- Home
- Entertainment
- Janhvi Sara: అన్నదమ్ములతో సారా, జాన్వీ కపూర్ డేటింగ్.. ముద్దు ముచ్చట్ల ఫోటోలు లీక్, నెట్టింట రచ్చ రచ్చ
Janhvi Sara: అన్నదమ్ములతో సారా, జాన్వీ కపూర్ డేటింగ్.. ముద్దు ముచ్చట్ల ఫోటోలు లీక్, నెట్టింట రచ్చ రచ్చ
కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో సమంత, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, అలియా, అనిల్ కపూర్ లాంటి సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రారంభం అయింది. కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో సమంత, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, అలియా, అనిల్ కపూర్ లాంటి సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు.
మొదటి ఎపిసోడ్ లో అతిథులుగా అలియా భట్, రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. రెండవ ఎపిసోడ్ లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ పాల్గొనడం విశేషం. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ఒకరిని మించేలా మరొకరు నవ్వులు పూయిస్తూ ఈ షోలో అల్లరి చేశారు. కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలని కూడా టచ్ చేస్తారు.
తాజా ఎపిసోడ్ లో కరణ్ జోహార్.. జాన్వీ కపూర్, సారా అలీఖాన్ డేటింగ్ గురించి షాకింగ్ ఫ్యాక్స్ లీక్ చేశారు. గతంలో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు తెలిపారు. ఇది వినగానే ఈ బిటౌన్ ముద్దు గుమ్మలు ఇద్దరూ షాక్ కి గురయ్యారు. ఇంత ఓపెన్ గా చెప్పేస్తారా అని కరణ్ జోహార్ తో అన్నారు.
అంతే కాదు ఆ అన్నదమ్ములు ఇద్దరూ తన అపార్ట్మెంట్ లోనే ఉండేవారు అని కరణ్ జోహార్ రివీల్ చేశారు. కరణ్ జోహార్.. వీళ్లిద్దరి డేటింగ్ టాపిక్ లీక్ చేయడంతో నెట్టింట రచ్చ రచ్చగా మారింది. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేసిన ఆ అన్నదమ్ములు ఎవరు అంటూ నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు.
దీనితో సారా అలీ ఖాన్, జాన్వీ గతంలో వీర్ పహారియా, శిఖర్ పహారియా అనే బ్రదర్స్ తో డేటింగ్ చేసినట్లు తేలింది. వీర్, శిఖర్ మరెవరో కాదు.. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవళ్లు. లాక్ డౌన్ టైంలో వారితో సారా, జాన్వీ డేటింగ్ చేశారట. దీనితో ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సారా అలీ ఖాన్.. వీర్ తో డేటింగ్ చేయగా.. జాన్వీ కపూర్ శిఖర్ తో ప్రేమాయణం సాగించింది. అన్న దమ్ములతో ఈ ముద్దుగుమ్మలు క్లోజ్ గా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీర్ తో సారా అలీ ఖాన్ ముద్దు ముచ్చట్లతో రొమాన్స్ చేస్తున్న ఇంటిమేట్ పిక్స్ దుమారం రేపుతున్నాయి. వీర్ తో తానూ డేటింగ్ చేసింది వాస్తవమే అని.. ఆ తర్వాత బ్రేకప్ కూడా అయ్యిందని సారా అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.