- Home
- Entertainment
- ఓటీటీలో సర్‌ప్రైజ్ చేయబోతున్న సంతానం మూవీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలో సర్‌ప్రైజ్ చేయబోతున్న సంతానం మూవీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
కమెడియన్ సంతానం కామెడీని వదిలేసి హీరోగా రాణిస్తున్నారు. అందులో భాగంగా `డెవిల్స్ డబుల్‌ః నెక్ట్స్ లెవల్` అనే చిత్రంలో నటించారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఓటీటీలోకి రాబోతున్న సంతానం `డీడీ నెక్ట్స్ లెవల్`
కోలీవుడ్ కమెడియన్ సంతానం నటించిన `డీడీ నెక్ట్స్ లెవల్` మూవీ మంచి విజయాన్ని సాధించింది. హర్రర్ కామెడీగా వచ్చి మెప్పించింది. `దిల్లుకు దుడ్డు`లో ఫ్రాంచైజీలో నాలుగో భాగం ఇది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కేవలం జీ5లో మాత్రమే స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం.
`డీడీ నెక్ట్స్ లెవల్` టీమ్ ఇదే
రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాస్యాన్ని అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తటంలో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న సంతానం ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఇంకా సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
యాక్షన్ హర్రర్ కామెడీగా ఆకట్టుకున్న `డీడీ నెక్ట్స్ లెవల్`
ఈ యాక్షన్ హర్రర్ కామెడీలో గందరగోళంతో పాటు ఆశ్చర్యపోయే కామెడీ, అలాగే చిన్నపాటి భయం కూడా ఉంటుంది. ఇప్పటికే థియేటర్ ఆడియెన్స్ ని మెప్పించింది. ఇప్పుడు కచ్చితంగా ఓటీటీ ఆడియెన్స్ ని కూడా ఎంటర్‌టైన్ చేస్తుంది. కథ విషయానికి వస్తే.. విమర్శనాత్మక స్వభావంతో వ్యవహరించే ఓ సినిమా రివ్యూవర్‌పై ఓ దర్శకుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.
అందువల్ల తనని ట్రాప్ చేయించి ఓ ప్లానింగ్ ప్రకారం శాపగ్రస్తమైన చిత్రంలో ఇరుక్కునేలా చేస్తాడు. ఓ మాయా డైరీ ఈ కథనాన్ని నియంత్రిస్తుంటుంది. అప్పుడు సదరు రివ్యూవర్ ప్రాణాంతకమైన ఆట నుంచి పోరాడి ఎలా బయటపడ్డాడనేదే సినిమా.
ఓటీటీలోకి రావడంపై డైరెక్టర్ కామెంట్
రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ మాట్లాడుతూ , `డీడీ నెక్ట్స్ లెవల్`తో రొటీన్‌గా ఉన్న హర్రర్, కామెడీ సినిమాలకు దక్కుతున్న ఆదరణ, వాటి హద్దులను చెరిపేయాలన్నదే నా లక్ష్యం. నవ్వించటంతో పాటు భయాన్ని కలిగించేలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాను.
సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్, గీతికా తివారి లాంటి అద్భుత నటులతో కలసి పని చేయడం ద్వారా నేను ఎలాంటి సినిమానైతే చేయాలనుకున్నానో రాజీపడకుండా అలాంటి చిత్రాన్ని తీశామని భావిస్తున్నా. జోనర్ సాంప్రదాయాల్ని మార్చుతూ, ప్రతి మలుపులో ఆశ్చర్యాలతో నిండిన సినిమాను తీర్చిదిద్దాం.
ఈ జర్నీ అంతా ఎంతో ఆనందంగా సాగింది. ఇలాంటి వినూత్న సినిమా డిజిటల్ ప్రీమియర్‌కి ZEE5 లాంటి ఉత్తమమైన వేదిక దొరకడం నిజంగా గర్వకారణం` అని అన్నారు.
సంతానం కామెంట్స్
నటుడు సంతానం మాట్లాడుతూ, `ఇటీవల నేను చేసిన పాత్రల్లో కిస్సా పాత్ర నా కెరీర్‌లో అత్యంత వినోదభరితమైనది. క్రియేటివ్ పరంగా సంతృప్తిని కలిగించింది. ఈ పాత్ర బోల్డ్‌గా ఉంటుంది, విలక్షణమైన పాత్ర. సినిమాలను విమర్శించే రివ్యూవర్ అనుకోకుండా తను ఇష్టంగా విమర్శించే సినిమాల్లాగే ఒక సినిమాలో చిక్కుకుంటాడు.
ఈ మెటా మాడ్‌నెస్, హర్రర్-కామెడీలోని మలుపులు, హంగామా అన్నీ కలిపి, అసలైన ఫన్ రైడ్‌గా మారాయి. ఇది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. లైట్లు ఆఫ్ చేసి, చేతిలో పాప్‌కార్న్ తీసుకుని ఎంజాయ్ చేయాల్సిన సినిమా` అని చెప్పారు.