శన్ లో ప్రసారం అయిన శ్రీకృష్ణ సీరియల్ లో కృష్ణుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఆలాగే చిరంజీవి స్వయం కృషి చిత్రంలో కూడా నటించారు.
బుల్లితెర శ్రీకృష్ణుడిగా నటించిన ఆయన చిరంజీవిని కృష్ణుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. నేడు గాడ్ ఫాదర్ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకి సర్వధామన్ బెనర్జీ కూడా హాజరయ్యారు. సర్వధామమ్ మాట్లాడుతూ.. నా డియర్ బ్రదర్ చిరంజీవి గారు ఈ చిత్రంలో చిన్న పాత్ర చేయాలని పిలిచారు. నేను పోషించిన పాత్ర చిన్నదే అయినప్పటికీ అందులో ఉండే కథనం, ట్విస్టులు, పాత్రలో వేరియేషన్స్ అద్భుతం అని అన్నారు.
ఇక సినిమాలో అసలు సిసలైన మ్యాజిక్ చిరంజీవి గారు. నేను మలయాళం వర్షన్ కూడా చూశాను. చిరంజీవి గారు చాలా డిఫెరెంట్ గా చేశారు. చిరంజీవి గారి పాత్రలో నాకు శ్రీకృష్ణుడు కనిపించారు. ఎక్కువ డైలాగ్స్ లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనే అద్భుతంగా చేసారు అని అన్నారు.
మలయాళీ చిత్రం అద్భుతమైన వెజిటేరియన్ వంటకం అయితే.. గడ్ ఫాదర్ చిత్రం అద్భుతమైన హైదెరాబాదీ బిర్యానీ అని అన్నారు. అంత అద్భుతంగా దర్శకుడు మోహన్ రాజా చేసారు అని అన్నారు.
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి సర్వధామన్ బెనర్జీ అభినందనలు తెలిపారు. సత్యదేవ్ నటన గురించి కూడా సర్వధామన్ బెనర్జీ అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో దర్శకుడు మోహన్ రాజా, సత్యదేవ్, దివి, సునీల్, మురళి మోహన్ లాంటి వారంతా పాల్గొన్నారు